• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మహిళా న్యాయవాదిపై దాడికి నిరసనగా విధుల బహిష్కరణ

SRCL: నిజామాబాద్ జిల్లా బోధన్ కోర్టు న్యాయవాది జి.కళ్యాణిపై దాడికి నిరసనగా వేములవాడలో న్యాయవాదులు మంగళవారం కోర్టు విధులు బహిష్కరించారు. మహిళా న్యాయవాదిపై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిసె సదానందం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గడ్డం సత్య నారాయణరెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు.

February 24, 2026 / 01:00 PM IST

కామారెడ్డిలో పత్తి కొనుగోళ్లకు గడువు పొడిగింపు

కామారెడ్డి జిల్లాలో పత్తి కొనుగోళ్లకు గడువును ఫిబ్రవరి 27 వరకు పొడిగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రకటించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ఆధ్వర్యంలో జరుగుతున్న పత్తి కొనుగోలు ప్రక్రియకు గడువును పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.

February 24, 2026 / 01:00 PM IST

HYDలో పోలీసుల భారీ ఆపరేషన్‌

HYD సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆపరేషన్ ఆక్టోపస్ ద్వారా దేశ వ్యాప్తంగా భారీ నెట్‌వర్క్‌ను ఛేదించారు. 16 రాష్ట్రాల్లో దాడులు చేసి 104 మంది నిందితులను అరెస్ట్ చేయగా.. వీరిలో బ్యాంకు అధికారులు ఉండటం గమనార్హం. వీరిపై 1,055 కేసులు ఉండగా, ఇప్పటివరకు రూ.127 కోట్ల మోసాలకు పాల్పడ్డారు. నిందితుల నుంచి రూ.36 లక్షల నగదు, 200లకు పైగా మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

February 24, 2026 / 12:52 PM IST

రజక సంఘం ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో

KNR: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో రెండు నెలల పాప మృతికి కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ స్టేజ్ వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు పూసల సంపత్ మాట్లాడుతూ.. అగ్రవర్ణ దురహంకారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు.

February 24, 2026 / 12:44 PM IST

‘భూ సమస్యల పరిష్కారంలో లైసెన్స్‌డ్ సర్వేయర్ల పాత్ర కీలకం’

WNP: జిల్లా సర్వేశాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో నూతన లైసెన్స్‌డ్ సర్వేయర్లకు లైసెన్స్‌ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాబోయే రోజుల్లో ప్రజల భూ సమస్యల పరిష్కారంలో లైసెన్స్‌డ్ సర్వేయర్ల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. భూ సర్వే ప్రక్రియల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా చూడాలని సూచించారు.

February 24, 2026 / 12:43 PM IST

ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడుగా ఉదయ్

NZB: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా కమ్మర్ పల్లి మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన మోర్తాడ్ ఉదయ్‌ని నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు కమలాకర్ తెలిపారు. ఈ రోజు నియమాక పత్రాన్ని అందజేసి ఎస్సీల సంక్షేమం కోసం పాటు పడాలని సూచించారు. ఉదయ్ మాట్లాడుతూ.. ఎస్సీల అభివృద్ధికి తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు.

February 24, 2026 / 12:40 PM IST

85వ రోజుకి చేరిన రిలే నిరాహార దీక్షలు

NGKL: చారకొండ మండలంలోని ఎర్రవల్లి గ్రామంలో ఎర్రవల్లి-గోకారం రిజర్వాయర్లో ముంపునకు గురికాకుండా చూడాలని చేస్తున్న రిలే నిరాహార దీక్ష మంగళవారంతో 85 రోజులకు చేరుకుంది. అలాగే R&R ప్యాకేజీ ప్రాథమిక నోటిఫికేషన్ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని భూనిర్వాసితులు డిమాండ్ చేశారు. తమ భూములు తమకు కావాలని, తమ ఇళ్లు ముంపునకు గురి కాకుండా కాపాడాలని కోరారు.

February 24, 2026 / 12:38 PM IST

MGNREGA పనులను ప్రారంభించిన.. సర్పంచ్

MLG: మంగపేట మండలం నిమ్మగూడెం, రమణక్కపేట, దొమేడ గ్రామాల్లో మంగళవారం MGNREGA పనులను ఆయ గ్రామాల సర్పంచులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేసవి కాలంలో గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించే ఈ పథకం ద్వారా గ్రామీణులు ఆర్థికంగా బలోపేతం అవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామాల వార్డ్ మెంబర్లు ఉన్నారు.

