• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

రూ.1.60 కోట్ల వ్యయంతో సుందరీకరణ

MDCL: హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆరు చెరువుల సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ద్వారా పనులు చేపట్టింది. తొలి దశలో రామంతపూర్ పెద్ద చెరువు అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చి, ప్రధాన రహదారులు, పార్కు సుందరీకరణ పనులను జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రూ.1.60 కోట్ల వ్యయంతో చేపట్టారు. ప్రస్తుతం ఈ పనులు ముగింపు దశకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.

March 24, 2026 / 05:14 AM IST

లోకేశ్వరంలో మహిళ అనుమానాస్పద మృతి

NRML: లోకేశ్వరం మండలం పొట్‌పల్లి గ్రామానికి చెందిన లిఖిత(33) అనుమానాస్పదంగా మృతి చెందింది. కడుపునొప్పితో బాధపడుతున్న ఆమె మందులు వాడినా ఉపశమనం కలగలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. రాత్రి అస్వస్థతగా ఉందని గదిలోకి వెళ్లి పడుకోగా, ఉదయం మృతిచెందిన స్థితిలో కనిపించింది. మృతురాలి అక్క ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 24, 2026 / 05:10 AM IST

ఎంటర్ప్రైన్యూర్షిప్ డెవలప్‌మెంట్‌పై అవగాహన

కరీంనగర్ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో ఎంటర్ప్రైన్యూర్షిప్ (EDC), కామర్స్ విభాగం, ఎంఎస్ఎంఈ సంయుక్తంగా అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు సొంతంగా వ్యాపారాలు, స్టార్టప్లు ప్రారంభించేందుకు అవసరమైన ప్రాథమిక అంశాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, ఆర్థిక సహాయంపై నిపుణులు అవగాహన కల్పించారు. నవకల్పనలతో యువత పారిశ్రామిక వేత్తలుగా కావాలన్నారు.

March 24, 2026 / 05:07 AM IST

‘అంజన్న జయంతి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు’

JGL: కొండగట్టు హనుమాన్ జయంతి ఉత్సవాలకు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి అధికారులకు సూచనలు ఇచ్చారు. ఏప్రిల్ 1 నుంచి జరిగే ఉత్సవాలకు త్రాగునీరు, చలివేంద్రాలు, పార్కింగ్, లైటింగ్ ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.

March 24, 2026 / 04:54 AM IST

సోషల్ మీడియాపై కొత్త చట్టం..!

HYD: సమాజంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘విద్వేష ప్రసంగాలు & నేరాల నిరోధక బిల్లు 2026’ను రూపొందించింది. మత విద్వేషాలను రగిల్చేలా మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా ప్రభుత్వం దీని ప్రకారం కఠిన చర్యలు తీసుకోనుంది. నేరం రుజువైతే ఒకటి నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తారు.

March 24, 2026 / 04:49 AM IST

భక్తుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్న ఈవో

SRCL: వేములవాడ భీమేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యాలపై ఆలయ ఈవో రమాదేవి ప్రత్యేక దృష్టి సారించారు. సోమవారం ఆలయ ప్రాంగణాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన, భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రద్దీ దృష్ట్యా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

March 24, 2026 / 04:37 AM IST

పెద్దచెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ నిర్ధారించాలని ఫిర్యాదు

RR: మహేశ్వరం మండలం సర్దార్‌నగర్‌లోని రావిర్యాల పెద్ద చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్‌ను వెంటనే నిర్ధారించాలని అక్కడి ప్లాట్ల యజమానులు హైడ్రా ప్రజావాణిలో కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను కోరారు. ప్రతి ఏటా చెరువు నిండి ఎగువన ఉన్న లే ఔట్లను ముంచేస్తుందని, వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

March 24, 2026 / 04:33 AM IST

భూ సేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

PDPL: కునారం రైల్వే ఓవర్ బ్రిడ్జి (R.O.B)కు సంబంధించిన పెండింగ్ భూ సేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. అప్రోచ్ రోడ్డు కోసం భూమి సేకరణ పూర్తయిందని, మిగిలిన షాపులను త్వరగా ఖాళీ చేయించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర నిధులు అందుబాటులో ఉండటంతో పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.

