RR: షాద్ నగర్లో ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీవర్ధన్ రెడ్డి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందూ సంప్రదాయంలో వినాయక పూజకు విశిష్టమైన ప్రాధాన్యం ఉందని, ప్రతి శుభకార్యానికి ముందు వినాయక పూజ చేసే ఆచారం మన సాంప్రదాయ మహిమాన్వితం అని అన్నారు. ప్రతి ఒక్కరు మట్టి వినాయకులను పూజించాలన్నారు.