CTR: వాల్మీకిపురంలోని కోనేటి వీధిలో ఉన్న శివాలయంలో గురువారం ఘనంగా పూజలు నిర్వహించారు. స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, అర్చనలు, విశేషాలంకరణ నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారికి పూజలు చేసి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించారు. భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.