• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

నేడు మిషన్ భగీరథ నీటి సరఫరా బంద్

WNP: ఎల్లూరు పంపు హౌస్లో మరమ్మతుల కారణంగా శనివారం పట్టణంలోని పలు వార్డుల్లో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ మేఘనాథ్ గౌడ్ తెలిపారు. గణేష్ నగర్, సాయి నగర్, ఆర్టీసీ కాలనీ సహా 15కు పైగా ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు సహకరించి, నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయన కోరారు.

March 28, 2026 / 07:03 AM IST

బీటెక్ సెకండియర్ విద్యార్థి ఆత్మహత్య.!

SRPT: ఇబ్రహీంపట్నంలోని గురునానక్ కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతున్న కందిమల్ల సాయి శుక్రవారం తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సూర్యాపేట జిల్లాలోని నడిగూడెం మండలం శ్రీరంగాపురానికి చెందిన సాయి(20) గురునానక్ కాలేజీలో ECE 2nd ఇయర్ చదువుతున్నాడు.

March 28, 2026 / 07:03 AM IST

ఎయిర్‌పోర్టు వెళ్తున్నారా..? చెక్ చేసుకోండి

HYD: యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో HYD శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. విమానాల రాకపోకల్లో మార్పులు ఉండే అవకాశం ఉండటంతో ప్రయాణానికి ముందు అధికారిక వెబ్‌సైట్‌ www.hyderabad.aero ద్వారా తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. బయలుదేరే ముందు +91 4066546370 నంబర్‌కు కాల్ చేసి,రావాలని తెలిపారు.

March 28, 2026 / 07:02 AM IST

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు

NLG: శ్రీరామ నవమి వేడుకలు శుక్రవారం ఉమ్మడి న‌ల్ల‌గొండ జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి. పచ్చని తోరణాలతో శోభాయమానంగా ఆలయాలను అలంకరించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మేళతాళాలు, భక్తుల జయ జయధ్వానాల మధ్య జగథానుడి కల్యాణం నేత్రపర్వంగా సాగింది. అభిజిత్ లగ్నం శుభ ముహూర్తాన సీతారాముల వారి కల్యాణాన్ని వైభవంగా జరిపించారు.

March 28, 2026 / 07:01 AM IST

నేడు ధర్‌పల్లిలో 200 ట్రాక్టర్ల ఇసుక వేలం

NZBl ధర్‌పల్లి MRO కార్యాలయ ఆవరణలో నేడు ఉ.11 గంటలకు సుమారు 200 ట్రాక్టర్ల ఇసుకను బహిరంగ వేలం వేయనున్నట్లు ఆర్‌ఐ రాజేశ్వర్‌ తెలిపారు. ఇటీవల ఓన్నాజీపేట్‌, కొటాలపల్లి గ్రామాల్లో అక్రమంగా నిలువ ఉంచిన ఇసుకను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.MRO శాంత ఆధ్వర్యంలో ఈ వేలం నిర్వహించనున్నారు. నిబంధనల మేరకు అత్యధిక ధర పలికిన వారికి ఇసుకను కేటాయిస్తామన్నారు.

March 28, 2026 / 07:01 AM IST

చెరువులో గుర్తుతెలియని మహిళ శవం లభ్యం

KMR: లింగాపూర్ గ్రామ శివారులోని చెరువులో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని మహిళ (35-40 ఏళ్లు) శవం లభ్యమైందని దేవునిపల్లి ఎస్సై రంజిత్ తెలిపారు. మృతురాలి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఎవరైనా ఈ మహిళను గుర్తించినట్లయితే వెంటనే దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని ఆయన కోరారు. ప్రజలు సహకరించాలని ఎస్సై విజ్ఞప్తి చేశారు.

March 28, 2026 / 07:01 AM IST

ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులను ఖండించిన సీఐటీయూ

WGL: ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న చలో హైదరాబాద్ మహాధర్నాను అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఆశా వర్కర్లను ముందస్తుగా అరెస్టు చేయడాన్ని సీఐటీయూ వరంగల్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. శనివారం పర్వతగిరి మండల కేంద్రంలో సీఐటీయూ మండల కన్వీనర్ జిల్లా రమేష్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడం సరైంది కాదని, అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని అన్నారు.

March 28, 2026 / 06:50 AM IST

హెయిర్ స్టైల్‌తో ఐపీఎల్ క్రేజ్.. యువకుడి వెరైటీ అభిమానం!

