• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పిడుగుపాటుకు పాడి ఆవు మృతి

KNR: సైదాపూర్ మండలంలోని గుండ్లపల్లిలో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి పిడుగు పడి రైతు రచ్చ రాజుకు చెందిన పాడి ఆవు మృతి చెందింది. నిత్యం పాలిస్తూ జీవనాధారంగా ఉన్న ఆవు మరణించడంతో ఆ పేద కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. పాడిపైనే ఆధారపడి బతుకుతున్న తమకు నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

March 18, 2026 / 03:32 PM IST

పిడుగుపాటుకు పాడి ఆవు మృతి

KNR: సైదాపూర్ మండలంలోని గుండ్లపల్లిలో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి పిడుగు పడి రైతు రచ్చ రాజుకు చెందిన పాడి ఆవు మృతి చెందింది. నిత్యం పాలిస్తూ జీవనాధారంగా ఉన్న ఆవు మరణించడంతో ఆ పేద కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. పాడిపైనే ఆధారపడి బతుకుతున్న తమకు నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

March 18, 2026 / 03:32 PM IST

కొనసాగుతున్న గ్యాస్ కష్టాలు.. బారులు తీరిన జనాలు

BHNG: జిల్లాలో గ్యాస్ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. మోత్కూరు భారత్ గ్యాస్ గోడౌన్ వద్ద వినియోగదారులు వంటగ్యాస్ కోసం బారులు తీరారు. గత రెండు మూడు రోజులుగా వంట గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. గురువారం కార్యాలయానికి గ్యాస్ వస్తుందన్న సమాచారం తెలుసుకున్న వినియోగదారులు పెద్ద ఎత్తున తరలివచ్చి క్యూ లైన్‌లో నిలబడ్డారు.

March 18, 2026 / 03:32 PM IST

గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి

MDK: గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు చేగుంట మండలం పోలంపల్లి సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మిస్వామి పేర్కొన్నారు. పోలంపల్లి పంచాయతీ పరిధి మూడో వార్డులో వార్డు సభ్యులు చింతకాయల ప్రవీణ్‌తో కలిసి మొరం పనులను పరిశీలించారు. మురుగు కాల్వను శుభ్రం చేస్తూ, ఇబ్బందులు ఉన్నచోట మట్టిని పోస్తున్నట్లు వివరించారు.

March 18, 2026 / 03:31 PM IST

‘గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం’

WGL: గ్రామాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని నల్లబెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి అన్నారు. ఇవాళ మండలంలోని గుండ్లపాడు GPలో EGS నిధులతో CC రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల మెరుగుదల కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

March 18, 2026 / 03:30 PM IST

మన్యంకొండలో వసంత నవరాత్రులు

MBNR: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మార్చి 19 నుంచి 28 వరకు వసంత నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఉగాది నాడు పంచాంగ శ్రవణం, 28న శ్రీరామ నవమి వేడుకలు, కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. 29న శ్రీరామ పట్టాభిషేకంతో ఉత్సవాలు ముగుస్తాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ అధికారులు కోరారు.

March 18, 2026 / 03:30 PM IST

ఉగాది పురస్కారం అందుకున్న డాక్టర్ శంకర్ బాబు

NGKL: లింగాల మండలం దారారం గ్రామానికి చెందిన డాక్టర్ నూకల శంకర్ బాబు బుధవారం హైదరాబాద్లో ఉగాది పురస్కారం అందుకున్నారు. మయూరి ఆర్ట్స్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఇచ్చే ఈ అవార్డును పలువురు సినీ నటులు, రాజకీయ నేతల చేతుల మీదుగా ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా శంకర్ బాబుకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

March 18, 2026 / 03:30 PM IST

ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సర్పంచ్

NGKL: లింగాల మండలం వడ్డె రాయవరం గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీని సర్పంచ్ పబ్బతి శ్రీను యాదవ్ బుధవారం నెరవేర్చారు. పంచాయతీ ఎన్నికల సమయంలో గ్రామంలో నెలకొన్న నీటి ఎద్దడిని తీరుస్తానని మాట ఇచ్చిన మేరకు, తాజాగా కొత్త తాగునీటి బోరును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ పస్పుల శివయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

