MHBD: మహబూబాద్ జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో రేపు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి టి. రజిత తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన యువకులు అర్హులని ఆమె వెల్లడించారు. ఉదయం 10 గంటల లోపు అర్హత పత్రాలతో జాబ్ మేళాకు హాజరుకావాలని సూచించారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
KNR: కరీంనగర్ శిశుగృహ నుంచి పిల్లలను దత్తత తీసుకున్న దంపతులకు జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఉత్తర్వులు అందజేశారు. కరీంనగర్ శిశు గృహలో పెరుగుతున్న శిశువును సిద్దిపేటకు చెందిన దంపతులు, మరో ఇద్దరు చిన్నారులను తమిళనాడుకు చెందిన ఇద్దరు దంపతులు దత్తత తీసుకున్నారు. వీరికి కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా దత్తత ఉత్తర్వులు అందజేశారు.
NRML: కడెం మండలం కల్లెడలో 10వ శతాబ్దానికి చెందిన పురాతన ఆలయాన్ని చరిత్ర పరిశోధకుడు కరిపె రాజ్ కుమార్ గుర్తించారు. స్థానిక మల్లన్న ఆలయంలో చాళుక్య శైలిలో ఉన్న అద్భుతమైన రాతి స్తంభాలు, ద్వారపాలకులు, త్రిశూలం, గద ఆకృతులు వెలుగుచూశాయి. ఈ అరుదైన చారిత్రక సంపదను ప్రభుత్వం వెంటనే గుర్తించి కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
MBNR: మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి అధిక నిధులు కేటాయించి వారి సంక్షేమానికి కృషి చేయాలని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు గోనెల శ్రీనివాసులు పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ ఫిషరీస్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలపై వినతిపత్రం అందించారు. ఈ సమస్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
MNCL: హాజీపూర్ మండలం గుడిపేటలోని ఆవాస పాఠశాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. పాఠశాలలో చేపట్టిన అదనపు గదులు, ఇతర అభివృద్ధి పనులను పరిశీలించి, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వంటశాలలో నిత్యావసర సరుకులు, తాజా కూరగాయలు వినియోగించాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేలా సిబ్బంది నిబంధనలు పాటించాలని తెలిపారు.
SRCL: విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే అర్హులైన అభ్యర్థుల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. టామ్కామ్ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియా,కెనడా, జర్మనీ, జపాన్,యూకే, యూఏఈ తదితర దేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఆసక్తి గల వారు తమ 2 tomcom.resume@gmail.com మెయిల్ చేయాలని సూచించారు. పూర్తి వివరాలకు 94400 49520, 94400 52081 సంప్రదించాలన్నారు.
MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల దేవస్థానంలో మంగళవారం అమ్మవారికి భౌమ వాసరే ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాల్గుణ మాసం కృష్ణపక్షం త్రయోదశి స్థితి పురస్కరించుకొని అమ్మవారికి పంచామృతాలు మంజీరా నది పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. పవిత్రవ్యాలు పట్టు వస్త్రాలు సమర్పించి సుగంధ పుష్పాలతో అలంకరించి మహా మంగళ హారతి నైవేద్యం సమర్పించారు.
WGL: నగరంలోని CKM ఆసుపత్రిని సిబ్బంది కమర్షియల్‌గా మార్చేస్తున్నారని రోగుల బంధువులు ఆరోపించారు. పేద రోగులకు ఉచితంగా వైద్యం అందించాలని సర్కార్ ఆదేశించగా, దానికి భిన్నంగా ఉందని అన్నారు. 6 ఆర్ఎంవోలు ఉన్నప్పటికీ పర్యవేక్షణ లేకపోవడం వలన సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి రోగులకు ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
HYD: సనత్‌నగర్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవం వాయిదా పడింది. తొలుత 19న ఉగాది రోజున ప్రారంభిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే, పలు విభాగాలు ఇంకా పూర్తి స్థాయిలో ఏర్పాటు కాకపోవడంతో రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు.
ASF: ఆసిఫాబాద్ నియోజకవర్గానికి రావాల్సిన పెండింగ్ నిధులు విడుదల చేసి, అభివృద్ధి పనులను కొనసాగించాలని అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేయబోతున్నట్లు MLA కోవలక్ష్మి ప్రకటనలో తెలిపారు. అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిల నిర్మాణాలను తక్షణమే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని నిలదీస్తానని అన్నారు. సాగునీరు, తాగునీరు, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వ తీరును ఎండగడతానని MLA పేర్కొన్నారు.
KMR: కామారెడ్డి లోని ప్రభుత్వ మెడికల్ కళాశాల అభివృద్ధి కోసం మరింత భూమిని, 60 అడుగుల అప్రోచ్ రోడ్డును మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డి కోరారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డితో కలిసి వినతిపత్రం అందజేశారు. పోస్ట్ గ్రాడ్యు యేషన్ కోర్స్‌కు 32 సీట్లు కేటాయించాలని ప్రతిపాదించినట్లు తెలిపారు.
NLG: నిడమనూరు మండలం ఎర్రబెల్లికి చెందిన పెద్దమాము లక్ష్మమ్మ అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న ప్రజా నాయకుడు బుసిరెడ్డి పాండురంగారెడ్డి నిమ్స్‌కు వెళ్లి ఆమెను పరామర్శించి, రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. ఆయన వెంట పెద్దమాము ప్రశాంత్, లాలయ్య తదితరులు ఉన్నారు.
NZB: నిజామాబాద్-1 డిపో కార్గో పార్సిల్‌కు సంబంధించిన వస్తువులను ఈనెల 18న వేలం వేయనన్నట్లు డిపో మేనేజర్ ఆనంద్ తెలిపారు. నిజామాబాద్ కార్గో ఆఫీస్ బస్టాండ్ ఎదుట మధ్యాహ్నం 3 గంటలకు వేలం ప్రక్రియ ప్రారంభించనున్నట్లు డిపో మేనేజర్ చెప్పారు. ఆసక్తి గల వారు పాల్గొనాలని సూచించారు.
WNP: జిల్లా కేంద్రంలోని రామ్ నగర్ కాలనీలో ఉన్న పార్కుని డెవలప్ చేయాలని బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు బత్తిని మధు సోమవారం ‘ప్రజావాణి’లో కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. పార్కులో వ్యాయామశాల, వాకింగ్ ట్రాక్ గ్రీనరీని ఏర్పాటు చేయాలని వారు కోరారు. కలెక్టర్ స్పందించి మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.