NRML: లోకేశ్వరం మండలం పొట్పల్లి గ్రామానికి చెందిన లిఖిత(33) అనుమానాస్పదంగా మృతి చెందింది. కడుపునొప్పితో బాధపడుతున్న ఆమె మందులు వాడినా ఉపశమనం కలగలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. రాత్రి అస్వస్థతగా ఉందని గదిలోకి వెళ్లి పడుకోగా, ఉదయం మృతిచెందిన స్థితిలో కనిపించింది. మృతురాలి అక్క ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.