• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

సింగరేణి కార్మికుల పెన్షన్ పెంచాలి: ఎంపీ

PDPL: సింగరేణి కార్మికులకు రిటైర్మెంట్ తర్వాత అందజేసే పెన్షన్ రూ.10,000 పెంచాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఇవాళ పార్లమెంటులో మాట్లాడారు. ప్రమాదకరమైన గనుల్లో పనిచేసే కార్మికులకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు.

March 24, 2026 / 09:57 PM IST

చేనేత ఐక్యవేదిక ఉపాధ్యక్షురాలిగా నాగలక్ష్మి

SRPT: తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా కోదాడకు చెందిన రుద్ర నాగలక్ష్మి నియమితులయ్యారు. హైదరాబాద్‌లో రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీరమోహన్ ఆమెకు ఇవాళ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాగలక్ష్మి మాట్లాడుతూ.. చేనేత కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.

March 24, 2026 / 09:49 PM IST

నూతన ఎస్సైగా రామన్ గౌడ్ బాధ్యతల స్వీకరణ

WNP: చిన్నంబావి మండల నూతన ఎస్సైగా రామన్ గౌడ్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. పెంట్లవెల్లి నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చిన ఆయన, అనంతరం వనపర్తి సీఐని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్సై మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు.

March 24, 2026 / 09:48 PM IST

మియాపూర్ మార్గంలో భారీగా నిలిచిన వర్షపు నీరు

RR: నిరంతర వర్షాల కారణంగా బాచుపల్లి-మియాపూర్ రూట్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ పాయింట్ వద్ద నీరు నిలిచిపోవడంతో వాహనాలు స్లోగా కదులుతున్నాయి. ప్రస్తుతం హైడ్రా (HYDRA) బృందం, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు క్షేత్రస్థాయిలో నీటిని తొలగిస్తూ, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. ప్రయాణికులు అప్రమత్తంగా వాహనాలు నడపాలని అధికారులు సూచించారు.

March 24, 2026 / 09:35 PM IST

బాలికను మోసం చేసిన నిందితుడు అరెస్ట్

MHBD: బాలికకు మాయమాటలు చెప్పి లోబరుచుకొని గర్భవతిని చేసిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు టౌన్ CI మహేందర్ రెడ్డి తెలిపారు. మౌలానా అనే యువకుడు స్థానిక ఫొటో స్టూడియోలో పనిచేస్తుంటాడు. ఫొటో కోసం వచ్చిన బాలికకు మాయమాటలు చెప్పి లోబరుచుకొని సుమారు 1YR నుంచి రిలేషన్ కొనసాగించారు. గమనించిన తల్లిదండ్రులు ఇవాళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

March 24, 2026 / 09:19 PM IST

‘టీవీ రహిత జిల్లాగా ఖమ్మంను తయారు చేయడం లక్ష్యం’

KMM: టీబీ రహిత జిల్లాగా ఖమ్మంను తయారు చేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. మంగళవారం ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా స్థానిక బాలాజీ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, నగర మేయర్ పునుకొల్లు నీరజతో కలిసి పాల్గొన్నారు.

March 24, 2026 / 09:11 PM IST

రేపు సర్పంచుల ఫోరం అధ్యక్షుడి ఎన్నిక

BHPL: మల్హర్రావు మండల కేంద్రంలో రేపు సర్పంచుల ఫోరం అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించనున్నట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాజయ్య వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికకు పార్టీకి చెందిన సర్పంచులందరూ హాజరుకావాలని ఆయన కోరారు. మండలంలోని 15 పంచాయతీలలో 13 చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులే విజయం సాధించారని రాజయ్య పేర్కొన్నారు.

