• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

23న ‘చలో సెంట్రల్ లేబర్ కమిషనరేట్’

NZB: కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 23న జరిగే ‘చలో సెంట్రల్ లేబర్ కమిషనరేట్’ ధర్నాను జయప్రదం చేయాలని ఐఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దాసు పిలుపునిచ్చారు. బుధవారం ఆర్మూర్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని, కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.

March 18, 2026 / 03:55 PM IST

ఆలేరు ప్రజల గురించి అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే

BHNG: ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నిషేధిత భూముల జాబితా వ్యవహారంలో బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని అసెంబ్లీలో ప్రసంగించి ఖండించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలని కేటాయించిది. పేదల ఇళ్ల స్థలాల్లో నిషేదిత జాబితా గురించి పేదలకు అన్యాయం చేయొద్దని ప్రజల పక్షాన అసెంబ్లీలో ప్రస్తావించారు.

March 18, 2026 / 03:53 PM IST

52 సిలిండర్ల పట్టివేత

MDK: జిల్లాలో గృహ వినియోగానికి సంబంధించిన LPG సిలిండర్ల దుర్వినియోగం, మళ్లింపు, బ్లాక్ మార్కెటింగ్‌కు అధికారులు అడ్డుకట్ట వేస్తున్నారు. ఇవాళ మెదక్‌లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించడం జరిగిందని జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద్ తెలిపారు. హోటల్స్, టీ పాయింట్లలో వాణిజ్య వినియోగం కోసం అక్రమంగా ఉపయోగిస్తున్న 52 సిలిండర్లను పట్టుకున్నారు.

March 18, 2026 / 03:48 PM IST

‘చదువుకు అంగవైకల్యం అడ్డురాదు’

WNP: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సీనియర్ జడ్జి రజిని ఆదేశాల మేరకు జిల్లాలోని భవిత సెంటర్‌లో వికలాంగుల పునరావాస కేంద్రాలను డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య సందర్శించారు. దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి స్వయం ఉపాధి ఇవ్వడం జరుగుతుందన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ పథకం కింద ఉద్యోగ అవకాశం కల్పిస్తామని, చదువుకు అంగవైకల్యం అడ్డురాదని పేర్కొన్నారు.

March 18, 2026 / 03:46 PM IST

కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

PDPL: ఎల్పిజి సిలిండర్ల కృత్రిమ కొరత సృష్టించి, బ్లాక్ మార్కెట్‌కు తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ శ్రీహర్ష హెచ్చరించారు. ఇప్పటికే 12 కేసులు నమోదు చేసి, 29 సిలిండర్లు సీజ్ చేశామన్నారు. జిల్లాలో గ్యాస్ సిలిండర్లు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు అనవసర ఆందోళన చెందవద్దని తెలిపారు. 3, 4 రోజుల్లో సిలిండర్లు డెలివరీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

March 18, 2026 / 03:43 PM IST

వార్డు అభివృద్ధికి కృషి చేస్తా: మున్సిపల్ చైర్ పర్సన్

MHBD: మున్సిపాలిటీ పరిధిలోని 36వ వార్డులో బుధవారం ఉదయం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వార్డులో సమస్యలు గురించి వారు సమావేశంలో చర్చించారు. కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి-రమేష్ హాజరై, సమస్యలు తెలుసుకున్నారు. వార్డు అభివృద్ధికి తన వంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. వైస్ చైర్మన్ సోమయ్య, కౌన్సిలర్ ముత్యం వెంకన్న తదరులున్నారు.

March 18, 2026 / 03:43 PM IST

మార్కెట్‌లో తగ్గిన కందుల ధర

KMR: డోంగ్లీ, మద్నూర్ మండలాల్లోని మార్కెట్‌లో కందుల ధర తగ్గుముఖం పట్టింది. బుధవారం కందులు క్వింటాకు రూ.7,800 ధర పలుకుతోందని అడత్ వ్యాపారులు తెలిపారు. ఒక రోజులో క్వింటాకు రూ.100 ధర తగ్గిందని పేర్కొన్నారు. కాగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి దాదాపు నెల రోజులు కావస్తున్నా రైతులు మాత్రం అమ్మకానికి ఆసక్తి చూపడం లేదు.

