• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

సిబ్బంది ప్రాణరక్షణ కోసం ‘ఎల్సీ యాప్’: ఎస్ఈ

KMM: విద్యుత్ క్షేత్రస్థాయి సిబ్బంది ప్రాణరక్షణ కోసం ప్రవేశపెట్టిన ‘ఎల్సీ యాప్’ విప్లవాత్మక మార్పు అని ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి కొనియాడారు. శుక్రవారం ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ.. లైన్ క్లియర్ (ఎల్సీ) అనుమతులు ఇకపై పూర్తిగా డిజిటల్ పద్ధతిలోనే జారీ అవుతాయన్నారు. దీనివల్ల పొరపాటున తప్పుడు ఫీడర్లను ఎంపిక చేసే అవకాశం ఉండదని ప్రమాదాలకు తావుండదని పేర్కొన్నారు.

March 20, 2026 / 07:00 PM IST

ముస్లిం సోదరులకు తోఫాను పంపిణీ చేసిన సర్పంచ్

WNP: చిన్నంబావి మండల పరిధిలోని కొప్పునూరు గ్రామంలో శుక్రవారం రంజాన్ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున రంజాన్ తోఫాను స్థానిక మసీదు వద్ద సర్పంచ్ వడ్డేమాన్ బిచ్చన్న పంపిణీ చేశారు. మసీదు కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముస్లిం కుటుంబాలకు దుస్తులు, ఇతర కానుకలను అందజేశారు. కలిసికట్టుగా పండగలు జరుపుకోవాలని సర్పంచ్ పేర్కొన్నారు.

March 20, 2026 / 06:58 PM IST

పంచాయితీ కార్యాలయంకు గడియారం అందజేత

NLG: నల్గొండ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన దాత ఆమంచి రాజలింగం గ్రామపంచాయతీ కార్యాలయంకు గోడ గడియారం బహుకరించారు. స్థానిక సర్పంచ్ జిల్లపల్లి రేణుక రాజుకు ఆయన కార్యాలయం ఆవరణలో శుక్రవారం గడియారాన్ని అందించారు. గ్రామ అభివృద్ధిలో తన సహకారం ఉంటుందన్నారు. దాతకు సర్పంచ్ పంచాయతీ కార్యాలయంకు గడియారం అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

March 20, 2026 / 06:54 PM IST

‘పది పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి’

SRD: జిల్లాలో పదవ తరగతి పరీక్షలు పారదర్శకంగా జరిగేలా చూడాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎంఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ శుక్రవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్స్ అనుమతి లేదని చెప్పారు. పరీక్షా కేంద్రంలో ఏ సంఘటన జరిగిన చీఫ్ సూపరింటెండ్లు, ఎంఈవోలే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు.

March 20, 2026 / 06:49 PM IST

ఆగ్రోస్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

GDWL: ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన యాప్ ద్వారా రైతులు ఎరువులు కొనుగోలు చేసే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. శుక్రవారం అయిజ పట్టణంలోని ఆగ్రోస్ రైతుసేవా కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈనెల 25లోగా రైతులు రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

March 20, 2026 / 06:48 PM IST

‘విత్తనమిచ్చిన వ్యాపారులే కొనుగోలు చేయాలి’

NZB: ఎర్రజొన్నల విత్తనం ఇచ్చిన వ్యాపారులే రూ.4వేల క్వింటాల చొప్పున కొనుగోలు చేయాలని ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్​ చేసింది. ఈ మేరకు కమిటీ ప్రతినిధులలు ప్రభాకర్, మంథని గంగారాం, జక్కలింగారెడ్డి, దేవారంలు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్‌‌కు వినతిపత్రం అందజేశారు. పసుపు ధరను కృత్రిమంగా తగ్గించే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కమిటీ నాయకులు డిమాండ్ చేశారు.

