• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

బోరిగాంలో అగ్రిప్రమాదం.. స్పందించిన ప్రభుత్వం

ADB: నేరడిగొండలో ఫైర్ స్టేషన్ కోసం ఏడాది నుంచి ఎదురుచూపులు సాగుతుండగా, తాజాగా బోరిగాం గ్రామంలో 5 ఇళ్లు దగ్ధం కావడం అధికారులను కదిలించింది. ఇటీవల అసెంబ్లీ సమావేశంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రస్తావించగా.. ప్రభుత్వం వెంటనే స్పందించి ఫైర్ స్టేషన్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు.

March 23, 2026 / 11:27 AM IST

దిలార్పూర్‌లో ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం

NRML: దిలార్పూర్ మండల కేంద్రంలో సోమవారం ఎమ్మార్వో కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎజాజ్ హమీద్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలలో నెలకొన్న వివిధ సమస్యలపై ప్రతి శాఖ అధికారి బాధ్యతతో పనిచేసి పరిష్కారం దిశగా కృషి చేయాలని సూచించారు.

March 23, 2026 / 11:26 AM IST

కల్వకుర్తి బస్టాండ్‌లో శ్రమదానం

NGKL: కల్వకుర్తి పట్టణానికి చెందిన స్వామి వివేకానంద సేవ బృందం, మై భారత ఆధ్వర్యంలో షాహిద్ దివాస్ సందర్భంగా సోమవారం ఉదయం పట్టణంలోని బస్టాండ్ ఆవరణంలో శ్రమదానం నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ ఆవరణంలో ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లు, చెత్తను స్వచ్ఛందంగా తొలగించారు. అనంతరం దేశభక్తిని చాటుతూ పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.

March 23, 2026 / 11:24 AM IST

రైతులకు అలర్ట్.. మిగిలినవి రెండు రోజులే..!

MBNR: కొత్తగా పట్టాదారు పాస్‌బుక్ పొందిన రైతులు మార్చి 25 లోపు ‘రైతు భరోసా’కు దరఖాస్తు చేసుకోవాలని గాండీడ్ మండలం పెద్దవార్వాల్ ఏఈఓ శివలీల తెలిపారు. ఫిబ్రవరి 28 వరకు పాస్‌బుక్ పొంది, వివరాలు నమోదు చేయని వారు ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్, మొబైల్ నంబర్ వివరాలను ఏఈఓకు సమర్పించాలని ఆమె సూచించారు.

March 23, 2026 / 11:23 AM IST

రేపు చందంపేటలో మెగా హెల్త్ క్యాంపు

NLG: చందంపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు మండల వైద్యాధికారి రాజేష్ తెలిపారు. ఈ వైద్య శిబిరంలో జనరల్ ఫిజీషియన్లతో పాటు, స్త్రీలు, చిన్నపిల్లల వైద్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఆర్థోపెటిక్, కంటి, డెంటల్ సమస్యలకు కూడా పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 23, 2026 / 11:20 AM IST

రేపు చందంపేటలో మెగా హెల్త్ క్యాంప్

NLG: చందంపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు మండల వైద్యాధికారి రాజేష్ తెలిపారు. ఈ వైద్య శిబిరంలో జనరల్ ఫిజీషియన్లతో పాటు, స్త్రీలు, చిన్నపిల్లల వైద్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఆర్థోపెటిక్, కంటి, డెంటల్ సమస్యలకు కూడా పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 23, 2026 / 11:20 AM IST

ఏడేళ్లుగా అప్‌గ్రేడ్ కోసం తప్పని ఎదురుచూపులు

MNCL: జన్నారం ప్రభుత్వ ఆసుపత్రిని అప్‌గ్రేడ్ చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏడేళ్లుగా నెరవేరడం లేదు. జన్నారం నాలుగు జిల్లాలకు వెళ్లే సరిహద్దులో ఉంది. అలాగే మండల జనాభా 50 వేలకు పైగానే ఉంది. జన్నారం ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతిరోజు వివిధ గ్రామాల నుంచి ప్రజలు, రోగులు వచ్చి వైద్య సేవలు పొందుతున్నారు. 2019లో ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేస్తామని ఇచ్చిన హామీ నెరవేరలేదు.

