GDL: భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ. 1 లక్ష నష్టపరిహారం చెల్లించాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఆకేపోగు రాంబాబు డిమాండ్ చేశారు. ఆదివారం ధరూర్ మండలం, చింతరేవులలో కార్యకర్తలతో కలిసి ఆయన మాట్లాడుతూ.. రైతులు లక్షల్లో పెట్టుబడులు పెట్టి పూర్తిగా నష్టపోయారని అన్నారు. ప్రభుత్వం కేవలం రూ. 10 వేలు మాత్రమే ఇస్తున్నారన్నారు.