• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన.. మంత్రి సీతక్క

MLG: మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన తూముల అనిల్ నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి సీతక్క బుధవారం సాయంత్రం మృతుడి నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.

February 25, 2026 / 08:38 PM IST

‘ముక్కెర యాకన్నకు ఓయూ డాక్టరేట్’

MHBD: తొర్రూరు మండలంలోని వెలికట్టే గ్రామానికి చెందిన ముక్కెర యాకన్న ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. చరిత్ర విభాగంలో “ల్యాండ్ కాస్ట్ అండ్ పవర్ ఆఫ్ తెలంగాణ” అంశంపై డాక్టర్ అంజయ్య పర్యవేక్షణలో పరిశోధన చేసినందుకు గాను యూనివర్సిటీ విభాగం గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా యాకన్నను పలువురు అభినందించారు.

February 25, 2026 / 08:37 PM IST

GP నిధుల దుర్వినియోగం పై DLPOకు ఫిర్యాదు

WGL: నెక్కొండ మండలం మడిపల్లి గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగం పై గ్రామ సర్పంచ్ అనూష DLPOకు బుధవారం ఫిర్యాదు చేశారు. 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల్లో రూ. 1,75,703 అక్రమంగా విడుదల చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పాలకవర్గం, తనకు తెలియకుండా ఫిబ్రవరి 21న హాజరు పట్టికలో సంతకం పేరుతో కార్యదర్శి రజియా మోసం చేసినట్లు సర్పంచ్ ఆరోపించారు.

February 25, 2026 / 08:37 PM IST

ఆర్టీసీ బస్టాండ్‌లో రూ. 7 లక్షల ఆభరణాల చోరీ

MHBD: మహబూబాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో బుధవారం ప్రయాణికుడి వద్ద నుంచి రూ. 7 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు అపహరించిన ఘటన చోటుచేసుకుంది. మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన గండి శోభన్, మంజుల దంపతులు నర్సంపేట వెళ్లే బస్సు కోసం వేచి చూస్తుండగా దొంగలు బ్యాగ్‌ను ఎత్తుకెళ్లారు. ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

February 25, 2026 / 08:34 PM IST

‘సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి’

JN: ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు విస్తృతంగా తీసుకెళ్లాలని TPCC వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి అన్నారు. కొడకండ్ల మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచులతో వైస్ ప్రెసిడెంట్ సమావేశమయ్యారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని, గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.

February 25, 2026 / 08:33 PM IST

‘భూధాన్ భూములపై చర్యలు పూర్తిగా చట్టబద్ధం’

KMM: వెలుగుమట్ల గ్రామ సర్వే నం. 147,148,149 భూములపై జిల్లా యంత్రాంగం చేపట్టిన కూల్చివేతలు, స్వాధీన చర్యలు పూర్తిగా చట్టబద్ధమైన వని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఇవాళ తెలిపారు. 31 ఎకరాల 7 గుంటల భూదాన్ భూమి ఆక్రమణలో ఉండగా, సంబంధిత భూమి మొత్తం విలువ సుమారు 250 కోట్లకు పైగా ఉంటుందని భారీ స్థాయి ఆస్తులను కాపాడగలిగామని ఆయన తెలిపారు.

February 25, 2026 / 08:33 PM IST

‘ఫాస్ట్​ఫుడ్​ సెంటర్లలో ఆహార భద్రత నియమాలు పాటించాలి’

NZB: ఆహార భద్రతా నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నవిత హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ ప్రాంతంలో పలు ఫాస్ట్​ఫుడ్​ సెంటర్లను హోటళ్లను బుధవారం తనిఖీ చేశారు. పలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో టేస్టింగ్ సాల్ట్ కృత్రిమ రంగులవాడుతున్నట్లు గమనించామన్నారు.

