• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ముగిసిన మన్యంకొండ హుండీ లెక్కింపు

MBNR: మన్యంకొండలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం నిర్వహించిన హుండీ లెక్కింపులో రూ.44,90,043 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆలయ అభివృద్ధికి నిధులు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అలహరి మధుసూదన్ కుమార్, ఈవో శ్రీనివాసరాజు, ఇన్‌స్పెక్టర్ వీణా ధరణి, అలహరి రామకృష్ణ, ఐడీబీఐ బ్యాంక్ మేనేజర్ పాల్గొన్నారు.

March 25, 2026 / 07:04 PM IST

వీధి కుక్కల బీభత్సం.. మేక పిల్లలు బలి

SDPT: వర్గల్ మండలం వేలూరు గ్రామంలో కుక్కల దాడిలో 23 మేక పిల్లలు మృతి చెందాయి. బుధవారం రైతులు మల్లేశం, కృష్ణ మేకలను మేతకు తీసుకెళ్లి, పిల్లలను దొడ్డిలోనే ఉంచారు. ఈ క్రమంలో వీధి కుక్కలు మేకల దొడ్డిలో దూరి పిల్లలను చంపేశాయి. సాయంత్రం వచ్చి చూసేసరికి మూగజీవాలు రక్తపు మడుగులో ఉండటంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు. అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని కోరారు.

March 25, 2026 / 07:04 PM IST

ప్రభుత్వ పథకాల లక్ష్యాలను పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్

NGKL: జిల్లాలోని అర్హులైన రైతులందరికీ పంట రుణాలను విరివిగా అందించాలని అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు దశలో ఉన్న నేపథ్యంలో బ్యాంకుల అనుసంధానంతో అమలు చేస్తున్న ప్రభుత్వ ప్రాధాన్య పథకాల లక్ష్యాలను బ్యాంకర్లు పూర్తి చేయాలన్నారు.

March 25, 2026 / 07:04 PM IST

‘ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి’

BDK: బూర్గంపాడు మండలం సారపాక మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్ బుధవారం సారపాక ప్రధాన రహదారి వెంబడి చెట్లను నాటారు. ప్రతి ఒక్కరు తమ వంతుగా మొక్కలు నాటి సంరక్షించాలని సర్పంచ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కిషోర్ నాయక్‌తో పాటు ఉప సర్పంచ్ కన్నదారి, రమేష్ ఈవో మహేష్, వార్డ్ మెంబర్ మువ్వా వెంకటేశ్వర్లు పంచాయతీ సిబ్బంది ఉన్నారు.

March 25, 2026 / 07:04 PM IST

ఏప్రిల్ 2న గ్రామసభలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్

PDPL: ఏప్రిల్ 2న జరగనున్న ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక గ్రామసభలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గ్రామాల్లో 4 రోజుల ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించి పరిశుభ్రతను మెరుగుపరచాలని సూచించారు. ప్రతి మండలంలో కనీసం 100 ఇందిరమ్మ ఇండ్లు గృహప్రవేశానికి సిద్ధం చేయాలని, పన్ను వసూళ్లు 100%కి చేరుకోవాలన్నారు.

March 25, 2026 / 07:03 PM IST

23 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాం: మంత్రి

KMM: ఉమ్మడి రాష్ట్రంలో 23 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుర్తుచేశారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ఇళ్లను పూర్తి చేసి పేదల సొంతింటి కలను నెరవేరుస్తామని అసెంబ్లీలో నేడు ప్రకటించారు. ఇందుకుగాను రూ.738 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేశారు.

March 25, 2026 / 07:00 PM IST

‘ఆర్టీసీ విలీనం చేయకుంటే సమ్మెకు దిగుతాం’

WGL: నర్సంపేట పట్టణంలో ఆర్టీసీ డిపో జేఏసీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడిచినా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయలేదని విమర్శించింది. బుధవారం జేఏసీ ఛైర్మన్ కొలిశెట్టి రంగయ్య, వైస్ ఛైర్మన్ గొలనకొండ వేణు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులకు ఎప్పటికప్పుడు వేతన సవరణలు, సమస్యల పరిష్కారం జరగలేదన్నారు.

