• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

కోతుల బెడద నివారణకు గ్రామస్థుల చందాలు

MHBD: నర్సింహులపేట మండల కేంద్రంలో కోతుల బెడదకు చెక్ పెట్టేందుకు గ్రామస్థులు ముందుకొచ్చారు. ఇళ్లలోకి చొరబడి ఆహారం నాశనం చేయడం, చిన్నారులపై దాడులు పెరగడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి గ్రామస్థులు ఏకమై నేడు ఇంటికి రూ.500, ఎకరానికి రూ.500 చొప్పున చందాలు సేకరించి, నిపుణుల బృందంతో కోతులను పట్టించి సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నారు.

April 19, 2026 / 09:29 AM IST

ఈతకు వెళుతున్నారా అయితే జాగ్రత్త

NRML: వేసవికాలం వచ్చిందంటే చాలు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందటానికి జిల్లాలోని పల్లెల్లో, పట్టణాల్లో వాగుల్లోకి, చెరువుల్లోకి ఈతకు వెళ్తుంటారు. కానీ ఈతకు వెళ్లేవారు కచ్చితంగా ఈత వస్తేనే నీటిలోపలకు వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. కాస్త తేడా వచ్చిన ప్రాణాలు గాలిలోకి వెళ్తాయని హెచ్చరికలు జారీ చేశారు.

April 19, 2026 / 09:23 AM IST

విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

MBNR: జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగి, ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా భూత్పూర్ మండలం కొత్తమొల్గరలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వడ్డేమాన్, మహమ్మదాబాద్ 43.4°C, సల్కర్ పేట 43.3°C, సేరివెంకటాపూర్ 43.2°C, అడ్డాకల్, నవాజ్ పేట 43.0°C, పారుపల్లి 42.9°C, కౌకుంట్ల 42.7, మహబూబ్ నగర్ 42.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

April 19, 2026 / 09:21 AM IST

ఉన్నత స్థాయికి ఎదగాలి: డీన్ రత్నశ్రీ

HYD: సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలోని బాచుపల్లి ప్రాంగణంలో భాషాశాస్త్ర శాఖ ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా భాషాభివృద్ధి పీఠం డీన్ డా.K.రత్నశ్రీ హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగి అన్ని రంగాల్లో రాణించాలన్నారు. సౌత్ జోన్ క్రికెట్‌కు ఎంపికైన వినోద్‌‌ను ఘనంగా సన్మానించారు. అధ్యాపకులు చంద్రయ్య, పవన్ పాల్గొన్నారు.

April 19, 2026 / 09:18 AM IST

రెవెన్యూ గందరగోళం.. రైతుల ఆగ్రహం

VKB: దౌల్తాబాద్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో 2 రోజులుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. డిజిటల్ లాగిన్ కీ సమస్యతో లావాదేవీలు ఆగిపోయినట్లు సమాచారం. దీనిపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసి, వెంటనే సేవలు పునరుద్ధరించకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు.

April 19, 2026 / 09:18 AM IST

రహదారిపై ధాన్యం… ప్రాణాలకు ముప్పు..!

SDPT: అక్కన్నపేట మండలం సేవాలాల్ మహారాజ్ తండా నుంచి హుస్నాబాద్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై కొందరు రైతులు రోడ్డుపైనే ధాన్యాన్ని రైతులు ఆరబెడుతున్నారు. గతంలో ఇలాంటి చర్యల వల్ల ప్రమాదాలు జరిగినప్పటికీ, మళ్లీ అదే విధానం కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రహదారిపై ధాన్యం కారణంగా వాహనదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

April 19, 2026 / 09:15 AM IST

‘జిల్లాను రాష్ట్రానికి ఆదర్శంగా నిలపాలి’

KNR: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సంక్షేమ వారాన్ని ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని చిత్రా మిశ్రా అధికారులకు ఆదేశించారు. గురుకులాలు, హాస్టళ్లలో పారిశుధ్యం, వంటగది మరమ్మతులు, విద్యార్థులకు పోటీలు, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. రైతుల రిజిస్ట్రీ 100% పూర్తి చేసి, కరీంనగర్ జిల్లాను రాష్ట్రానికి ఆదర్శంగా నిలపాలని పిలుపునిచ్చారు.

April 19, 2026 / 09:15 AM IST

వేణుగోపాల్ రెడ్డికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ బాధ్యత

NGKL: ఉప్పునుంతల మండలం కొరటికల్‌కు చెందిన టీ-శాట్ సీఈవో బోదనపెల్లి వేణుగోపాల్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. ఆయనను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) సభ్యుడిగా ప్రభుత్వం నియమించింది. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక బాధ్యతలు అప్పగించింది.