SRPT: ఐపీఎల్ ఫీవర్ అప్పుడే మొదలైపోయింది. తన అభిమాన జట్లయిన RCB, SRH లపై మక్కువతో సూర్యాపేట పట్టణానికి చెందిన ఓ యువకుడు వినూత్నంగా హెయిర్ స్టైల్ చేయించుకున్నాడు. మైదానంలో ఆటగాళ్లు సిద్ధమవుతుంటే, ఇటు అభిమానులు ఇలా తమ క్రేజ్‌ను చాటుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

March 28, 2026 / 06:39 AM IST

మున్సిపల్ ఫ్లోర్ లీడర్‌గా చల్లా రమ్య

JN: స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ BRS ఫ్లోర్ లీడర్‌గా 5వ వార్డు కౌన్సిలర్ చల్లా రమ్య-రఘురెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం పోరాడాలని రాజయ్య ఈ సందర్భంగా నూతన ఫ్లోర్ లీడర్‌కు దిశానిర్దేశం చేశారు.

March 28, 2026 / 06:38 AM IST

సీతారాముల అద్భుత చిత్రం ఆవిష్కరణ

SDPT: శ్రీరామనవమి పురస్కరించుకుని అంతర్జాతీయ చిత్రకారుడు రుస్తుం తన ఆర్ట్ గ్యాలరీలో స్వయంగా చిత్రించిన సీతారాముల చిత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదర్శ దంపతులైన సీతారాముల జీవితం నేటి యువ జంటలకు మార్గదర్శకం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మానవతా విలువలతో కూడిన రాముడి జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు.

March 28, 2026 / 06:35 AM IST

ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: CI

WGL: వరంగల్ రంగశాయిపేటలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాల & కళాశాలలో శుక్రవారం సాయంత్రం ట్రాఫిక్ CI సుజాత ఆధ్వర్యంలో “ARRIVE AND ALIVE” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. CI సుజాత మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. ప్రమాద రహిత సమాజం నిర్మాణం కోసం విద్యార్థులు తమ వంతు కృషి చేయాలని కోరారు.

March 28, 2026 / 06:31 AM IST

ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: CI

WGL: వరంగల్ రంగశాయిపేటలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాల & కళాశాలలో శుక్రవారం సాయంత్రం ట్రాఫిక్ CI సుజాత ఆధ్వర్యంలో “ARRIVE AND ALIVE” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. CI సుజాత మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. ప్రమాద రహిత సమాజం నిర్మాణం కోసం విద్యార్థులు తమ వంతు కృషి చేయాలని కోరారు.

March 28, 2026 / 06:31 AM IST

కాప్రి గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థిని అదృశ్యం

ASF: ఆసిఫాబాద్ మండలంలోని కాప్రి గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థిని దుర్వ శైలజ (20) అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. సెలవులకు ఇంటికి వచ్చిన ఆమె, మార్చి 27 తెల్లవారుజామున కనిపించకుండా పోయిందన్నారు. 5.5 అడుగుల ఎత్తు, చామనచాయ వర్ణం కలిగిన ఆమె అదృశ్య సమయంలో తెలుపు టాప్, గోధుమ ప్యాంట్ ధరించి ఉన్నట్లు చెప్పారు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు CI బాలాజీ పేర్కొన్నారు.

March 28, 2026 / 06:31 AM IST

శోభాయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్

ADB: ఆదిలాబాద్ పట్టణంలో శ్రీరామ నవమిని పురస్కరించుకొని హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి శ్రీ రాముని శోభాయాత్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. పట్టణ ప్రజలందరూ సోదర భావంతో పండుగల నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో SP అఖిల్ మహాజన్, మహేందర్ తదితరులున్నారు.

March 28, 2026 / 06:31 AM IST

స్కౌట్స్ అండ్ గైడ్స్ వాలంటీర్లను అభినందించిన ACP

PDPL: గోదావరిఖని కోదండ రామాలయంలో సింగరేణి స్కూల్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు శ్రీరామనవమి సందర్భంగా భక్తులను నియంత్రించడానికి సేవలు అందించారు. ఈ సందర్భంగా ACP రమేష్, సింగరేణి అధికారులు విద్యార్థులను అభినందించారు. వాలంటీర్లు పలు సామాజిక సేవా కార్యక్రమాలలో పాలు పంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు, ఆలయ కమిటీ ఛైర్మన్, తదితరులు పాల్గొన్నారు.

March 28, 2026 / 06:30 AM IST