VSP: మధురవాడ ఐటీ రోడ్డులోని శ్రీ ఉమా రామలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పూజలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరోజు తెల్లవారుజాము నుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని అర్చకులు సుబ్బారావు తెలిపారు. నమకం చమకం – మహన్యాస పూర్వక అభిషేకంతో ప్రారంభమై రుద్రాభిషేకం, అభిషేకాలు, లింగోద్భవ పూజలు ఉంటాయన్నారు. సోమవారం ప్రత్యేక అభిషేకాలు చేశారు.