BDK: భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం, తెలంగాణలో గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక ప్రఖ్యాత ఆలయ పట్టణం. ఇది ధనుస్సు, బాణం, శంఖం, చక్రం ధరించిన స్వయంభూ శ్రీరామునికి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి, దానిని నిర్మించిన భక్త రామదాసుతో గాఢమైన సంబంధం ఉంది. అలాగే ఈ క్షేత్రాన్ని దక్షిణ అయోధ్యగా కూడా పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో పుణ్యక్షేత్రంగా పేరు ఉంది.
WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై సురేష్‌పై సస్పెన్షన్ వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యం సహా ఇతర ఆరోపణల నేపథ్యంలో జరిగిన విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో అధికారులు నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా సీపీ సన్ ప్రీత్ సింగ్ నిన్న రాత్రి సురేష్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
KNR: ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అత్యంత కీలకమైన అప్డేట్ ఇచ్చింది. రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులందరూ తప్పనిసరిగా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ పూర్తిగా లేదా అప్డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. ఇటీవల ప్రభుత్వం తెచ్చిన SC వర్గీకరణ నేపథ్యంలో సరిదిద్దుకోవడానికి APR 10 వరకు పొడిగించినట్లు వెల్లడించిది.
VKB: గ్రామాల అభివృద్దే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మున్సిపల్ ఛైర్మన్ ఎన్. ప్రశాంత్ అన్నారు. కొడంగల్ మండలం సంగాయిపల్లిలో సీసీ రోడ్డు పనులను సర్పంచ్ హన్మయ్య, నాయకులతో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు సంజీవ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ అంజి, వార్డు సభ్యులు ఉన్నారు.
SRD : బొల్లారం డివిజన్ కార్యాలయం ముందు ITC కంపెనీ CSR నిధులతో 8 ఎలక్ట్రిక్ ఆటోలు, 15 కంప్యూటర్లను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పంపిణీ చేశారు. డిప్యూటీ కమిషనర్ అమీన్‌పూర్ సర్కిల్ ప్రదీప్ కుమార్‌కు ఆటోలు, ప్రభుత్వ విద్యాసంస్థలకు కంప్యూటర్లు అందజేశారు. అభివృద్ధి, విద్యకు తోడ్పాటు అందించడమే లక్ష్యమని తెలిపారు.
NZB: జిల్లా న్యాయవాదుల పరస్పర సహకార సొసైటీ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నూతన కార్యవర్గ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల అధికారులుగా న్యాయవాదులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్, పులి జైపాల్‌లను నియమించారు. సొసైటీ అధ్యక్షుడు కె. శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వెంకటరమణ గౌడ్ వారికి నియామక పత్రాలు అందజేశారు.
మెదక్ పట్టణంలోని దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిటిజెన్స్ ఫోరం సభ్యులు మున్సిపల్ ఛైర్‌పర్సన్ రాధికా భూపతిరాజును కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఇంజినీర్ నితిన్‌లతో చర్చించగా వారు సానుకూలంగా స్పందించారు. పట్టణ అభివృద్ధికి సహకరించాలని ఫోరం ప్రతినిధులు కోరారు. ఈ కార్యక్రమంలో నాగభూషణం, భూపాల్ రెడ్డి, భుజంగ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
MLG: మంగపేట మండలంలోని 11 గ్రామపంచాయతీల కార్యదర్శులు బదిలీఅయ్యారు. ఈ మేరకు కలెక్టర్ దివాకర బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. సురేష్ మంగపేట నుంచి తుపాకులగూడెం, స్వప్న చెరుపల్లి నుండి గుమ్మడిదొడ్డి, రూప్ సింగ్ నర్సింహాసాగర్ నుంచి ఏడుజర్లపల్లి, రాజు రమణక్కపేట నుంచి బందాల, రాజేష్ చుంచుపల్లి TO లింగాల,సుధారాణి పూరెడుపల్లి TO బుట్టాయిగూడెం బదిలీఅయ్యారు.
PDPL: పత్తిపాక ప్రాథమిక పాఠశాల విద్యార్థి ఆధ్యంత్ జిల్లాస్థాయి రీడింగ్ ఛాంపియన్ పోటీలకు ఎంపికయ్యాడు. సమన్విత మండల స్థాయి ప్రశంసా పత్రం పొందారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రావణి వారిని అభినందించారు. అలాగే 5వ తరగతి గురుకుల సీటు సాధించిన విద్యార్థి హనీసు సుల్తానాను సన్మానించారు. ఈ కార్యక్రమంలో HM మల్లన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
HYD: నగరంలో కాలుష్యం పెరుగుతుండటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం నగరంలోని గాజులరామారంలో AQI 199గా నమోదైంది. వాహనాల పొగ, చెత్త దహనం ఎయిర్ పొల్యూషన్‌కు ప్రధాన కారణాలుగా అధికారులు గుర్తించారు. దీనికి తోడు సిటీలో కట్టెల పొయ్యిల వాడకంతో గాలి నాణ్యత మరింత క్షీణించింది. శ్వాసకోశ సమస్యలు వచ్చే ముప్పుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
BHPL: జిల్లా మేడిపల్లి గ్రామంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిశుభ్రత, ఆహార నాణ్యత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆదేశించారు. MPDO బాబు ఉన్నారు.
JN: రఘునాథపల్లి మండల కేంద్రంలోని దొడ్డుగుట్ట వద్ద గల శ్రీ అయోధ్య రామాలయంలో రేపు నిర్వహించనున్న 107వ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను గురువారం సర్పంచ్ బొల్లం ఉమారాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉమారాణి, శ్రీసీతారాముల కళ్యాణానికి ప్రజలు హాజరై దీన్ని విజయవంతం చేయాలని కోరారు. ఆలయ ధర్మకర్తలు పాశం నిరంజన్, పాశం దయాకర్, రాజేంద్ర ప్రసాద్.
MNCL: జన్నారం మండలంలోని ధర్మారం గ్రామ ప్రభుత్వ యుపిఎస్ పాఠశాల నుంచి 8 మంది విద్యార్థులు గురుకుల విద్యాలయానికి ఎంపికయ్యారని హెచ్ఎం సత్తయ్య తెలిపారు. ఇవాళ పాఠశాల ఆవరణలో గురుకులానికి ఎంపికైన విద్యార్థులను పాఠశాల హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయులు అభినందించారు. తమ పాఠశాలకు చెందిన సందీప్, కీర్తన, అవంతిక, తన్మైశ్రీ, హర్శిని, ఆరుష్,అహల్య, శ్రీజన్ కుమార్ ఉన్నారు.
MHBD: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని మండల ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. మరిపెడ పట్టణ కేంద్రంలో అంగడి బజార్‌లో నేడు ఆశా వర్కర్లు భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. తక్కువ వేతనంతో తమ కుటుంబాలను పోషించడంలో కష్టతరమైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్య కోసం క్షేత్రస్థాయిలో నిత్యం వెట్టిచాకిరి చేస్తున్నాము.
JN: చిల్పూరు మండల BRS పార్టీ కన్వీనర్‌గా రంగు హరీష్ గౌడ్ ను మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య నియమించారు. అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, BRS పార్టీ బలోపేతమే ప్రధాన పనిచేస్తూ కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని హరీష్ గౌడ్‌కు రాజయ్య సూచించారు.