KNR: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్ చందర్రావు పిలుపు మేరకు చేపట్టిన అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న చిగురుమామిడి బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ బూత్ అధ్యక్షుడు దొంత కరుణాకర్‌తో సహా పలువురు నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణిచి వేయలేరని అన్నారు.