March 24, 2026 / 04:23 AM IST

‘మహిళలకు కాంగ్రెస్‌తోనే సముచిత స్థానం’

HYD: మహిళలకు సముచిత స్థానం కల్పిస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని మహిళా కాంగ్రెస్ నాయకురాలు జ్యోతి రెడ్డి అన్నారు. సోమవారం గాంధీభవన్లో ఎర్రబెల్లి స్వర్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పార్టీ బలోపేతానికి మహిళా కమిటీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

March 24, 2026 / 04:16 AM IST

కుక్కల స్వైరవిహారం.. బాలికకు తీవ్ర గాయాలు

VKB: పరిగిలోని టీచర్స్ కాలనీలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తూ నాలుగేళ్ల బాలికపై దాడి చేశాయి. స్థానికులు వెంటనే స్పందించి కుక్కలను తరిమికొట్టారు. బాధితురాలికి స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, మెరుగైన వైద్యం కోసం నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి కుక్కల బెడదను నివారించాలని డిమాండ్ చేస్తున్నారు.

March 24, 2026 / 04:11 AM IST

నగరానికి 915 కొత్త బస్సులు

HYD: నగరంలో పర్యావరణహిత రవాణా దిశగా కీలక అడుగు పడింది. కేంద్ర ప్రభుత్వ ‘PM E-డ్రైవ్’ పథకం కింద నగరానికి 915 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. వీటిలో కాలనీల కోసం 100 మినీ బస్సులు, ప్రధాన మార్గాల కోసం 815 స్టాండర్డ్ బస్సులు అందుబాటులోకి వస్తాయి. ఈకేఏ మొబిలిటీ-గ్రీన్ సెల్ కన్సార్టియం ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. ఈ బస్సుల వల్ల భాగ్యనగరంలో కాలుష్యం తగ్గనుంది.

March 24, 2026 / 04:08 AM IST

ఈ నెల 27న భారీ శోభాయాత్ర.. MLA పిలుపు

HYD: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భాగ్యనగరంలో శ్రీరామ యువ సేన భారత్ ఆధ్వర్యంలో భారీ శోభాయాత్రను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఈ నెల 27న ఉదయం 10:30 గంటలకు ధూల్‌పేటలోని ఆకాశప్పురి హనుమాన్ మందిరం నుంచి ప్రారంభంకానుంది. రామ భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని శోభాయాత్రను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపునిచ్చారు.

March 24, 2026 / 04:04 AM IST

దామగుండంలో నేవీ రాడార్ పనుల పరిశీలన

VKB: పూడూరు మండలం దామగుండంలో నిర్మాణంలో ఉన్న నేవీ రాడార్ స్టేషన్ పనులను పరిశీలించేందుకు భారత నౌకాదళ ఉపాధ్యక్షుడు వైస్ అడ్మిరల్ సంజయ్ వత్సాయన్ (PVSM, AVSM, NM) చేరుకున్నారు. MLA రామ్మోహన్ రెడ్డితో కలిసి స్టేషన్ పనుల పురోగతిని సమీక్షించారు. ప్రాజెక్టు సాధనలో కీలక పాత్ర పోషించిన MLAను వైస్ అడ్మిరల్ సన్మానించి మొమెంటో అందజేశారు.

March 24, 2026 / 04:03 AM IST

దేవాలయానికి రూ. 2.49 లక్షల ఆదాయం

JGL: ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి భక్తుల రద్దీ కొనసాగింది. ఈ సందర్భంగా సోమవారం టికెట్ల ద్వారా రూ.1,35,066, ప్రసాదాల ద్వారా రూ. 90,720, అన్నదానం ద్వారా రూ. 24,165 ఆదాయం లభించింది. మొత్తం కలిపి రూ. 2,49,951 వచ్చినట్లు ఈవో శ్రీనివాస్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో దర్శనం చేసుకుని స్వామివారికి సేవలు సమర్పించారు.

March 24, 2026 / 03:59 AM IST

పేకాట స్థావరాలపై ఎస్సై మెరుపు దాడి

BHPL: నైన్ పాక గ్రామంలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్సై సతీశ్ తన సిబ్బందితో కలిసి మెరుపు దాడి నిర్వహించి, వారి వద్ద నుంచి రూ.2,100 నగదుతో పాటు పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో రేపాల ప్రభాకర్, రత్న తిరుపతితో సహా మరో నలుగురు ఉన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఎస్సై హెచ్చరించారు.

March 24, 2026 / 12:31 AM IST