• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పరాభవ నామ ఉగాది జమ్ములమ్మ ప్రత్యేక అలంకరణ

గద్వాల జిల్లా సమీపంలో వెలసిన జమ్మిచెడు జమ్ములమ్మ అమ్మవారికి గురువారం పరాభవ నామ సంవత్సరాది ఉగాది సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారికి కృష్ణా నది జరాలతో అభిషేకం, ఆకు పూజ, హోమం, తదితర కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగు కొత్త సంవత్సరం వచ్చిన సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ భక్తులు హాజరైనట్లు ఆలయ అర్చకులు తెలిపారు.

March 19, 2026 / 08:10 AM IST

ఉగాది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి: మంత్రి ఉత్తమ్

సూర్యాపేట జిల్లా ప్రజలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. పరాభవ నామ సంవత్సరంలో అంతా మంచే జరగాలని, ప్రజలందరి జీవితాల్లో ఆశలు చిగురించాలని కోరారు. ప్రకృతి కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, రైతులతో పాటు అన్ని రంగాల్లో ప్రజలు అభివృద్ధిలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

March 19, 2026 / 08:08 AM IST

మహిళ హత్య కేసులో నిందితుడు అరెస్ట్

ASF: పెంచికల్ పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన గర్భిణీ సమ్మక్క హత్య కేసులో నిందితుడు కేర్కర్ జలపతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో మోసం చేసి, ఆమె గర్భం దాల్చడంతో అడవిలోకి తీసుకెళ్లి నిందితుడు దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాగజ్ నగర్ DSP వహీదుద్దీన్ ఆధ్వర్యంలో నిందితుడిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచి, రిమాండ్ తరలించారు.

March 19, 2026 / 08:04 AM IST

స్నేహితుడి స్మారకర్థం.. చలి వేంద్రం ఏర్పాటు

JGL: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన మారుపాక వినోద్ స్మారకార్థం అతని స్నేహితులు కోరుట్ల పట్టణంలోని పాత మున్సిపల్ ముందు చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని వినోద్ తండ్రి చేతుల మీదుగా ప్రారంభించారు. వినోద్‌పైన ఉన్న అభిమానంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు అతడి మిత్రులు తెలిపారు.

March 19, 2026 / 08:04 AM IST

గ్రామాలను గంజాయి రహితంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

ADB: సర్పంచులు, కౌన్సిలర్లు తమ పరిధిలోని గ్రామాలను, వార్డులను గంజాయి రహితంగా మార్చాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. యువత డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు ‘మూడవ కన్ను’లా పనిచేస్తాయని, ప్రతి ఒక్కరూ వీటి ఏర్పాటుపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.

March 19, 2026 / 08:02 AM IST

జిల్లా ప్రజలకు కలెక్టర్ ఉగాది శుభాకాంక్షలు

NRPT: పరాభవ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు నింపాలని, పాడిపంటలతో కళకళలాడాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆకాంక్షించారు. ఆయన జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలకు ఉగాది పండుగ ఎంతో విశిష్టమైందని అన్నారు. పండుగ రోజున షడ్రుచులు స్వీకరించడం చెప్పుకోదగ్గ విశేషమన్నారు.

March 19, 2026 / 08:01 AM IST

ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఆలేరు ఎమ్మెల్యే

BHNG: ఉగాది పర్వదినం సందర్భంగా గురువారం ఆలేరు నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగాది అంటే కొత్త ఆరంభం.. చెడు జ్ఞాపకాలను వదిలి, మంచి ఆశలతో ముందుకు వెళ్లే సమయం. ఈ పరాభవ నామ సంవత్సరం మీ జీవితంలో అనేక ఆనందాలు, విజయాలు తీసుకురావాలి అని కోరుకున్నారు.