March 20, 2026 / 06:46 PM IST

అధ్వానంగా వర్గల్ రోడ్డు.. చినుకు పడితే చిత్తడే

SDPT: వర్గల్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారి అధ్వానంగా తయారైంది. సాయిబాబా ఆలయం నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు పడటంతో స్వల్ప వర్షానికే చెరువును తలపిస్తోంది. నిత్యం వేలాది మంది ప్రయాణించే ఈ మార్గంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరారు.

March 20, 2026 / 06:45 PM IST

ఇందిరమ్మ గృహ ప్రవేశాల్లో పాల్గొన్న మంత్రి సతీమణి

NRPT: కృష్ణ మండలం ఖాన్రెదొడ్డిలో శుక్రవారం జరిగిన నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ వేడుకల్లో మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి లలిత పాల్గొన్నారు. గ్రామానికి చెందిన జి.ఆంజనేయులు, ఏ.తాయప్ప, వై.శ్రీనివాస్ల ఇళ్లను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో పేదల సొంతింటి కల నెరవేరుతోందని పేర్కొన్నారు.

March 20, 2026 / 06:39 PM IST

బాలల సదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శుక్రవారం నగరంలోని బాలల సదనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సదనంలోని వసతులు, పరిశుభ్రత, పిల్లలకు అందుతున్న ఆహార నాణ్యతను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం శిశు సంరక్షణ కేంద్రంలోని చిన్నారుల ఆరోగ్యంపై ఆరా తీస్తూ, వారిపై నిరంతర వైద్య పర్యవేక్షణ ఉండాలని సిబ్బందిని ఆదేశించారు.

March 20, 2026 / 06:37 PM IST

సీనియర్ జర్నలిస్టులు పరామర్శించిన ఎమ్మెల్యే

BHNG: తుర్కపల్లి మండలం తిరుమలాపురం గ్రామానికి చెందిన సీనియర్ రిపోర్టర్ అరె నరసింహాలు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వెంటనే స్పందించి, బాధితుడిని పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితుని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

March 20, 2026 / 06:35 PM IST

పిచ్చుకల సంరక్షణకు ముందుకు రావాలి: జీఎం

PDPL: ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా సింగరేణి ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్జీ-3 జీఎం డి. లలిత్ కుమార్ మాట్లాడుతూ.. పిచ్చుకల సంఖ్య తగ్గిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ సమతుల్యతకు పిచ్చుకలు ముఖ్యమని, వాటి సంరక్షణకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

March 20, 2026 / 06:35 PM IST

ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం

BHPL: మహదేవపూర్ సిద్దేశ్వరాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ జడ్పీటీసీ అరుణ శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేవుళ్ళ అనుగ్రహంతో మహదేవపూర్ గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, గ్రామ ప్రజలు పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలన్నారు.

March 20, 2026 / 06:33 PM IST

‘4 లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది’

SRCL: యాసంగి సీజన్‌లో జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగర్వాల్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో యాసంగి సీజన్ కొనుగోళ్లపై అధికారులు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్లతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. సుమారు జిల్లాలో 2,70,000 నుంచి 3 లక్షల మెట్రిక్ ధాన్యం ఈనెల కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

March 20, 2026 / 06:30 PM IST

‘బకాయిలు 100% వసూలు చేయాలి’

SRCL: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో పట్టణ మున్సిపాలిటీకి రావాల్సిన ఆస్తిపన్ను బకాయిలను వంద శాతం వసూలు చేయాలని వేములవాడ మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ సంపత్ ఆధ్వర్యంలో ఛైర్మన్ మాట్లాడుతూ.. నెలాఖరు వరకు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేయాలన్నారు.

March 20, 2026 / 06:30 PM IST

‘పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి’

SRPT: పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ తల్లిదండ్రులను కోరారు. శుక్రవారం పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు ముగిసిపోయాయని, పాఠశాలలకు ఒంటిపుటబడులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు కాలవలు, చెరువులు, బావులకు వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉందన్నారు.

March 20, 2026 / 06:30 PM IST