March 25, 2026 / 07:00 PM IST

పెట్రోల్ కొరతతో.. రద్దీగా పెట్రోల్ బంకులు

VKB: కొడంగల్ మండల పరిధిలోని మెజారిటీ పెట్రోల్ బంకులు బుధవారం వాహనదారులతో రద్దీగా కనిపించాయి. ఇందన కొరత కారణంగా సమస్య తలెత్తినట్టు పెట్రోల్ బంక్ నిర్వాహకులు తెలిపారు. అర్థరాత్రి నుంచి పడిగాపులు కాస్తున్నా పెట్రోల్ దొరకడం లేదని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు.

March 25, 2026 / 07:00 PM IST

మూలమలుపు వద్ద పొదలు తొలగింపు

JN: లక్ష్మీనారాయణపురం క్రాస్ రోడ్ – జనగామ మార్గంలోని ప్రమాదకర మూలమలుపు వద్ద బుధవారం పోలీసులు ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టారు. CI జానకీ రాంరెడ్డి పర్యవేక్షణలో జేసీబీ సహాయంతో రోడ్డుకు ఇరువైపులా విస్తరించిన ముళ్లపొదలు, చెట్లను తొలగించారు. ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టారు.

March 25, 2026 / 06:56 PM IST

దుగ్గొండి తాహసీల్దార్‌గా ముసిక సమ్మక్క

WGL: దుగ్గొండి మండల తాహసీల్దార్‌గా ముసిక సమ్మక్క బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు పారదర్శక సేవలు అందించడమే తన లక్ష్యమని తెలిపారు. సాదా బైనామా ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న రెవిన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.

March 25, 2026 / 06:52 PM IST

ఆధ్యాత్మిక వైభవం.. శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్ఠాపన

KMM: తిరుమలాయపాలెం మండల పరిధిలోని బచ్చోడు గ్రామం బుధవారం ఆధ్యాత్మిక చైతన్యంతో పులకించిపోయింది. గత మూడు రోజులుగా అత్యంత నిష్ఠతో నిర్వహిస్తున్న శ్రీ సీతాసమేత శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణ, ఆంజనేయ స్వామివార్ల సహిత శ్రీరామ లింగేశ్వర, కనకదుర్గమ్మ ఆలయ శిఖర కలశ ప్రతిష్ఠాపన మహోత్సవాలు బుధవారం నాటి ప్రధాన ఘట్టంతో వైభవంగా ముగిశాయి.

March 25, 2026 / 06:50 PM IST

మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ

SRPT: ఈ నెల 29న జరిగే మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మహాధర్నా జయప్రదం చేయాలని రాష్ట్ర జేఏసీ నాయకుడు శంకర్ పిలుపునిచ్చారు. బుధవారం సూర్యాపేట మున్సిపాలిటీలో ధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది అంతా తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా అధ్యక్షుడు చీకూరి అశోక్ కుమార్, సెక్రటరీ వేణు, ఉద్యోగులు పాల్గొన్నారు.

March 25, 2026 / 06:48 PM IST

గురుకుల పాఠశాలలో సీటు సాధించిన విద్యార్థులు

KMR: రామారెడ్డి మండలం గోకుల్ తండా ప్రభుత్వ పాఠశాలకు చెందిన 9 మంది విద్యార్థులు గురుకుల పాఠశాలలో సీట్లు సాధించినట్లు పాఠశాల హెచ్ఎం ఖదీర్ తెలిపారు. ఇటీవల పాఠశాలకు చెందిన పదిమంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయగా తొమ్మిది మంది విద్యార్థులు ఎంపికైనట్లు చెప్పారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలో సీట్లు సాధించిన విద్యార్థులను అభినందించారు.

March 25, 2026 / 06:47 PM IST

కలెక్టర్‌ను కలిసిన చీర్కపల్లి ప్రజాప్రతినిధులు

WNP: చీర్కపల్లి గ్రామ సర్పంచ్ పగడాల రవి నేతృత్వంలో ఉపసర్పంచ్ పరుశురాములు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జమ్మి మల్లేష్, వార్డ్ సభ్యులు దొడ్ల కాశీమ్లు వనపర్తి జిల్లా కలెక్టర్ను కలిశారు. గ్రామ అభివృద్ధికి సంబంధించి విస్తృతంగా చర్చించారు. గ్రామంలో జరుగుతున్న పనులు, భవిష్యత్ ప్రణాళికల గురించి కలెక్టర్కు వివరించారు.

March 25, 2026 / 06:46 PM IST

CPIML లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిగా బందు క్రాంతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ మాట్లాడుతూ.. పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిగా బందు క్రాంతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యలపై పోరాటాలకు నూతన కమిటీ నిరంతరం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

March 25, 2026 / 06:45 PM IST