• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మునగాల ఇంఛార్జ్ ఏఈవో ఇతనే..!

SRPT: మునగాల క్లస్టర్ (మునగాల, కలకోవా, నారాయణగూడెం) ఏఈవో ఎం.రమ్య తేజ 6 నెలల ప్రసూతి సెలవుపై వెళ్లడంతో, రేపాల ఏఈవో బీ.నాగుకు ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించినట్లు ఎంఏవో బి.రాజు ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. కావున, ఈ గ్రామాల రైతులు వ్యవసాయ పనుల కోసం ఏఈవో బీ.నాగును 7815961392 ను సంప్రదించాలని ఆయన కోరారు.

March 18, 2026 / 04:19 PM IST

అదనపు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసిన కౌన్సిలర్

MHBD: అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పోను 2వ వార్డు కౌన్సిలర్ అంబాల శివకుమార్, యూత్ సభ్యులు కలిసి వినతిపత్రం అందజేశారు. 2వ వార్డు పరిధిలో ఉన్న గ్రామ పంచాయితీ కార్యాలయంలో మెటీరియల్ గత పది సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉందని, గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రజలకు వినియోగంలోకి తీసుకురావాలన్నారు.

March 18, 2026 / 04:15 PM IST

‘అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం’

NRML: జిల్లా అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కలెక్టరేట్‌లో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిధ శాఖల్లోని మహిళా ఉద్యోగులను కలెక్టర్ శాలువాతో ఘనంగా సన్మానించారు. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.

March 18, 2026 / 04:13 PM IST

‘మొక్కజొన్నకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి’

JGL: రాయికల్ మండలంలో మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని, యూత్ కాంగ్రెస్ రాయికల్ మండల అధ్యక్షుడు ఏలేటి జలంధర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాయికల్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. రైతులకు గిట్టుబాటు ధర అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వం ఆలస్యం చేస్తే రైతులు నష్టపోతారన్నారు.

March 18, 2026 / 04:11 PM IST

నియోజకవర్గ సమస్యలపై గలమెత్తిన MLA పల్లా

JN: నియోజకవర్గంలో రోడ్ల పనులు దాదాపు రెండేళ్లుగా పూర్తిగా నిలిచిపోయాయని MLA డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. 131 గ్రామాలు, 2 పట్టణాలు, 42 వార్డులున్న నియోజకవర్గంలో బస్సుల సమస్య తీవ్రంగా ఉందని, రోజుకు కేవలం 2 ట్రిప్పులు మాత్రమే నడుస్తున్నాయని అన్నారు. వెంటనే రోడ్ల పనులు, బస్సుల సంఖ్య పెంచాలని కోరారు.

March 18, 2026 / 04:09 PM IST

కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే

BHNG: ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఇవాళ కలెక్టరేట్‌లో కలెక్టర్ అనురాగ్ జయంతిని కలిశారు. ఈ సందర్భంగా ఆలేరు మండల పరిధిలో ఉన్న సుమారు 1,600ల పేద ప్రజల ఇళ్ల స్థలాలను, భూములను 22-A  Act-1908, POT Act-1977 పేరుతో ప్రోహిబిటెడ్ జాబితాలో చేర్చారు. POT చట్టాన్ని రద్దు చేసి భూములను రెగ్యులర్ చేయాలని ఎమ్మెల్యే కలెక్టర్‌కి వినతిపత్రాన్ని అందజేశారు.

March 18, 2026 / 04:04 PM IST

ఆలయ పునర్నిర్మాణానికి స్థల పరిశీలన

NRPT: మరికల్ మండల కేంద్రంలోని అభయాంజనేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణానికి బుధవారం స్థపతులు శ్రావణ్ కుమార్ శర్మ, బాలమురళీ కృష్ణలు స్థలాన్ని పరిశీలించారు. వారికి ఆలయ నిర్మాణ కమిటీ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. హైందవ సాంప్రదాయ ప్రకారం, ఇతిహాసాలతో నూతన ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు.

March 18, 2026 / 04:04 PM IST

రామడుగు పేరు వెనుక కథ ఇదేనా..?

