• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఉగాది పురస్కారం అందుకున్న డాక్టర్ శంకర్ బాబు

NGKL: లింగాల మండలం దారారం గ్రామానికి చెందిన డాక్టర్ నూకల శంకర్ బాబు బుధవారం హైదరాబాద్లో ఉగాది పురస్కారం అందుకున్నారు. మయూరి ఆర్ట్స్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఇచ్చే ఈ అవార్డును పలువురు సినీ నటులు, రాజకీయ నేతల చేతుల మీదుగా ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా శంకర్ బాబుకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

March 18, 2026 / 03:30 PM IST

ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సర్పంచ్

NGKL: లింగాల మండలం వడ్డె రాయవరం గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీని సర్పంచ్ పబ్బతి శ్రీను యాదవ్ బుధవారం నెరవేర్చారు. పంచాయతీ ఎన్నికల సమయంలో గ్రామంలో నెలకొన్న నీటి ఎద్దడిని తీరుస్తానని మాట ఇచ్చిన మేరకు, తాజాగా కొత్త తాగునీటి బోరును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ పస్పుల శివయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

March 18, 2026 / 03:30 PM IST

ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక తనిఖీ కలెక్టర్ అంకిత్

BDK: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ టేకులపల్లి మండలం కోయగూడెం ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో తెలుగు, ఇంగ్లీష్ పుస్తకాలు చదివించిన ఆయన, వారి పఠన సామర్థ్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉపాధ్యాయులను ఈ సందర్భంగా హెచ్చరించారు.

March 18, 2026 / 03:30 PM IST

రేపు దేవరకొండలో ‘ఉగాది కవి సమ్మేళనం’

NLG: దేవరకొండలోని గ్రంథాలయంలో గురువారం తెలంగాణ సాహిత్య సాంస్కృతిక అధ్యయన వేదిక ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సరం సందర్భంగా ‘ఉగాది కవి సమ్మేళనం’ నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు పర్చా వాసుదేవరావు తెలిపారు. సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. దేవరకొండ నియోజకవర్గంలోని కవులు, రచయితలు, సాహితీ అభిమానులు, కళాకారులు హాజరు కావాలని కోరారు.

March 18, 2026 / 03:28 PM IST

‘పశువులకు వ్యాధి సోకకుండా టీకాలు వేయించాలి’

NLG: పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా ముందస్తుగా టీకాలు వేయించాలని చిట్యాల పశువైద్యాధికారి వనం అభినవ్ సూచించారు. రైతులు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా తమ పశువులకు టీకాలు వేయించి ఆరోగ్యంగా ఉంచుకోవాలని కోరారు. టీకాల ద్వారా ప్రాణాంతక వ్యాధుల నుంచి పశువులను రక్షించుకోవచ్చని, ఉచిత టీకా కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

March 18, 2026 / 03:22 PM IST

జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

NZB: జిల్లా ప్రజలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరికి శుభాలు చేకూరాలని ఆకాంక్షించారు. తెలుగు నామాది నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో ఆనందోత్సాహాలు నింపాలని అభిలాషించారు. ఉగాది పండగను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అన్నారు.

March 18, 2026 / 03:20 PM IST

‘నిర్వాసితులందరికీ అక్కడే ఇల్లు నిర్మించి ఇవ్వాలి’

KMM: ఖమ్మం వెలుగుమట్ల నిర్వాసితులందరికీ ఇళ్లు కూల్చిన చోటే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని CPI ML న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు అవునురి మధు కోరారు. బుధవారం ఖమ్మం వచ్చిన నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. భూదాన్ భూముల్లో 700 ఇళ్లకు పైగా కూల్చివేసిన ప్రభుత్వం 311 మందికి మాత్రమే ఇళ్ల పట్టాలు ఇచ్చిందన్నారు.

March 18, 2026 / 03:19 PM IST

నూతన ఎస్సైని సన్మానించిన BRS నాయకులు

BHPL: గోరికొత్తపల్లి మండల నూతన ఎస్సైగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సాయి త్రిలోక్ నాథ్ రెడ్డిని బుధవారం రేగొండ BRS మండల యువజన నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్సైని శాలువతో ఘనంగా సన్మానించారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఎస్సై సూచించారు. BRS నేతలు ఉన్నారు.

March 18, 2026 / 03:19 PM IST

మంత్రి, ఎమ్మెల్సీలను కలిసిన రాష్ట్ర అధ్యక్షురాలు

WGL: తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఇటీవల నియమితులైన ఎర్రబెల్లి స్వర్ణ బుధవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్, MLC సారయ్యలను మర్యాదపూర్వకంగా కలిశారు. తన నియామకానికి సహకరించినందుకు ఆమె వారికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, మహిళా సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా కృషి చేయాలని వారు ఆమెకు సూచించారు.

March 18, 2026 / 03:17 PM IST

ఆసుపత్రిపై ఆకస్మిక తనిఖీ.. షోకాజ్ నోటీసులు జారీ

MHBD: తొర్రూరు పట్టణంలోని విజయ లక్ష్మి హాస్పిటల్‌ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. రవి రాథోడ్ నేడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చేపట్టిన ఈ తనిఖీ సమయంలో ఆసుపత్రి మూసివేసి ఉండటం గమనార్హం. దీంతో సంబంధిత సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఘటనపై నివేదిక సిద్ధం చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

March 18, 2026 / 03:14 PM IST

విద్యాలయాన్ని తనిఖీ చేసిన తహాసీల్దార్..

HNK: శాయంపేట కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని తహాసీల్దార్ ప్రవీణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యాలయ పరిసర ప్రాంతాలు, స్టోర్ రూమ్‌లను పరిశీలించి పలు సూచనలను చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని, విద్యాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. GPO వంగేటి సత్యం ఉన్నారు.

March 18, 2026 / 03:10 PM IST

వైద్య శిబిరాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్

BDK: భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహిస్తున్న ఈ శిబిరంలో అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సుమారు 200 మంది సందర్శించగా, 100 మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు.

March 18, 2026 / 03:06 PM IST

‘బడ్జెట్‌లో ఆర్టీసీకి నిధులు కేటాయించాలి’

ADB: రాష్ట్ర బడ్జెట్‌లో ఆర్టీసీకి నిధులు కేటాయించాలని SWF రీజనల్ అధ్యక్షుడు ఎస్. భీమ్ రావు అన్నారు. బుధవారం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రజలు కార్మికులతో కలిసి సంతకాల సేకరణ చేపట్టారు. వేతన సవరణ అలవెన్స్, ఆర్టీసీలో యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేయాలన్నారు. విద్యుత్తు బస్సులను ఆర్టీసీకి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

March 18, 2026 / 03:05 PM IST

ముందస్తు ఉగాది వేడుకలు

SRCL: చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో గురువారం ముందస్తు ఉగాది వేడుకలను నిర్వహించారు. ఈ సందర్బంగా ఉగాది పచ్చడిని వేపపువ్వు, బెల్లం, మామిడికాయ, చింతపండు, కారం, ఉప్పు మిశ్రమంతో పచ్చడి పాటు బూరెలు తయారుచేసి చిన్నారులకు పంపిణీ చేశారు.

March 18, 2026 / 03:05 PM IST

పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

PDPL: పెద్దపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఏర్పాటుచేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇవాళ సందర్శించారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. కట్టుదిట్టంగా నిర్వహించాలని ఆదేశించారు.

March 18, 2026 / 03:04 PM IST