March 23, 2026 / 11:19 AM IST

బీజేపీ నేతల ముందస్తు అరెస్ట్

JN: బీజేపీ అధిష్టాన పిలుపు మేరకు ఛలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయల్దేరిన పాలకుర్తి బీజేపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రవి కుమార్ మాట్లాడుతూ.. 6 గ్యారెంటీల హామీలను నెరవేర్చాలని ప్రజల పక్షాన కోట్లాడుతున్న బీజేపీ నేతలను అరెస్ట్ చేయడం సరి కాదు అన్నారు. బెదిరింపులకు భయపడం అని హెచ్చరించారు.

March 23, 2026 / 11:08 AM IST

గండి హనుమాన్ ఆలయ హుండీ లెక్కింపు

JGL: మెట్‌పల్లి మండలం బండలింగాపూర్ గ్రామ గండి హనుమాన్ దేవాలయ హుండీలను సోమవారం మధ్యాహ్నం 1:30 గంటలకు లెక్కించనున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. అదేవిధంగా రేపు ఉదయం భక్తులు 11 రోజుల దీక్షలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.

March 23, 2026 / 11:06 AM IST

‘ముందస్తు అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు’

KNR: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్ చందర్రావు పిలుపు మేరకు చేపట్టిన అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న చిగురుమామిడి బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ బూత్ అధ్యక్షుడు దొంత కరుణాకర్‌తో సహా పలువురు నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణిచి వేయలేరని అన్నారు.

March 23, 2026 / 11:06 AM IST

గచ్చిబౌలి ORR వద్ద కార్ బ్రేక్ డౌన్.. ట్రాఫిక్ స్లో

RR: గచ్చిబౌలి వైపు వెళ్లే ఔటర్ రింగ్ రోడ్‌పై ఒక కారు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి, వాహనాల స్లోగా కదులుతున్నాయి. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రస్తుతం ఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే పనిలో ఉన్నారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, పోలీసుల సూచనలు పాటిస్తూ వీలైతే ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని కోరారు.

March 23, 2026 / 11:04 AM IST

పశువులకు గాలి కుంటు నివారణ టీకాలు

SRCL: రాచర్ల గొల్లపల్లిలో సోమవారం ఉదయం మూగజీవాలకు గాలి కుంటు నివారణ టీకాలు వేశారు. సర్పంచ్ కొండ రమేశ్ గౌడ్ ఆధ్వర్యంలో పశువైద్యాధికారిని రేణుక పశువులకు గాలి కుంటు వ్యాధి సోకకుండా ఉచితంగా టీకాలు వేశారు. మూగజీవాల పెంపకందారులు ఆధార్ కార్డుతో ఆధార్ లింక్ ఉన్న ఫోన్ నంబర్‌తో పశు ఆసుపత్రికి వచ్చి టీకాలు వేయించాలని సూచించారు.

March 23, 2026 / 11:02 AM IST

భగత్ సింగ్‌కు నివాళులర్పించిన చిన్నారులు

NZB: స్వాతంత్య్ర సమరయోధుడు షాహిద్ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా మోపాల్ మండల కేంద్రంలో యోగా టీమ్ చిన్నారులు సోమవారం ఆయనకు నివాళి అర్పించారు. ముగ్గులతో ఆయన చిత్రపటాన్ని వేసి, త్యాగాలను స్మరించుకున్నారు. యోగా శిక్షకులు నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. మనుషుల్ని చంపగలరేమో కానీ.. వారి ఆదర్శాలను మాత్రం కాదు అన్న భగత్ సింగ్ మాటలు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతాయన్నరు.

March 23, 2026 / 11:01 AM IST

బీజేపీ మండల అధ్యక్షుడి ముందస్తు అరెస్ట్

KMR: అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న బీజేపీ బిచ్కుంద మండల అధ్యక్షుడు శెట్‌పల్లి విష్ణును సోమవారం ఉదయం పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. అవినీతి, అరాచక, కమిషన్ల పాలన సాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వెళ్తున్న బీజేపీ నాయకులను అరెస్టు చేయడం తగదన్నారు. మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను వంచించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.

March 23, 2026 / 11:01 AM IST

డిజిటల్ పద్ధతిలో ఫిర్యాదుల స్వీకరణ

ADB: ప్రజల సమస్యలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా పరిష్కరించేందుకు ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థను డిజిటలైజ్ చేయడం జరిగిందని ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మాట్ అన్నారు. సోమవారం ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేశారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు.

March 23, 2026 / 11:00 AM IST