»Crowd Of Devotees In Sabarimala Vehicles Stopped Everywhere
Sabarimala: శబరిమలలో భక్తుల రద్దీ..ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు
శబరిమలకు నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో క్యూ లైన్లలో గంటల తరబడి అయ్యప్ప భక్తులు స్వామి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేశారు.
శబరిమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. అయ్యప్పను దర్శించుకుని ఇరుముళ్లను సమర్పించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రద్దీని అదుపు చేయడానికి ఎరుమేలి నుంచి వాహనాలను ఎక్కడికక్కడ ఆపివేశారు. శుక్రవారం నుండి డిసెంబర్ 25వ తేది వరకు కూడా వర్చువల్ క్యూ బుకింగ్లు భారీగా పెరగడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అన్ని రోజులలో 80,000 కంటే ఎక్కువగా బుకింగ్స్ ఉండటం విశేషం.
శబరిమలకు దేశం నలుమూలల నుంచి అయ్యప్ప దర్శనం కోసం వస్తున్న అయ్యప్ప భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కిలోమీటర్ల మేరా అయ్యప్ప భక్తులు స్వామి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు 16 గంటలకు పైగా సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా మార్గమాధ్యలోనే వాహనాలను పోలీసులు గంటల తరబడి నిలిపివేస్తూ వస్తున్నారు. మరోవైపు భారీ క్యూలైన్ల కారణంగా వృద్దులు, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
If I mentioned earlier that there is not enough police at Sabarimala, I am wrong. There is enough to surely push the devotees around, not to serve pic.twitter.com/JsXcb1mJuA