తనతో సహజీవనం చేసే యువకుడి ఫోన్లో 13 వేలకు పైగా నగ్న ఫోటోలు ఉండటాన్ని చూసి యువతి షాక్ అయ్యింది. అందులో తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ఫోటోలు ఉండటాన్ని గమనించి వారికి తెలిపింది. అందరూ సైబర్ పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
ఓ ఆఫీసులో పనిచేస్తున్న యువకుడితో అదే ఆఫీసులో ఉండే యువతి సహజీవనం చేస్తోంది. కొంతకాలంగా వారిద్దరూ ఇష్టప్రకారంగా లివింగ్ రిలేషన్లో ఉంటూ వస్తున్నారు. అయితే తన ప్రేమికుడి ఫోన్లో ఆ యువతి కుప్పలు కుప్పలుగా నగ్న ఫోటోలను (Nude Photos) చూసింది. తన కంపెనీలో పనిచేసిన సీనియర్లు, ఇతర మహిళా ఉద్యోగులకు సంబంధించిన 13 వేల నగ్న ఫోటోలను ఆ యువతి చూసి షాక్ అయ్యింది. వెంటనే ఆ విషయాన్ని తన సీనియర్లకు తెలిపింది. వారంతా కలిసి సైబర్ క్రైమ్ పోలీసులకు (Cyber crime police) ఫిర్యాదు చేయగా పోలీసులు రంగంలోకి దిగారు.
ఇప్పటి వరకూ ఆ ఫోటోలతో యువకుడు ఎవ్వరినీ బెదరించలేదు. ఎవరినీ బ్లాక్ మెయిల్ చేయడం వంటి ఘటనలకు పాల్పడలేదని పోలీసులు గుర్తించారు. బెంగళూరు (Bengaluru)కు చెందిన రంగీలా (పేరు మార్చాం) ఓ బీపీవో కంపెనీలో పనిచేస్తుండగా అదే కంపెనీలో సంతోష్ అనే వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు. కొన్నాళ్లుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. అయితే ఒక రోజు ఇద్దరూ సన్నిహితంగా ఉన్నప్పుడు సంతోష్ ఫోటోలు తీశాడు. వాటిని ఫోన్లో నుంచి తొలగించాలని రంగీలా ఎంత చెప్పినా సంతోష్ వినలేదు. ఆఖరికి ఒక రోజు సంతోష్ నిద్రిస్తుండా రంగీలా ఆ ఫోన్ తీసుకుని ఫోటోలను డిలీట్ చేసే ప్రయత్నం చేసింది.
అయితే సంతోష్ ఫోన్లో వందల కొద్దీ నగ్న ఫోటోలు (Nude Photos) ఉండటాన్ని గమనించింది. ఏకంగా 13 వేల న్యూడ్ ఫోటోలు ఉండటం చూసి రంగీలా షాక్ అయ్యింది. తమ సీనియర్ ఉద్యోగుల ఫోటోలు కూడా ఉన్నట్లు గుర్తించి వారికి విషయం చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సంతోష్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడి ఫోన్లో కొన్ని నిజమైన ఫోటోలు, మరికొన్ని మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.
బెంగళూరు సైబర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంతోష్ ఇప్పటి వరకూ ఆ ఫోటోలతో ఎవ్వరినీ బెదిరించకపోయినా భవిష్యత్తులో బెదిరించే అవకాశం ఉందని మహిళా ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. రంగీలా ఫిర్యాదుతో ఆదిత్యపై కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ కేసును బెంగళూరు సైబర్ పోలీసులు (Bengaluru Cyber Police) విచారిస్తున్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.