»11 People Died When The Elevator Collapsed In The Mine
Platinum Mine: గనిలో ఘోరం..ఎలివేటర్ కూలి 11 మంది దుర్మరణం
గనిలో ఎలివేటర్ కూలిపోవడం వల్ల 11 మంది చనిపోగా మరో 75 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటన సౌత్ ఆఫ్రికాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Platinum Mine: గనిలో ఎలివేటర్ కూలి 11 మంది దుర్మరణం (11 died) చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ దారుణ ఘటన దక్షిణాఫ్రికా (South Africa)లో చోటుచేసుకుంది. ఓ ప్లాటినం గనిలో పనులు జరుగుతుండగా ఎలివేటర్ (Elevator) కూలింది. అందులో 11 మంది మరణించగా చాలా మందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దారుణం రస్టెన్బర్గ్ ప్రాంతంలోని ప్లాటినం గనిలో చోటుచేసుకుంది.
కార్మికులు తమ విధులను ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఎలివేటర్ అకస్మాత్తుగా కూలింది. 200 మీటర్ల వరకూ ఎలివేటర్ (Elevator) కిందకు పడిపోవడంతో 11 మంది చనిపోయినట్లు గని ఆపరేటర్ వెల్లడించాడు. ఈ ఘటనలో దాదాపు 75 మంది గాయాలపాలైనట్లుగా (75 members injured) అధికారులు తెలిపారు. గాయాలపాలైన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఎలివేటర్ కూలిపోవడానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదం జరగడంతో గని (Mine)లో అన్ని పనులను నిలిపివేశారు. ఈ ఘటనపై ఇంప్లాంట్స్ సీఈవో నికో ముల్లర్ (CEO Nico Muller) మీడియాతో మాట్లాడారు. ఇంప్లాట్స్ (Implats) చరిత్రలోనే ఇదొక చీకటి రోజని తెలిపారు. క్షతగాత్రులకు సరైన వైద్యం అందిస్తున్నామని, మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు.