తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవ వేడుకలు ఇవాళ్టితో ముగియనున్నాయి. 3 రోజుల వేడుకల్లో భాగంగా చివరి రోజయిన ఇవాళ భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటు శ్రీసీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవంలో పాల్గొంటారు.