April 19, 2026 / 09:11 AM IST

ఎంపీ తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలి: అనీష్ కుమార్

ADB: తెలంగాణ ప్రాంత ప్రజలను అవమాన పరుస్తూ BJP MP తేజస్వి సూర్య పార్లమెంటులో చర్చించిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బోథ్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు అనీష్ కుమార్ అన్నారు. ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇండియా- పాకిస్తాన్ విభజనతో పోల్చడం ఏంటని ప్రశ్నించారు.

April 19, 2026 / 09:11 AM IST

‘హెల్మెట్ ధరించండి.. ప్రమాదాల నుండి బయటపడండి’

JGL: ధర్మపురి ఎస్సై జి.మహేష్ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, తద్వారా ప్రమాదాల నుంచి బయటపడవచ్చని తెలిపారు. ధర్మపురిలో ‘అరైవ్ అలైవ్’ వారోత్సవాల ముగింపు సందర్భంగా హెల్మెట్ ధరించిన వాహనదారులకు ఆయన చాక్లెట్లు పంపిణీ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, టూవీలర్లను నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన సూచించారు.

April 19, 2026 / 09:10 AM IST

ఆసిఫాబాద్‌లో ఇళ్ల గణనపై కలెక్టర్ శిక్షణ

ASF: జిల్లాలో జనగణన-2027లో భాగంగా వచ్చే నెల 11 నుంచి ఇళ్ల గణన ప్రారంభం కానుంది. కలెక్టర్ హరిత ఆధ్వర్యంలో ఎన్యుమరేటర్లకు శిక్షణ ఇచ్చారు. ప్రతి ఇంటి నుంచి 32 ప్రశ్నలకు సమాధానాలు సేకరించాలని, ప్రక్రియ అంతా డిజిటల్ విధానంలో పకడ్బందీగా జరగాలని ఆమె సూచించారు.

April 19, 2026 / 09:10 AM IST

రూ. 18.24 లక్షల వ్యవసాయ పనిముట్లు పంపిణీ: కలెక్టర్

PDPL: వ్యవసాయ శాఖ ద్వారా ధర్మారం మండలంలోని రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేసినట్లు కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు. 61 మంది రైతులకు రూ. 18.24 లక్షల విలువైన ఆధునిక వ్యవసాయ పనిముట్లు మంత్రి లక్ష్మణ్ కుమార్ ద్వారా శనివారం పంపిణీ చేశామని ఆయన తెలిపారు. 48 గంటల్లో రైతులకు ధాన్యం డబ్బులు చెల్లింపులు జరిపే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

April 19, 2026 / 09:09 AM IST

ఈ ప్రాంతాల్లో 67% పెరిగిన ట్రాఫిక్

HYD: ఇంజనీర్ ఆఫ్ సర్వే నివేదిక ప్రకారం పంజగుట్ట, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి కీలక ప్రాంతాలను కలిపే మార్గాల్లో గత ఏడాది కాలంలో 67% పైగా ట్రాఫిక్ పెరిగింది. ఐటీ సంస్థలు, కమర్షియల్ కార్యకలాపాలు పెరగడంతో వాహనాల రద్దీ అధికమైంది. ఫలితంగా పీక్ అవర్స్‌లో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా మారుతున్నాయి.

April 19, 2026 / 09:09 AM IST

‘నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు’

NGKL: వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చారకొండ మండల ఎస్సై వీరబాబు హెచ్చరించారు. ఆదివారం ఎస్సై మాట్లాడుతూ.. మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులకు రూ.25 వేల జరిమానా విధించడంతో పాటు లైసెన్స్‌ రద్దు చేస్తామన్నారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దని, ప్రయాణాల్లో తప్పనిసరిగా హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ ధరించాలని సూచించారు‌.

April 19, 2026 / 09:05 AM IST

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: రాకేష్ రెడ్డి

WGL: శిఖర స్కిల్ సెంటర్లో టైలరింగ్, బ్యూటీషన్, మగ్గం విభాగాల్లో శిక్షణ పొందిన 260 మందికి కేయూ వీసీ ప్రతాపరెడ్డి, నీలిమ హాస్పిటల్స్ చైర్మన్ నీలిమరెడ్డి, ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ రాకేష్ రెడ్డి సర్టిఫికెట్లను అందజేశారు. ఒక ఇంట్లో ఒక మహిళ సాధికారత సాధిస్తే మొత్తం ఆ కుటుంబమే వృద్ధిలోకి వస్తుందని, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని రాకేష్ రెడ్డి అన్నారు.

April 19, 2026 / 09:03 AM IST