March 18, 2026 / 03:30 PM IST

ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక తనిఖీ కలెక్టర్ అంకిత్

BDK: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ టేకులపల్లి మండలం కోయగూడెం ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో తెలుగు, ఇంగ్లీష్ పుస్తకాలు చదివించిన ఆయన, వారి పఠన సామర్థ్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉపాధ్యాయులను ఈ సందర్భంగా హెచ్చరించారు.

March 18, 2026 / 03:30 PM IST

రేపు దేవరకొండలో ‘ఉగాది కవి సమ్మేళనం’

NLG: దేవరకొండలోని గ్రంథాలయంలో గురువారం తెలంగాణ సాహిత్య సాంస్కృతిక అధ్యయన వేదిక ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సరం సందర్భంగా ‘ఉగాది కవి సమ్మేళనం’ నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు పర్చా వాసుదేవరావు తెలిపారు. సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. దేవరకొండ నియోజకవర్గంలోని కవులు, రచయితలు, సాహితీ అభిమానులు, కళాకారులు హాజరు కావాలని కోరారు.

March 18, 2026 / 03:28 PM IST

‘పశువులకు వ్యాధి సోకకుండా టీకాలు వేయించాలి’

NLG: పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా ముందస్తుగా టీకాలు వేయించాలని చిట్యాల పశువైద్యాధికారి వనం అభినవ్ సూచించారు. రైతులు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా తమ పశువులకు టీకాలు వేయించి ఆరోగ్యంగా ఉంచుకోవాలని కోరారు. టీకాల ద్వారా ప్రాణాంతక వ్యాధుల నుంచి పశువులను రక్షించుకోవచ్చని, ఉచిత టీకా కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

March 18, 2026 / 03:22 PM IST

జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

NZB: జిల్లా ప్రజలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరికి శుభాలు చేకూరాలని ఆకాంక్షించారు. తెలుగు నామాది నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో ఆనందోత్సాహాలు నింపాలని అభిలాషించారు. ఉగాది పండగను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అన్నారు.

March 18, 2026 / 03:20 PM IST

‘నిర్వాసితులందరికీ అక్కడే ఇల్లు నిర్మించి ఇవ్వాలి’

KMM: ఖమ్మం వెలుగుమట్ల నిర్వాసితులందరికీ ఇళ్లు కూల్చిన చోటే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని CPI ML న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు అవునురి మధు కోరారు. బుధవారం ఖమ్మం వచ్చిన నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. భూదాన్ భూముల్లో 700 ఇళ్లకు పైగా కూల్చివేసిన ప్రభుత్వం 311 మందికి మాత్రమే ఇళ్ల పట్టాలు ఇచ్చిందన్నారు.

March 18, 2026 / 03:19 PM IST

నూతన ఎస్సైని సన్మానించిన BRS నాయకులు

BHPL: గోరికొత్తపల్లి మండల నూతన ఎస్సైగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సాయి త్రిలోక్ నాథ్ రెడ్డిని బుధవారం రేగొండ BRS మండల యువజన నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్సైని శాలువతో ఘనంగా సన్మానించారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఎస్సై సూచించారు. BRS నేతలు ఉన్నారు.

March 18, 2026 / 03:19 PM IST

మంత్రి, ఎమ్మెల్సీలను కలిసిన రాష్ట్ర అధ్యక్షురాలు

WGL: తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఇటీవల నియమితులైన ఎర్రబెల్లి స్వర్ణ బుధవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్, MLC సారయ్యలను మర్యాదపూర్వకంగా కలిశారు. తన నియామకానికి సహకరించినందుకు ఆమె వారికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, మహిళా సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా కృషి చేయాలని వారు ఆమెకు సూచించారు.

March 18, 2026 / 03:17 PM IST