MNCL: జన్నారం ప్రభుత్వ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏడేళ్లుగా నెరవేరడం లేదు. జన్నారం నాలుగు జిల్లాలకు వెళ్లే సరిహద్దులో ఉంది. అలాగే మండల జనాభా 50 వేలకు పైగానే ఉంది. జన్నారం ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతిరోజు వివిధ గ్రామాల నుంచి ప్రజలు, రోగులు వచ్చి వైద్య సేవలు పొందుతున్నారు. 2019లో ఆస్పత్రిని అప్గ్రేడ్ చేస్తామని ఇచ్చిన హామీ నెరవేరలేదు.