• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

స్వయం సహాయక సంఘాలకు రుణాల అందజేత

JGL: పెగడపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో DAY-NRLM నిధుల ద్వారా స్వయం సహాయక సంఘాలకు ఆదివారం రుణాలు అందజేశారు. గొర్రె పొట్టేలు పిల్లల పెంపకం లబ్ధిదారులకు (2) యూనిట్లకు రూ. 2-00 లక్షల చొప్పున మొత్తం రూ.4 లక్షల విలువగల చెక్కులను AMC ఛైర్మన్ బుర్ర రాములు గౌడ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం రవివర్మ పాల్గొన్నారు.

April 20, 2026 / 09:06 AM IST

నేడు తేజ మిర్చి ధర ఎంత అంటే..?

వరంగల్ పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ రెండు రోజుల సాధారణ సెలవుల అనంతరం సోమవారం పున:ప్రారంభమయ్యింది. నేడు క్వింటాల్ తేజ మిర్చి ధర రూ.21,100 పలికినట్లు వ్యవసాయ మార్కెట్ అధికారులు తెలిపారు. నేడు మార్కెట్లో తేజ మిర్చి క్రియ విక్రయాలు జోరుగా కొనసాగుతున్నట్లు వ్యవసాయ మార్కెట్ అధికారులు తెలిపారు.

April 20, 2026 / 09:01 AM IST

రోడ్డు వేయాలని ఎమ్మెల్యే కాళ్లు పట్టుకున్న ఫీల్డ్ అసిస్టెంట్

MHBD: నెల్లికుదురు మండలంలోని కాచికల్, మేచరాజుపల్లి గ్రామాల వరకు రోడ్డు వేయాలని ఫీల్డ్ అసిస్టెంట్ వంగాల సోమయ్య ఎమ్మెల్యే మురళి నాయక్ కాళ్లు పట్టుకొని వేడుకున్నాడు. రోడ్డు పరిస్థితిని వివరించి తారురోడ్డు పునరుద్ధరించాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే తారు రోడ్డు మంజూరు చేయించి, పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.

April 20, 2026 / 08:49 AM IST

సయ్యద్పల్లిలో ఘనంగా ఉరుసు ఉత్సవం

VKB: పరిగి మండలం సయ్యద్పల్లిలో హజరత్ బాబా 88వ ఆరాధన ఉత్సవాలు (గంధం) ఆదివారం రాత్రి కన్నులపండువగా జరిగాయి. ముస్లిం సోదరులు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ఫాతెహా అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ వేడుకలకు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.

April 20, 2026 / 08:39 AM IST

అకాల వర్షాలు.. జొన్న రైతుల్లో ఆందోళన

ADB: ఉట్నూర్ ఏజెన్సీలో ఆదివారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురవడంతో రబీ జొన్న సాగు చేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో వందల ఎకరాల్లో జొన్న పంట కోత దశకు చేరుకున్న తరుణంలో అకాల వర్షం రావడంతో తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. రైతులు అప్రమత్తంగా ఉండి పంటను రక్షించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

April 20, 2026 / 08:38 AM IST

వైభవంగా భద్రకాళి బ్రహ్మోత్సవాలు

WGL: భద్రకాళి క్షేత్రంలో కళ్యాణ బ్రహ్మోత్సవాలు కనులపండువగా కొనసాగుతున్నాయి. రెండో రోజున అమ్మవారు ప్రాతఃకాల విశేష దర్శనమిచ్చారు. అర్చకులు ఉదయాన్నే అమ్మవారికి విశేష అభిషేకాలు, పూజలు చేసి, శోభాయమానంగా అలంకరించారు. భక్తులు భారీగా తరలివచ్చి దర్శించుకోగా తీర్థప్రసాదాలు అందజేశారు. ఈకార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, సిబ్బంది, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

April 20, 2026 / 08:34 AM IST

జిల్లాలో వింత పరిస్థితి.. ఎండా, వానల కలయిక

KMR: జిల్లాలో వింత పరిస్థితి చోటు చేసుకుంటుంది. ఉదయం వడగాలులతో కూడిన ఎండ ఉంటే, సాయంత్రం ఈదురుగాలులతో, ఉరుములు, మెరుపుల వర్షం దంచి కొడుతోంది. అకాల వర్షాల వల్ల వేడికి ఉపశమనం లభించినా, రైతులను మాత్రం ఆగం చేస్తున్నాయి. ఆరబోసిన ధాన్యాలు తడిచిపోతున్నాయి. వడగళ్ల వాన పంటకు నష్టం చేకూరుస్తున్నాయి. నిన్న జిల్లాలో దంచి కొట్టిన వాన వర్షాకాలాన్ని తలపించింది.

