VSP: పెందుర్తికి బార్డర్గా ఉన్న దేశపాత్రుని పాలెం గ్రామంలో ఫిబ్రవరి 23న ఆదివారం శ్రీభూలోకమాంబ అమ్మవారి ఉత్సవం నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు తెలిపారు. ఉదయం ఊరేగింపుగా జాతర ప్రారంభమవుతుందన్నారు. ఆలయం వద్ద ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు.