VZM: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మను మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఆదివారం దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న మంత్రికి అక్కడి అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా అర్చకులు వేద ఆశీస్సులు అందజేశారు.