»The Son Who Killed His Mother Because The Cooking Was Not Tasty
Maharashtra: షాకింగ్.. వంట రుచిగా లేదని తల్లిని హత్య చేసిన కొడుకు!
ఓ యువకుడు తన తల్లి చేసిన వంట రుచిగా లేదని కోపంతో రగిలిపోయాడు. ఆవేశంలో తన తల్లిని క్రూరంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. తల్లిని హత్య చేసిన తర్వాత మనస్తాపంతో నిందితులు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఓ తల్లి చేసిన వంట రుచిగా లేదని ఆమె కొడుకు దారుణంగా హత్య చేశాడు. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్ర (Maharastra)లోని థానే జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు..మహారాష్ట్రలోని థానే జిల్లా ముర్బాద్ వద్ద వేలు అనే గ్రామంలో ఓ వ్యక్తి తన తల్లితో పాటు నివశిస్తున్నాడు. ప్రతి రోజూ ఆ యువకుడు తన తల్లితో గొడవపడుతూ ఉండేవాడు. పలు సమస్యలపై ఆ తల్లీకుమారుల మధ్య నిత్యం వాగ్వాదం జరుగుతూ ఉండేది.
ఈ తరుణంలో ఆ యువకుడికి తల్లి భోజనం (Food) వడ్డించింది. అది తిన్న కొడుకు తన తల్లి చేసిన వంటలు రుచిగా లేవని గొడవకు దిగాడు. తల్లిపై కోపంతో రగిలిపోయాడు. ఆ క్రమంలోనే ఇంట్లో ఉన్న కొడవలిని తీసుకుని తన తల్లిపై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ తల్లి అక్కడికక్కడే మరణించింది. స్థానికులు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తన తల్లిని హత్య చేసిన తర్వాత ఆ యువకుడు మనస్తాపంతో నిద్రమాత్రలను అధిక మోతాదులో మింగాడు. ఆత్మహత్య (Suicide)కు పాల్పడిన ఆ యువకుడిని బంధువులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు నిందితుడిపై భారత శిక్షాస్మృతి సెక్షన్ 302 ప్రకారంగా కేసు నమోదు చేశారు. థానే రూరల్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.