»First Year Engineering Student Commits Suicide At Basara Triple It
RGUKT Suicide: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య.. కారణం ఇదే
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. ఆదివారం మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో ట్రిపుల్ ఐటీలో ఏదో జరుగుతోందని కలకలం రేగింది.
RGUKT Suicide: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. ఆదివారం మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో ట్రిపుల్ ఐటీలో ఏదో జరుగుతోందని కలకలం రేగింది. వ్యక్తిగత కారణాల వల్లే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లా తోటకుర్తి గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ ఆర్జీయూకేటీ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తెలంగాణలో ఈ నెల 30న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యూనివర్సిటీ అధికారులు విద్యార్థులకు సెలవులు ఇచ్చారు. ఇళ్లకు వెళ్లే వారికి ఔట్ పాస్‌లు ఇస్తున్నారు.
ప్రవీణ్ కుమార్ తో పాటు అతని స్నేహితులు కూడా ఔట్ పాస్ కోసం దరఖాస్తు చేసుకున్నారని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ప్రవీణ్ కుమార్ స్నేహితుడు ఔట్ పాస్ తీసుకుని ఉదయం బయటకు వెళ్లాడు. ఆ తర్వాత చాలా సేపటికి ప్రవీణ్ బయటకు రాలేదు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అతని స్నేహితుడు యూనివర్సిటీ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వర్సిటీ పరిసరాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. చివరకు బీహెచ్లోని ఖాళీ గదిలో ప్రవీణ్ ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో బైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న గదికి తాళాలు వేయకుండా ఖాళీగా ఉంచడంపై మరికొందరు విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల కిందటే ప్రవీణ్ తల్లి గుండెపోటుతో మరణించింది. ప్రవీణ్ తండ్రి ఇటీవలే మరో పెళ్లి చేసుకున్నాడని, దీంతో తీవ్ర మనస్థాపానికి గురైనట్లు ప్రవీణ్ స్నేహితులు చెబుతున్నారు. తన రెండో పెళ్లి విషయాన్ని బంధువులకు చెప్పడంతో తండ్రి మనస్తాపానికి గురయ్యాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రవీణ్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.