వరుస సెలవులు రావడంతో తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు చేరుకుంటున్నారు. శ్రీవారి సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులు గురువారం సాయంత్రానికి రింగు రోడ్డులోని శిలాతోరణం వరకూ లైనులో వేచి ఉన్నారు. వీరికి దాదాపు 20 గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుందని టీటీడీ తెలిపింది. రద్దీ నేపథ్యంలో భక్తులు ఇవాళ ఉదయం సర్వదర్శనం క్యూ లైన్లోకి ప్రవేశించాలని మైక్సెట్లలో విజ్ఞప్తి చేస్తున్నారు.