March 19, 2026 / 08:01 AM IST

జమ్మికుంటలో ఘనంగా ఇఫ్తార్ విందు

KNR: జమ్మికుంట పట్టణంలో బుధవారం సాయంత్రం ప్రభుత్వం ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు నిర్వహించారు. ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు చేసి ఉపవాస దీక్షలు విరమించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకట్రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ ప్రశాంత్ కుమార్, మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ స్వప్న పాల్గొని వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

March 19, 2026 / 08:01 AM IST

‘ఉపాధి హామీ పనుల్లో వసతుల లోపం’

నిర్మల్ జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద వేలాది కూలీలకు పనులు కల్పిస్తున్నా, వసతుల లోపం తీవ్రంగా కనిపిస్తోంది. మొత్తం 1.74 లక్షల జాబ్ కార్డులు, 3.20 లక్షల కూలీలు ఉండగా రోజూ 35 వేల మందికిపైగా పనులకు హాజరవుతున్నారు. అయితే పని ప్రదేశాల్లో నీడ, తాగునీటి సదుపాయాలు లేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

March 19, 2026 / 08:00 AM IST

మత్తు పదార్థాలతో ముగ్గురి అరెస్ట్

కామారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ అధికారులు జరిపిన మెరుపు దాడుల్లో 220 గ్రాముల నిషేధిత మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. సదాశివనగర్ మండలం భూంపల్లి శివారులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై NDPS చట్టం కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపుతామని అధికారులు హెచ్చరించారు.

March 19, 2026 / 07:58 AM IST

హాలియాలో ముస్లింలకు ఇఫ్తార్ విందు

NLG: రంజాన్ సందర్భంగా సాగర్ నియోజకవర్గంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు నిర్వహించారు. హాలియా లక్ష్మీనరసింహ గార్డెన్స్ లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కార్యక్రమం జరిగింది. జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి రాజ్ కుమార్ మాట్లాడుతూ.. మతసామరస్యానికి రంజాన్ ప్రతీక అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చందర్ రావు, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

March 19, 2026 / 07:55 AM IST

పట్టణంలో తారసపడిన అరుదైన పక్షి

మంచిర్యాల పట్టణం లక్ష్మీ నగర్‌లో అరుదైన పక్షి తారసపడింది. సంతోశ్ కుమార్ తన ఇంటి సమీపంలో గాయంతో పడి ఉన్న పక్షిని చూసి ఏఐ సహకారంతో అరుదైన పక్షి జాతికి చెందిందని తెలుసుకున్నారు. వెంటనే స్థానికుల సహకారంతో అటవీశాఖ అధికారులకు అప్పగించారు. రాత్రి కురిసిన వర్షానికి గాయపడిన పక్షికి చికిత్స అందించనున్నట్లు శ్రీనివాస్ తెలిపారు.

March 19, 2026 / 07:55 AM IST

ఇసుక తరలింపుపై రైతుల ఆందోళన

SRCL: వేములవాడ సమీపంలోని నక్కవాగు వద్ద ఇసుక రీచ్ నుంచి తరలింపును నిరసిస్తూ బుధవారం రైతులు వాహనాలను అడ్డుకున్నారు. వేసవిలో భూగర్భ జలాలు తగ్గి పంటలు ఎండిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తహాసీల్దార్ అబూబకర్ వివరణ ఇస్తూ.. కేవలం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసమే ఇసుక తీస్తున్నామని, రైతులకు ఇబ్బంది కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

March 19, 2026 / 07:52 AM IST

‘ప్రోటోకాల్ ఉల్లంఘించి అవమానించారు’

PDPL: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి తనను ఆహ్వానించకుండా ప్రోటోకాల్ ఉల్లంఘించి అవమానించారని మంథని మున్సిపల్ 6వ వార్డు కౌన్సిలర్ శ్రీలత ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆరో వార్డు పరిధిలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం నిర్వహించినా తనకు సమాచారం ఇవ్వలేదని అన్నారు.

March 19, 2026 / 07:50 AM IST

పండగ రోజు శుభవార్త చెప్పిన MP రఘునందన్ రావు

SRD: పటాన్ చెరువు పారిశ్రామిక ప్రాంతాల మేధావుల కోరిక మేరకు MMTS రైల్వే స్టేషన్ మార్పుకు అడుగులు పడుతున్నాయి. BHEL (LIG) నుంచి NH165 జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు ఇక్రిశాట్ ( ఫెన్సింగ్) ప్రాంతానికి మార్చేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు MP రఘునందన్ రావు పండగ రోజు తెలిపారు. గురువారం HITTV ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. MMTS రైలు స్టేషన్ మార్పు తథ్యం అని అన్నారు.

March 19, 2026 / 07:48 AM IST