March 18, 2026 / 03:42 PM IST

దరఖాస్తుల ఆహ్వానం

SRCL: తంగళ్ళపల్లి మండలం నేరెళ్లలోని తెలంగాణ గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపల్ రాధా తెలిపారు. తంగళ్ళపల్లి మండలం నేరెళ్లలోని గురుకుల కళాశాలలో బుధవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. మే 03న జరిగే ప్రవేశ పరీక్షకు ఈనెల 16 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

March 18, 2026 / 03:41 PM IST

పరీక్ష కేంద్రలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

జగిత్యాల జిల్లా కేంద్రంలోని పదవ తరగతి పరీక్ష కేంద్రాలను బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించాలని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాము, తదితర అధికారులు పాల్గొన్నారు.

March 18, 2026 / 03:41 PM IST

రన్నింగ్ కారులో మంటలు

KMR: రన్నింగ్ కారులో మంటలు వ్యాపించి కారు తగలబడిన ఘటన మాచారెడ్డి మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి-సిరిసిల్ల రోడ్డుపై రన్నింగ్​లో ఉన్న సీఎన్​జీ కారులో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. ఇది గమనించిన డ్రైవర్ శ్రీనివాస్ గౌడ్ కారును రోడ్డు పక్కన నిలిపివేశాడు. ఈ క్రమంలో మంటలు ఎక్కువై కారు పూర్తిగా దగ్ధమైంది.

March 18, 2026 / 03:40 PM IST

రేషన్ బియ్యం పంపిణీపై అదనపు కలెక్టర్ సమీక్ష

KMM: జిల్లాలోని బఫర్ గోదాముల నుంచి రేషన్ బియ్యం పంపిణీ తీరుపై అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ నుంచి జూన్ 2026 వరకు మూడు నెలల కోటాను ఒకేసారి లబ్ధిదారులకు అందించాలన్న కేంద్ర ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం 12 గోదాములకు ఇన్ ఛార్జ్‌లను నియమించి, సకాలంలో సరఫరా జరిగేలా చూడాలన్నారు.

March 18, 2026 / 03:36 PM IST

భారీ వర్షానికి మూగజీవాలు మృతి

వికారాబాద్: వడగళ్ల వర్షానికి వలసదారులకు చెందిన 150 మేకల మృతి చెందాయి. ఈ ఘటన పూడూరు మండలం నిజాంపేట్ మేడిపల్లిలో చోటుచేసుకుంది. మేకల మృతితో వలసదారులు కన్నీరు మున్నీరవుతున్నారు. అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ముందుకు వచ్చి వారికి సహాయం చేయాలని ఆ రైతులు కోరారు.

March 18, 2026 / 03:35 PM IST

బైరన్‌పల్లికి ‘వీర బైరాన్‌పల్లి’ నామకరణం చేయాలి: MLA పల్లా

JN: తెలంగాణ సాయుధ పోరాటంలో సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట మండలం బైరన్‌పల్లి గ్రామ ప్రజలు చూపిన ధైర్యసాహసాలను గౌరవిస్తూ ఆ గ్రామానికి ‘వీర బైరాన్‌పల్లి’గా నామకరణం చేయాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. ఇవాళ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుకు, MLA పల్లా వినతిపత్రం అందజేశారు. ప్రాణాలతో బయటపడిన వారికి ఆర్థిక సహాయం అందించాలన్నారు.

March 18, 2026 / 03:33 PM IST

వరి పంటను పరిశీలించిన శాస్త్రవేత్తలు

HNK: భీమదేవరపల్లి మండలం వీర్లగడ్డ తండాగ్రామంలో వరి పొలాలను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు డా.గోన్యానాయక్, డా.పద్మజలు బుధవారం పరిశీలించారు. పరిశీలనలో భాగంగా వరి పంటలో కంకినల్లి సమస్య కనిపించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అనంతరం రైతులకు సూచనలు చేశారు. HNK డివిజన్ ADA ఆదిరెడ్డి, మండల వ్యవసాయ అధికారి పద్మ, తదితరులున్నారు.

March 18, 2026 / 03:33 PM IST

‘వారి కృషికి ఫలితమే అయిల్ పామ్ ఫ్యాక్టరీ’

SDPT: సిద్దిపేటలో ఆయిల్ పామ్ తెచ్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావుదేనని నంగునూరు మండల బిఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. బుధవారం ఫ్యాక్టరీ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఫ్యాక్టరీ నిర్మాణం గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయిందని, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఇది తమ ఘనతగా చెప్పుకోవడం సరికాదని విమర్శించారు. 

March 18, 2026 / 03:32 PM IST