కృష్టా: సమాజసేవతో పేదలకు మేలు చేయటం అభినందనీయం అని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. ఆదివారం నాగాయలంక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ డీ.దుర్గా హరిప్రసాద్ సాధారణ అనారోగ్యాలతో పాటు మెదడు, నరాలు, వెన్నెముక సంబంధిత వైద్య పరీక్షలు చేసి మందులు అతిథుల చేతులమీదుగా అందచేశారు.