April 20, 2026 / 08:30 AM IST

రైతు భరోసా నిధుల విడుదల ప్రత్యక్ష ప్రసారం

KMR: లింగంపేట మండలంలోని పలు గ్రామాల రైతు వేదికల్లో సోమవారం మధ్యాహ్నం రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారం (వీడియో కాన్ఫరెన్స్) నిర్వహించనున్నట్లు మండల వ్యవసాయ అధికారి అనిల్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 2వ దశ రైతు భరోసా నిధుల విడుదల కోసం సీఎం రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నష్టూర్పల్లి నుంచి నిధులను విడుదల చేయనున్నారని తెలిపారు.

April 20, 2026 / 08:28 AM IST

వసతి గ్రహాలను సందర్శించిన కలెక్టర్

సిద్దిపేట పట్టణంలోని పలు ప్రభుత్వ వసతి గృహాలను జిల్లా కలెక్టర్ కె.హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కోర్టు కాంప్లెక్స్ వెనుక ఉన్న ఎస్సీ బాలికల హాస్టల్‌ను సందర్శించి, డార్మెటరీ గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో నేరుగా మాట్లాడి భోజన నాణ్యత, వసతులపై ఆరా తీశారు. చదువుపై దృష్టి సారించాలని కలెక్టర్ భరోసా ఇచ్చారు.

April 20, 2026 / 08:27 AM IST

మే 8 నుంచి కాకతీయ కళల జాతర

HNK: వరంగల్ నగరంలో మే 8, 9, 10 తేదీలలో కాకతీయ కళల జాతరతో పాటు మహా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పరకాలలోని అమరధామంలో ఈ జాతర పోస్టర్లను కో-ఆర్డినేటర్లు ఆదివారం ఆవిష్కరించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో వివిధ సాంస్కృతిక పోటీలు, అవార్డుల ప్రధానోత్సవం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు.

April 20, 2026 / 08:20 AM IST

రూ.4.50 లక్షల LOC అందజేసిన MLA

ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం బోడేపల్లి గ్రామానికి చెందిన గొర్లపల్లి వనజకి మంజూరైన LOC ని MLA పాల్వాయి హరీష్ బాబు అందజేశారు. నిమ్స్ ఆసుపత్రిలో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్ర చికిత్స కోసమై వనజకి CMRF ద్వారా రూ.4.50 లక్షల LOC మంజూరు అయింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. CMRF పథకం నిరుపేదలకు ఒక వరం లాంటిదని పేర్కొన్నారు.

April 20, 2026 / 08:11 AM IST

‘పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా అసత్య ప్రచారాలు’

JGL: పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా కొందరు నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను ఆపివేయాలని జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు యాదగిరి బాబు తెలిపారు. జగిత్యాలలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం పార్టీలో లేని, బహిష్కరణకు గురైన కొంతమంది వ్యక్తులు బీజేపీ రాష్ట్ర నాయకురాలు భోగ శ్రావణిపై చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని మండిపడ్డారు.

April 20, 2026 / 08:11 AM IST

ఉచిత కంటి పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలి: డా. మౌనిక

BHNG: శిబిరాల ద్వారా అందిస్తున్న ఉచిత కంటి పరీక్షలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కంటి వైద్యురాలు డా. మౌనిక సూచించారు. హబ్సిగూడలోని నియో విజన్ ఐ కేర్ & లేజర్ సెంటర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ఆలేరు మండలం కొలనుపాకలోని రైతు వేదికలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో మొత్తం 150 మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు.

April 20, 2026 / 08:07 AM IST

పురుగుల మందు తాగి కూలీ మృతి

MHBD: కురవి మండలం బలపాల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన హిడ్మాసోరి (46) అనే కూలీ తేనె అనుకుని పొరపాటున పురుగుల మందు తాగి మృతి చెందాడు. మామిడి కాయలు కోయడానికి గ్రామానికి వచ్చిన చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ఎస్ఐ జయ కుమార్ ఆదివారం రూ.5,000 ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.

April 20, 2026 / 08:05 AM IST

కవితను కలిసిన మలిదశ ఉద్యమకారులు

NLG: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను నిన్న రాత్రి తెలంగాణ మలిదశ ఉద్యమకారుల అసోసియేషన్ నాయకులు కలిశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6గ్యారంటీలలో భాగంగా ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలంతో పాటు గౌరవ భృతి ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారు ఆమెను కోరారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారాన్ని కృషి చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.

April 20, 2026 / 08:04 AM IST