February 25, 2026 / 08:31 PM IST

గోదావరిఖనిలో ఆర్ఎంపీ డాక్టర్ల సమావేశం

PDPL: గోదావరిఖని పట్టణంలో బుధవారం ఆర్ఎంపీ డాక్టర్ల మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా జవహర్ నగర్‌కు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు అన్వర్ ఇటీవల ఒక వ్యక్తికి సీపీఆర్ చేసి ఆయన ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా సదరు RMP వైద్యుడిని నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ ఎల్లయ్య యాదవ్ శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో 54వ డివిజన్ కార్పోరేటర్ ముస్తఫా పాల్గొన్నారు.

February 25, 2026 / 08:30 PM IST

జిల్లా పోలీసులకు బంగారు పతకాలు

SRCL: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులకు బంగారు పతకాలు లభించాయి. సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా ఫిబ్రవరి 16 నుండి 21 తేదీ వరకు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్లో జిల్లా పోలీసు క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచారు. మొత్తం 8 పతకాలు (4-బంగారు, 4-కాంస్య) సాధించడం పట్ల బుధవారం జిల్లా ఎస్పీ మహేష్ అభినందించారు.

February 25, 2026 / 08:30 PM IST

పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన SP

ADB: భీంపూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ బుధవారం సందర్శించారు. స్టేషన్‌కు వచ్చిన ఆయనకు పోలీస్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. మహారాష్ట్ర సరిహద్దుతో ఉన్నందున ఆసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు.

February 25, 2026 / 08:30 PM IST

నూతన వధువును ఆశీర్వదించిన ఎమ్మెల్యే

BDK: మణుగూరు పగిడేరు గ్రామంలో వేల్పుల శ్రీరాములు సుమలత దంపతుల కుమార్తె ప్రతానం వేడుకలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వధువును ఆశీర్వదించి, ఆమె భవిష్యత్తు సుఖశాంతులతో నిండాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ముచ్చటించి శుభాకాంక్షలు తెలిపారు. సంప్రదాయ పద్ధతిలో నిర్వహించిన ఈ వేడుక ఆనందోత్సాహాల మధ్య జరిగింది.

February 25, 2026 / 08:29 PM IST

గ్రామాల అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి: కలెక్టర్

NRPT: గ్రామాల అభివృద్ధికి సర్పంచులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. నారాయణపేట నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో కొనసాగుతున్న సర్పంచుల శిక్షణ తరగతుల శిబిరాన్ని బుధవారం ఎస్పీ డాక్టర్ వినీత్తో కలిసి సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు మెచ్చేలా పరిపాలన అందించాలని చెప్పారు. వీధి దీపాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.

February 25, 2026 / 08:27 PM IST

విద్యార్థుల ఇళ్లకు ఉపాధ్యాయులు

MDK: పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో రాజ్పల్లి జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ప్రతిరోజూ రాత్రి 8 నుంచి 10 గంటల వరకు విద్యార్థుల ఇళ్లను సందర్శిస్తూ, వారి చదువును పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థులకు ప్రత్యేక సమయసారిణిని అందజేయడమే కాకుండా, ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.

February 25, 2026 / 08:27 PM IST

253 మంది విద్యార్థుల గైర్హాజరు

JGL: జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు 30 కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగాయి. జనరల్ కోర్సుల్లో 6,879 మంది, ఒకేషనల్లో 1,029 మంది హాజరుకాగా 253 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఎస్కేఎన్ఆర్ జూనియర్ కళాశాలను పరిశీలించారు. అదనపు కలెక్టర్ బి.ఎస్.లత పలు కేంద్రాలు సందర్శించారు. ఒక విద్యార్థి ఆలస్యంగా రావడంతో అనుమతించలేదు.

February 25, 2026 / 08:26 PM IST

విశ్రాంత శాస్త్రవేత్త ఇంట్లో భారీ చోరీ

HYD: హబ్సిగూడలో నివసించే ఓ విశ్రాంత శాస్త్రవేత్త ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. ఇంట్లో పనిమనిషే 9.30 తులాల బంగారాన్ని దొంగిలించినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదుతో నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు, ఆమె వద్ద నుంచి దొంగిలించిన నగలను స్వాధీనం చేసుకున్నారు.

February 25, 2026 / 08:26 PM IST