NLG: అనుముల మండలంలోని రామడుగు గ్రామం భక్తి విశ్వాసాలకు నిలయంగా ప్రసిద్ధి చెందింది. స్థానిక పురాణాల ప్రకారం అరణ్యవాస సమయంలో శ్రీరాముడు ఇక్కడ అడుగు పెట్టడంతో గ్రామానికి రామడుగు అనే పేరు వచ్చిందని  స్థానికులు నమ్మకం. అహల్య వాగులో ఉన్న రాముడి పాదం ఈ గాథకు నిదర్శనంగా భావిస్తారు. భక్తులు ఈ ప్రదేశాన్ని దర్శించి విశేష భక్తిని చాటుకుంటున్నారు.

March 18, 2026 / 04:03 PM IST

విద్యుత్ శాఖ డైరెక్టర్‌కు వినతి

HNK: వీల్స్ వెల్ఫేర్ ట్రస్ట్ బోర్డు భవనానికి విద్యుత్ శాఖ అధికారులు అకారణంగా విధించిన అపరాధ రుసుమును రద్దు చేయాలని ఇవాళ మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. విధించిన జరిమానాను తక్షణమే రద్దు చేయడంతో పాటు భవనానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరారు.

March 18, 2026 / 04:03 PM IST

గ్యాస్ బుకింగ్‌పై కలెక్టర్ కీలక ఆదేశాలు

GDWL: గద్వాలలోని గ్యాస్ ఏజెన్సీలను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా బుధవారం అకస్మాత్తుగా తనిఖీ చేశారు. గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, వినియోగదారులు ఆందోళన చెందవద్దని ఆయన స్పష్టం చేశారు. కొత్త నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో రెండు బుకింగ్‌ల మధ్య 45 రోజుల గడువు, పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల గడువు తప్పనిసరి అని తెలిపారు.

March 18, 2026 / 04:02 PM IST

‘ముదిరాజుల పట్ల సీఎంకి చిత్తశుద్ధి లేదు’

SDPT: ముదిరాజుల పట్ల సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ఆరోపించారు. బుధవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డిలో ఇచ్చిన హామీ బీసీ డిక్లరేషన్ చేయకుండా ముదిరాజులను బీసీ ఏలో చేర్చకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.

March 18, 2026 / 04:02 PM IST

షెడ్యూల్ కులాలకు 409 యూనిట్లు మంజూరు

SRD: 2025 26 సంవత్సరానికి షెడ్యూల్ కులాలకు 409 యూనిట్లు మంజూరైనట్లు అదనపు కలెక్టర్ పాండు తెలిపారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. షెడ్యూల్ కులాల సంక్షేమ పథకాలకు బ్యాంకర్లు పూర్తిస్థాయిలో సహకారం అందించాలని చెప్పారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

March 18, 2026 / 04:02 PM IST

పండుగను స్నేహపూర్వకంగా జరుపుకోవాలి: మేయర్

MBNR: స్నేహపూర్వక వాతావరణంలో మైనార్టీలు రంజాన్ పండుగను జరుపుకోవాలని మహబూబ్ నగర్ మేయర్ గుమ్మాల మమతా శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. బుధవారం కార్పొరేషన్ పరిధిలోని 37వ వార్డులో మైనార్టీలకు రంజాన్ సందర్భంగా నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలకు అండగా నిలుస్తుంది అన్నారు.

March 18, 2026 / 04:01 PM IST

పండుగను స్నేహపూర్వకంగా జరుపుకోవాలి: మేయర్

MBNR: స్నేహపూర్వక వాతావరణంలో మైనార్టీలు రంజాన్ పండుగను జరుపుకోవాలని మహబూబ్ నగర్ మేయర్ గుమ్మాల మమతా శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. బుధవారం కార్పొరేషన్ పరిధిలోని 37వ వార్డులో మైనార్టీలకు రంజాన్ సందర్భంగా నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలకు అండగా నిలుస్తుంది అన్నారు.

March 18, 2026 / 04:01 PM IST

‘తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించాలి’

MNCL: చిన్నారుల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించాలని దండేపల్లి మండలంలోని గుడిరేవు ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం బుచ్చయ్య అన్నారు. బుధవారం ఆ పాఠశాల ఆవరణలో ‘అమ్మానాన్న ఆశీర్వాదం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు తమ తల్లిదండ్రుల కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.

March 18, 2026 / 03:55 PM IST