NZB: ధర్పల్లి TRP జిల్లా వైస్ ప్రెసిడెంట్‌గా సంబటి సుమన్‌ను నియమిస్తూ జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతుల సందీప్ పటేల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టినట్లు ఆయన తెలిపారు. పార్టీ బలోపేతానికి, నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడేందుకు సుమన్ క్రియాశీలకంగా వ్యవహరిస్తారని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.
SRCL: సిరిసిల్ల 26 వార్డులో నివాసం ఉంటున్న రెడ్డిమల్ల దయాకర్-ప్రియాంక యొక్క చిన్న కూతురు అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. ఈ విషయం తెలుసుకున్న వార్డు కౌన్సిలర్ భార్య నెల్లుట్ల లలిత, నెల్లుట్ల నరేష్ స్పందించి పాపా ఆరోగ్య ఖర్చుల నిమిత్తం రూ.10,000, 25 కేజీల రైస్ బ్యాగ్, వారి తండ్రి నెల్లుట్ల కనకయ్య చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందించారు.
ADB: గ్రామాలు పట్టణాల్లో పేకాట ఆడితే సమాచారం పోలీసులకు అందజేయాలని CCS ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ సోమవారం తెలియజేశారు. రూరల్ మండలంలోని చందా గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారంతో దాడులు నిర్వహించి 5 గురిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. వారి నుంచి 5 మొబైల్ ఫోన్లు, రూ.40,860 నగదు, 3ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
JGL: ఉద్యోగులు, పెన్షనర్లు, చిన్న వ్యాపారాల్లో పనిచేసే కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో భాగంగా చేపడుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికులు ఎదురుకుంటున్న సమస్యలపై సోమవారం గలామెత్తారు.
NLG: హాలియా మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా రవీందర్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అల్లా శ్రీనివాస్‌రెడ్డి సెలవుపై వెళ్లడంతో, నల్గొండ అసిస్టెంట్ కమిషనర్‌గా ఉన్న ఆయనను ప్రభుత్వం ఇక్కడ నియమించింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, పౌర సేవల మెరుగుదలకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
SRPT : యాసంగి సీజన్‌లో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా జిల్లాలో 330 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. రైతులకు ఇబ్బంది కలగకుండా కేంద్రాల్లో నీడ, తాగునీరు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం వివరాలను వెంటనే ఆన్‌లైన్ చేసి, 48 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని సూచించారు.
MBNR: బాలానగర్ మండల కేంద్రంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను సంత బజార్ నిర్వహణ హక్కుల వేలంపాట ఈ నెల 26న ఉదయం 11 గంటలకు జరగనుంది. ఆసక్తి గలవారు రూ. 15,000 డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనాలని సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
KMR: కాంగ్రెస్ ప్రభుత్వం గారడి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిందని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. సోమవారం ఆయన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు 100% రుణమాఫీ చేసినట్లు రుజువు చేస్తే తాను నేలకు ముక్కు రాస్తానని అన్నారు. పేదలకు ఏమాత్రం ఉపయోగపడే విధంగా బడ్జెట్ లేదన్నారు.
SRPT: సూర్యాపేట పట్టణంలో వరుస చోరీలకు పాల్పడుతున్న గుండె శ్రీకాంత్‌ను టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 3 తులాల బంగారం, 20 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ వెంకట్ తెలిపారు. సాయినగర్, కోర్టు ఆవరణలో చోరీలకు పాల్పడినట్లు నిందితుడు అంగీకరించడంతో రిమాండ్‌కు తరలించారు.
RR: మహేశ్వరం మండలం పరిధిలో ఉన్న గాంధీనగర్ తండాలో నూతనంగా ఐమాస్ లైట్లను జిల్లా మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ డాక్టర్ తీగల అనితరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆవుల యాదయ్య, గాంధీనగర్ తండా సర్పంచ్ సుధాకర్ నాయక్, వార్డు మెంబెర్‌లు పాల్గొన్నారు.
SRCL: వేములవాడ పట్టణాభివృద్ధిలో భాగంగా ముస్లిం సోదరుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం షాదీఖానా నిర్మాణానికి రూ.80 లక్షలు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు క్షేత్రస్థాయిలో పర్యటించి స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ అక్రమ్, ఇతర మత పెద్దలతో సమావేశమై వారి సలహాలు అడిగి తెలుసుకున్నారు.
WGL: గీసుకొండ మండలం గొర్రెకుంటకు చెందిన వెల్ మార్క్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ వద్ద ఎక్స్పెరి అయిన, పాడైన ఫుడ్ ఉత్పత్తులను అమ్మకానికి సిద్ధంగా నిల్వచేసినట్లు సమాచారం మేరకు సోమవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. దాదాపు 16 రకాల, సుమారు 1,06,940/- రూపాయల విలువ గలఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ మధుసూదన్ తెలిపారు.
NLG: జిల్లా ఎన్జీ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్న గొడుగు గోవర్ధనగిరి గుండెపోటుతో మృతి చెందడం బాధాకరమని ఆ కళాశాల రీజనల్ కోఆర్డినేటర్ బొజ్జ అనిల్ కుమార్ అన్నారు. సోమవారం పట్టణంలోని ఎన్జీ కళాశాలలో గల అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు.
NZB :తెలంగాణ విశ్వవిద్యా లయం వృక్షశాస్త్రంలో సోమవారం లింగరాజుకు డాక్టరేట్ ప్రధానం చేశారు. ఆచార్య విద్యావర్ధిని పర్యవేక్షణలో ” సోలానం జాన్తోకర్పం యొక్క పెరుగుదల, దిగుబడిపై బ్రాసీనోస్టెరాయిడ్స్, సాలిసిలిక్ యాసిడ్ ప్రభావం ” అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించారు. ఎక్స్‌టర్‌నల్ ఎగ్జామినేర్ ఆచార్య సీతారాం మౌఖిక పరీక్ష నిర్వహించారు.
WNP: గృహ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించడం చట్ట విరుద్ధమని, ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాల అధికారి కాశీ విశ్వనాథ్ హెచ్చరించారు. సోమవారం వనపర్తి పట్టణంలోని పలు హోటళ్లలో జిల్లా సివిల్ సప్లై అధికారి కాశీ విశ్వనాథ్ తమ బృందంతో కలిసి తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో భాగంగా మొత్తం 19 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.