February 24, 2026 / 12:36 PM IST

బాధిత కుటుంబానికి LOC అందజేసిన ఎంపీ

SRD: గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని మాదారం గ్రామానికి చెందిన ఠాకూర్ పద్మాబాయ్ చికిత్స కోసం నిజాం ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సస్‌లో చేరగా, మెదక్ ఎంపీ రఘునందన్ రావు రూ.2,00,000 ఎల్ఓసిని కుటుంబ సభ్యుడు వికాస్ సింగ్‌కు అందించారు. కార్యక్రమంలో జిన్నారం మండల బీజేపీ అధ్యక్షుడు కొత్తకాపు జగన్ రెడ్డి, రమణ సింగ్ తదితరులు ఉన్నారు.

February 24, 2026 / 12:32 PM IST

ఆలయ అభివృద్ధి కోసం భూమి కొనుగోలు

JGL: పెగడపల్లి మండల కేంద్రంలోని గల శ్రీ స్వయంబూ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భూమిని కొనుగోలు చేశారు. ఆలయ ఆవరణలో కమిటీ సభ్యులు, గ్రామస్థులు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఆలయానికి ప్రక్కనున్న కొండ శ్రీనివాస్ గౌడ్ చెందిన రెండు గుంటల భూమిని రూ. 17,10,000 వేలకు కొనుగోలు చేసినట్లు వాళ్ళ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ తెలిపారు.

February 24, 2026 / 12:31 PM IST

ఉపాధి హామీ పనులు ప్రారంభం

MDK: చిలిపిచేడ్ మండలం శిలాంపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులను నూతన సర్పంచ్ రాజేందర్ రెడ్డి, కార్యదర్శి అఖిల్ మంగళవారం ప్రారంభించారు. కూలీలకు పని కల్పించడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు వారు పేర్కొన్నారు. అర్హులైన గ్రామస్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ రమేశ్, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

February 24, 2026 / 12:31 PM IST

గాంధారి సిహెచ్‌లో గర్భిణీలకు వైద్య పరీక్షలు

KMR: గాంధారి CHCలో అమ్మ ఒడి కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు డాక్టర్ సాయికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. CHC పరిధిలోని గర్భిణీ మహిళలు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే వారికి పౌష్టికాహారం తీసుకోవాలని అవగాహన కల్పించారు.

February 24, 2026 / 12:30 PM IST

మల్లమ్మ మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే సంతాపం

BHNG: మోతె మండలం రాఘవపురం గ్రామానికి చెందిన మట్టిపల్లి మల్లమ్మ ఇటీవల మరణించగా, మంగళవారం మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆమె నివాసానికి చేరుకుని భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మల్లమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

February 24, 2026 / 12:30 PM IST

ఆలయ నిర్మాణానికి స్థల సేకరణ చేయాలని వినతి

ASF: కాగజ్ నగర్ పట్టణంలోని కాపు వాడలో పోచమ్మ ఆలయం స్థల సేకరణ చేయాలని 6వ వార్డ్ కౌన్సిలర్ ఎమ్మాజీ శారదా సంతోష్ కోరారు. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్సీ దండే విఠల్ ఆదేశాల మేరకు తహసీల్దార్‌కి వినతిపత్రం అందజేశారు. ఆలయ స్థలం సేకరణకై పూర్తి సహాయ సహకారాలు అందజేస్తానని, త్వరలోనే ఆలయ నిర్మాణానికి స్థల సేకరణ చేస్తానని తహసీల్దార్ హామీ ఇచ్చారని తెలిపారు.

February 24, 2026 / 12:30 PM IST

‘ఫోటోగ్రాఫర్ పై దాడి నిందితులను శిక్షించాలి’

NLG: తిరుమలగిరి మండలంలో ఫోటోగ్రాఫర్ మధుపై మద్యం మత్తులో దాడి చేసి, కెమెరాలు ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ చిట్యాల మండల ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ అధ్యక్షుడు సైదులు యాదవ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వృత్తిధర్మంలో ఉన్నవారిపై ఇలాంటి దాడులు అమానుషమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చిట్యాల పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు.

February 24, 2026 / 12:28 PM IST