NLG: జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 8,668 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఇందులో 8,440 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 228 మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం 375 కేంద్రాలు పనిచేస్తున్నాయని, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఇవాళ ఒక ప్రకటనలో ఆయన తెలిపారు.
NZB: జిల్లా కేంద్రంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయంలో నేడు నిర్వహించే, ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే లిఖితపూర్వకంగా ప్రజావాణిలో ఫిర్యాదు చేయాలని, వచ్చిన దరఖాస్తులను, వెంటనే పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో 10 గం.నుండి మధ్యాహ్నం 1 గం.వరకు నిర్వహిస్తామన్నారు.
NGKL : జిల్లాలోని రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. జిల్లాలోని సుమారు 2.5 లక్షల మంది రైతుల ఖాతాల్లో నేడు రైతు భరోసా నిధులు జమ కానున్నాయి. దీనికోసం ప్రభుత్వం రూ.103 కోట్లను విడుదల భూపాలపల్లి జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి కార్య క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని, బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాలకు ఈ నిధులను విడుదల చేయనున్నారు.
KNR: తమ పంటలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మి మద్దతు ధర పొందాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాకు రూ. 2,389, సాధారణ రకానికి రూ. 2,369 గా నిర్ణయించిందని, రైతులు తమ సమీపంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో వడ్ల అమ్మాలని సూచించారు.
NRPT: నర్వ మండలంలో సోమవారం వడ్లు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్లు చెన్నయ్య సాగర్ తెలిపారు. ఉదయం 11 గంటలకు నర్వలో ప్రారంభించి పాతర్చేడ్, ఉందెకోడ్, కన్మనూర్ గ్రామాల్లో కొనసాగుతాయని చెప్పారు. రైతులు, అధికారులు పాల్గొనాలని కోరారు. ప్రభుత్వం అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
హన్మకొండ రెడ్డి కాలనీలోని మాజీ కార్పొరేటర్ వీరగంటి రవీందర్ మాతృమూర్తి దశదిన కర్మకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలవేసిన నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఎర్రబెల్లి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, BRS నేతలు పాల్గొన్నారు.
MNCL: జన్నారం మండలంలో అర్ధరాత్రి వేళ విద్యుత్ కోతలు విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జన్నారం మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంట నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఒకవైపు లిప్ పగటివేళ 44 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
NZB: నవీపేట్ మండలం బినోలలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామానికి చెందిన నర్సమ్మ ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు నాలుగు తులాల బంగారం అపహరించినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. దొంగలను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.
RR: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని షాద్ నగర్ పరిధిలోని ఉత్తర రామ లింగేశ్వర ఆలయంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ అభిషేకాలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. అక్షరాల్లో రాయలేని ఒక మహా ప్రస్థానం వారి జీవితం అన్నారు. అభివృద్ధి, సంక్షేమం అనే పదానికి నిలువెత్తు నిదర్శనం అన్నారు.
SRPT: ఇవాళ సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా యాసంగి రెండో విడత రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని నడిగూడెం రైతు వేదికలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. రైతులు, ప్రజాప్రతినిధులు మరియు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మండల వ్యవసాయ అధికారి మల్సూరు కోరారు.
SRPT: ఇవాళ సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా యాసంగి రెండో విడత రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని నడిగూడెం రైతు వేదికలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. రైతులు, ప్రజాప్రతినిధులు మరియు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మండల వ్యవసాయ అధికారి మల్సూరు కోరారు.
MLG: HYDలో ఆదివారం రాత్రి MLC బల్మూరి వెంకట్ రిసెప్షన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ రిసెప్షన్ వేడుకలకు రాష్ట్ర మంత్రి సీతక్క హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం నూతన వధూవరులకు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు, NSUI నాయకులు తదితరులు ఉన్నారు.
SRCL: నేడు మధ్యాహ్నం 2:30 గంటలకు జిల్లెల్ల రైతు వేదికలో ‘రైతు నేస్తం’ ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని ఏఈఓ ఒక ప్రకటనలో తెలిపారు. భూసార పరీక్షలు, అగ్రి స్టాక్‌పై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారన్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి 2వ దశ ‘రైతు భరోసా’ నిధులను విడుదల చేసే కార్యక్రమాన్ని ఇక్కడ ప్రత్యక్షంగా వీక్షించవచ్చని, కావున రైతులు, ప్రజాప్రతినిధులు తప్పక హాజరుకావాలని ఏఈఓ కో...
BDK: ఆళ్లపల్లి మండలంలోని రైతులందరూ త్వరితగతిన రైతు రిజిస్ట్రీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని వ్యవసాయ అధికారి (ఏవో) కుమార్ రాజా సూచించారు. యూరియా బుకింగ్, పంటల కొనుగోలు కూడా దీనిపైనే ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు. దీనిని రైతు భరోసా, పీఎం కిసాన్ పథకాలతో అనుసంధానించామని రిజిస్ట్రీ చేసుకున్న వారికే ఆర్థిక సాయం అందుతుందని స్పష్టం చేశారు.
NLG: కనగల్ మండలం ధర్వేశిపురం పర్వతగిరి గ్రామాల శివారులో గల శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారు ఇవాళ ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నైవేద్యం సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళలు కుంకుమార్చనలు చేశారు.