PPM: ప్రభుత్వ భూములు, చెరువులు, గెడ్డలు రక్షణ కోసం పలు శాఖల అధికారులు కలిసి జాయింట్ ఆపరేషన్ చేయాలని నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం అని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే, ప్రకృతి వనరులను కాపాడాలని అధికారులను కోరారు.