March 24, 2026 / 09:06 PM IST

SRR కళాశాల జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం

KNR: కరీంనగర్ SRR డిగ్రీ&పీజీ కళాశాల జాతీయ సేవా పథకం జీవశాస్త్ర విభాగం నాలుగవ యూనిట్ ప్రత్యేక శిబిరం మోతేలో ప్రారంభమైంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల సంఘం ప్రధాన కార్యదర్శి డా. కడారు సురేందర్ రెడ్డి, గ్రామ ప్రజాప్రతినిధులు శిబిరాన్ని ప్రారంభించారు. విద్యార్థుల్లో సేవాభావం, అంకితభావం పెంపొందించుకోవాలని ఆయన సూచించారు.

March 24, 2026 / 09:00 PM IST

విద్యా రంగానికి బడ్జెట్ పెంచాలంటూ ఆందోళన

NRPT: విద్యా రంగానికి బడ్జెట్లో 20 శాతం నిధులు కేటాయించాలని TPTF జిల్లా అధ్యక్షుడు దేవేందర్ డిమాండ్ చేశారు. నారాయణపేట మున్సిపల్ పార్క్ వద్ద ఉపాధ్యాయులు కొత్త పీఆర్సీ, రిటైర్డ్ ఉద్యోగుల బిల్లుల చెల్లింపు, KGBV ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయ నాయకులు పాల్గొన్నారు.

March 24, 2026 / 08:58 PM IST

మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం

NLG: చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ నేరడలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఛైర్ పర్సన్ నర్రా వినోద, వెటర్నరీ వైద్యులు వనం అభినవ్, అమరేందర్ పాల్గొన్నారు. ఈ శిబిరంలో 161 పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసి, 36 పశువులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. మార్కెట్ కార్యదర్శి జానయ్య, సర్పంచ్ మిర్యాల వెంకటేశం పాల్గొన్నారు.

March 24, 2026 / 08:56 PM IST

యువతకు మై భారత్ పోస్టర్ ప్రాముఖ్యత పై అవగాహన

KMM: ముదిగొండ మండల కేంద్రంలోని స్త్రీ శక్తి భవన్‌లో ‘యువ మండల్ వికాస్ అభియాన్’ కార్యక్రమాన్ని ప్రజ్వల యువజన సంఘం అధ్యక్షులు చింతమాల పాపయ్య ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముదిగొండ, మధిర, కూసుమంచి, సత్తుపల్లి, ఏన్కూరు, కల్లూరు మండలాల్లోని యువతకు మై భారత్ పోర్టల్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

March 24, 2026 / 08:53 PM IST

నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు

NGKL: చారకొండ మండలం శిరుసనగండ్లలో నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. సీఐ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో 400 లీటర్ల బెల్లం పానకం, 20 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. అక్రమ మద్యం, కల్తీ కల్లు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

March 24, 2026 / 08:53 PM IST

భజన పోటీలు ఘనంగా నిర్వహణ

NRPT: ఊట్కూరు మండలం బిజ్వార్ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా జిల్లా స్థాయి భజన పోటీలు మంగళవారం నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి భజన బృందాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. మూడు రోజులుగా జరుగుతున్న ఈ పోటీలకు ప్రవేశ రుసుము లేదని నిర్వాహకులు తెలిపారు. విజేతలకు శ్రీరామనవమి రోజున బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు.

March 24, 2026 / 08:52 PM IST

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ

KMM: కొణిజర్ల ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొన్న సంఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదకర సంఘటన వైరా హైవే పై తనికెళ్ళ సమీపంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఖమ్మం వైపు నుంచి వైరా వైపు వెళ్తున్న లారీ గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

March 24, 2026 / 08:51 PM IST

వాహనాదారులు విధిగా కంటి పరీక్షలు చేయించుకోవాలి: SP

BHPL: వాహన డ్రైవర్లు విధిగా కంటి పరీక్షలు చేయించుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని SP సంకీర్త్ గౌడ్ సూచించారు. ఇవాళ BHPL జిల్లా కేంద్రంలోని సింగరేణి కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రహదారి నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ఎస్పీ సూచించారు. ADSP నరేష్ తదితరులు ఉన్నారు.

March 24, 2026 / 08:50 PM IST