PDPL: ధర్మారం మండలం మేడారంలో ఇవాళ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ వీర్పాల్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వేసవికాలం దృష్ట్యా తాగునీటి సమస్య, డ్రైనేజీ, విద్యుత్ దీపాల ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం పంచాయతీ ఆధ్వర్యంలోని వారసంత, వాణిజ్య దుకాణాలకు వేలంపాట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో రమేష్, కార్యదర్శి మౌనిక, ఉపసర్పంచ్ రవి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
NRML: కుంటాల మండలంలోని 15 గ్రామపంచాయతీల పరిధిలో ప్రభుత్వం 264 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి గృహ నిర్మాణానికి వేగం పెంచినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 75 ఇళ్లు స్లాబ్ స్థాయిలో, 106 రూఫ్ లెవెల్‌లో, 135 బేస్మెంట్ దశలో కొనసాగుతున్నాయన్నారు. ఇప్పటికే 7 ఇళ్లు పూర్తి కాగా, మరో 13 ఇళ్లు తుదిదశలో ఉన్నాయి. అధికారులు పనులను పర్యవేక్షిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని చర్యలు చేపడుతున్నామన్నారు.
BHPL: రేగొండ (M) లింగాల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దొంగల రవీందర్ (49) ఇవాళ తన భార్య, కుమారుడితో కలిసి పొలాలకు వెళ్లాడు. ఇల్లు నిర్మాణానికి తీసుకున్న అప్పుల కారణంగా మానసిక ఒత్తిడికి గురై అసహజంగా ప్రవర్తించి సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. SI ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
MNCL: అనారోగ్య సమస్యలతో ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాలలో జరిగింది. కూలి పని చేస్తూ జీవనం సాగించే బోనుగురు లింగమూర్తి ఈ రోజు తెల్లవారుజామున గూడ్స్ రైలు కింద బలవన్మరణానికి పాల్పడినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ కెంసారం సంపత్ తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కూతుళ్ళు ఉనట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ADB: గుడిహత్నూర్ మండలంలోని మన్నూర్ (ఎస్సీ) కాలనీ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తెలంగాణ గురుకుల ప్రవేశ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ పాఠశాల నుంచి పరీక్షకు హాజరైన నలుగురు విద్యార్థులు బోథ్ గురుకుల పాఠశాలలో సీట్లు సాధించి వంద శాతం ఫలితాన్ని నమోదు చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేటుకు దీటుగా రాణించడంపై హర్షం వ్యక్తమవుతోంది.
MHBD: సీరోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని మోద్గులగూడెం గ్రామంలో ఈరోజు గ్రామసభ నిర్వహించారు. ఎస్సై సంతోష్ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఎస్పీ డా. శబరీష్ సూచించినట్లు గ్రామంలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేస్తామని, గంజాయిని తమ గ్రామం గడప తాకనీయమని, హెల్మెట్ వాడకం తప్పనిసరి చేస్తామంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేసారు.
మెదక్ జిల్లా మనోహరాబాద్ సమీపంలో జాతీయ రహదారి 44పై గురువారం ఉదయం ఘోర ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న లారీ, దండుపల్లి చౌరస్తా వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు వెంటనే స్పందించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో బాలాజీనగర్ కాలనీలోని ఆంజనేయస్వామి దేవాలయం పరిసర ప్రాంతాలను కార్పొరేటర్ రమేష్ బాబు పరిశుభ్రం చేస్తున్నారు. శనివారం శ్రీరామనమి వేడుకల్లో భాగంగా ఆలయం పరిసరాలలో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇబ్బందికరంగా ఉన్న పరిసరాలను జేసీబీ సహాయంతో శుభ్రం చేశారు.
MDCL: కుత్బుల్లాపూర్‌లోని పేట్ బషీరాబాద్ PS పరిధిలో పల్లవి లహరి(19) అనే యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సందీప్‌తో ప్రేమలో ఉన్న ఆమె, మార్చి 24 జరిగిన గొడవ తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు సూసైడ్ నోట్ రాసి ఉరేసుకుంది. సందీప్ తిరిగి వచ్చి చూడగా, అప్పటికే ఆమె మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో సందీప్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
BDK: పాల్వంచ అంబేద్కర్ సెంటర్ వద్ద గుంతలు పడ్డ రోడ్లకు అధికారులు ఇటీవల మరమ్మతులు చేపట్టారు. శ్రీరామనవమి దృశ్య తత్కాలిక చర్యలలో భాగంగా పూడ్చిన గుంటలు, మరల ఒక్క రోజు తిరగకుండానే రోడ్డు మొత్తం కాంకర్ రాళ్ల తో నిండిపోయింది. బైక్ మీద వెళ్లే వాళ్ళు జారి కింద పడిపోయే ప్రమాదం ఉందని స్థానికులు తెలిపారు. తిరిగి రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని కోరారు.
PDPL: రామగుండం మున్సిపల్ సమావేశం సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి, ఇంఛార్జి కమిషనర్ అరుణ శ్రీకి 6వ డివిజన్ కార్పొరేటర్ తోకల శ్యామని బుధవారం వినతిపత్రం ఇచ్చారు. జనగామలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సెంటర్ లైటింగ్, మహిళా భవనం, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని కోరారు. దేవాలయాలకు ఉచిత విద్యుత్ కల్పించాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో మేకల సమ్మన్న, జనగామ మహేందర్, తదితరులు పాల్గొన్నారు.
JN: లింగాలఘణపురం (M) చిటూర్‌లో గత ప్రభుత్వం నిర్మించిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ మెట్ల సైడ్ వీల్ ఇరిగి వేలాడుతున్నాయి. దీంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ ట్యాంక్ అత్యంత దగ్గరలో చిన్నపిల్లల అంగన్వాడీ కేంద్రం ఉండటంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్యాంక్ మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేశారు.
KMM: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా మూడు రోజులు సెలవు ప్రకటిస్తున్నట్లు వ్యవసాయ మార్కెట్ అధికారులు గురువారం తెలిపారు. ఈనెల 27 శ్రీరామనవమి, 28 శనివారం, 29 ఆదివారం వారాంతపు సెలవు కావడంతో తిరిగి 30 వ తారీకున మార్కెట్ క్రయవిక్రయాలు యధావిధిగా జరుగుతాయని వెల్లడించారు. రైతు సోదరులు గమనించారని కోరారు.
ADB: యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఏఎస్సై కాళ్లే రమేశ్ పిలుపునిచ్చారు. సిరికొండ పోలీస్ స్టేషన్‌లో పాలవాగు గ్రామానికి చెందిన యువకులకు ఆయన వాలీబాల్ కిట్‌ను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, క్రమశిక్షణతో లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో యువకులు యాదవ్ రావ్, భీంరావ్, తదితరులు పాల్గొన్నారు.
BDK: భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం, తెలంగాణలో గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక ప్రఖ్యాత ఆలయ పట్టణం. ఇది ధనుస్సు, బాణం, శంఖం, చక్రం ధరించిన స్వయంభూ శ్రీరామునికి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి, దానిని నిర్మించిన భక్త రామదాసుతో గాఢమైన సంబంధం ఉంది. అలాగే ఈ క్షేత్రాన్ని దక్షిణ అయోధ్యగా కూడా పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో పుణ్యక్షేత్రంగా పేరు ఉంది.