BHPL: మొగుళ్ళపల్లి(M)పర్లపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు తిరుపతి (40) తాటి చెట్టు దిగుతున్న సమయంలో కిందపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న TRP మొగుళ్ళపల్లి మండల అధ్యక్షులు రాజేష్, పర్లపల్లి గ్రామ యువజన అధ్యక్షుడు కాశెట్టి రాజేష్ ఆసుపత్రికి వెళ్లి బాధితుడని పరామర్శించారు. ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించాలన్నారు.
KMR: సెన్సస్–2027లో భాగంగా మే 11 నుంచి జిల్లాలో గృహ గణన ప్రారంభం కానుందని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన శిక్షణా ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్యూమరేటర్లు, అధికారులు యాప్‌ల వినియోగం, 34 ప్రశ్నలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అదనపు కలెక్టర్ విక్టర్, సీపీవో రఘునందన్ పాల్గొన్నారు
SRPT: జిల్లా విద్యాశాఖ కార్యాలయ ‘పీఎం శ్రీ’ విభాగానికి ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయనున్నట్లు డీఈవో అశోక్ ఈరోజు తెలిపారు. ఇందులో భాగంగా ఐ-5 కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు, అల్మారాలు, సోఫా సెట్లను సమకూర్చుకోనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల సరఫరాదారులు తమ కొటేషన్లను ఈ నెల 28వ తేదీనా జిల్లా కార్యాలయంలో సమర్పించాలని ఆయన సూచించారు.
BHNG: శ్రీరామనవమి వేడుకల కోసం పట్టణంలోని చౌరస్తా రామాలయంలో జరుగుతున్న ఏర్పాట్లను మున్సిపల్ ఛైర్ పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి పరిశీలించారు. పారిశుద్ధ్యం, భక్తుల కోసం టెంట్లు, తాగునీటి సౌకర్యాలను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కౌన్సిలర్లు విఘ్నేష్, తాహెరా బబ్లు అధికారులకు సూచించారు.
KNR: కరీంనగర్ శ్రీ మహా శక్తి దేవాలయం రేపు జరగబోయే శ్రీ రామ నవమి వేడుకల ఏర్పాట్లను కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాత్రి పరిశీలించారు. శ్రీరామనవమి వేడుకలకు హాజరయ్యే భక్తులందరికీ ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులందరికీ వేద పండితుల ఆశీర్వచనంతో పాటు తలంబ్రాలను అందజేసేందుకు ఏర్పాటు చేసినట్లు బండి సంజయ్ తెలిపారు.
ADB: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను రక్షించడం పోలీస్ శాఖ యొక్క ముఖ్య లక్ష్యమని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రోడ్లపై స్పీడ్ బ్రేకర్లకు స్పష్టంగా కనిపించేలా పెయింటింగ్ వేయాలని SP అఖిల్ మహాజన్ సూచించారు.
VKB: జిల్లాలో చేపట్టిన సీసీ రోడ్లు, అంగన్వాడీ, పంచాయతీ భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో పెండింగ్ పనులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా 100 శాతం పనులు పూర్తయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
JGL: మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. రాయికల్ మండలం కిష్టంపేటలో రూ.20 లక్షలతో రెండు, భూపతిపూర్లో రూ.20 లక్షలతో రెండు, వడ్డేలింగాపూర్‌లో రూ.10 లక్షలతో ఒకటి, వడ్డెర కాలనీలో రూ.10 లక్షలతో ఒకటి, చర్ల కొండాపూర్‌లో రూ.10 లక్షలతో ఒక మహిళా సంఘం భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
MBNR: రేపటి శ్రీరామనవమి వేడుకల సందర్భంగా కార్పొరేషన్ పరిధిలోని 46వ డివిజన్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ ప్రత్యేకంగా వీధి దీపాలను ఏర్పాటు చేయించి అందరి ప్రశంసలు అందుకున్నారు. సాధారణంగా మైనార్టీ నేతలు శ్రీరామనవమి వంటి హిందూ పండుగలకు దూరంగా ఉంటారని భావిస్తారు. కాని తాను మాత్రం మత సామరస్యానికి నిదర్శనంగా నిలుస్తున్నారు.
SDPT: హుస్నాబాద్ మండల గాంధీనగర్ గ్రామంలో హుస్నాబాద్ SI లక్ష్మరెడ్డి ఆధ్వర్యంలో ‘కనువిప్పు’ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలు, వేధింపులు మరియు ఇతర సామాజిక రుగ్మతల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు .ఏదైనా ఆపద సమయంలో 100 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసుల సహాయం పొందాలని తెలిపారు.
SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో రేపు జరిగే సీతారామచంద్రస్వామి కళ్యాణ కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. పార్కింగ్ స్థలంలో భారీ కల్యాణ వేదికను ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుండడంతో గదులు సరిపోక పార్కింగ్ స్థలంలోనే బస చేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 24 గంటల పాటు ఆలయాన్ని తెరిచి ఉంచానున్నట్లు తెలిపారు.
JN: బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం ఆకస్మికంగా సందర్శించారు. గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్పంచ్ స్వర్ణలతను అడిగి ఇళ్ల మంజూరు, నిర్మాణ వివరాలను తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు.
KNR: కరీంనగర్ జిల్లా పరిషత్ కార్యాలయం సమీపంలో మహిళా శిశు సంక్షేమ శాఖ చైల్డ్ హెల్ప్ విభాగం ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 1098 ఉచిత హెల్ప్ లైన్, తప్పిపోయిన పిల్లలు, మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, ట్రాఫిక్ ఎస్సై శ్రీకాంత్, పోలీసులు వినయ్, ఆటో డ్రైవర్లు, తదితరులు పాల్గొన్నారు.
NRML: వైద్యుని పై దాడి చేసిన ఘటన గురువారం సాయంత్రం నిర్మల్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. నిర్మల్ పట్టణంలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ఓ చిన్నపిల్లడికి వైద్యం చేయించారు. అనంతరం బిల్లు ఎక్కువగా వేశారని వారి తరఫున బంధువులు ఆసుపత్రికి చేరుకొని వైద్యుని పై దాడి చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KMM: కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ పులిగుండాల గ్రామాన్ని సందర్శించి అటవీ, సాగునీటి శాఖ అధికారులతో పాటు స్థానిక రైతులతో మాట్లాడారు. ప్రాజెక్టులో నీటి లభ్యతను సమీక్షించి, రబీ పంటల సాగుకు రైతులకు అవసరమైన సాగునీరు సకాలంలో అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకుంటూ సాగునీటి నిర్వహణపై అధికారులకు కీలక సూచనలు చేశారు.