SRCL: ప్రజలకు మరింత వేగవంతమైన పోలీస్ సేవలు అందించాలని లక్ష్యంతో పోలీస్ శాఖ కీలక ముందడుగు వేసిందని, జిల్లా ఎస్పీ మహేష్ బిగితే అన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో “నైట్ ఎఫ్ఐఆర్” విధానాన్ని ప్రారంభించారు. నేరం జరిగిన తర్వాత శారీరకంగా మానసికంగా ఇబ్బందులు పడుతున్న బాధితులకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం ఒక భారంగా మారకూడదని ప్రవేశపెట్టామన్నారు.
ASF: కమన గ్రామానికి చెందిన సందీప్ కుమార్ వాంకిడి ఎస్సై మహేందర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. భూ సమస్యపై ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్తే ఎస్సై దుర్భాషలాడారని, శారీరక దాడికి పాల్పడ్డారని బుధవారం పేర్కొన్నారు. అస్వస్థతతో ఉన్న తన పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని వాపోయారు. ఈ మేరకు జిల్లా SPని కలిసి న్యాయం చేయాలని వేడుకున్నారు.
KNR: శంకరపట్నం మండలం అముదాలపల్లిలో ఇటీవల బత్తుల నర్సయ్య అనే వ్యక్తి మరణించిన విషయం తెలిసిందే. అయితే నర్సయ్య పురుషుల పొదుపు సంఘంలో నెల నెల చిన్నమొత్తంలో డబ్బులు పొదుపుచేసుకున్నాడు. దాంతో పాటు ఇన్సూరెన్స్ కూడా ఉండడంతో బుధవారం ఆ పొదుపు సంఘం సభ్యులు నర్సయ్య కుటుంబ సభ్యులకు రూ. లక్షా 30 వేలను అందజేశారు.
WGL: శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, నర్సంపేట నియోజకవర్గం అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
MHBD: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్ని శాఖ అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను నిర్దేశించిన గడువులోపు పూర్తిచేయాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో ఎలాంటి ఆలస్యం జరగకుండా చూడాలని, నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు.
NZB: జిల్లా బోధన్ పట్టణంలోని న్యూ బస్టాండ్ సమీప హోటల్‌పై నమ్మదగిన సమాచారం మేరకు బుధవారం ఎన్ఫోర్స్‌మెంట్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్తంగా దాడి చేశారు. తనిఖీల్లో 7 సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ తహశీల్దార్ హనుమంతు, ఎస్సై నాగేశ్ రావు, పోలీసుల ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు.
NRML: తెలంగాణలో క్రికెట్ అభివృద్ధి హైదరాబాద్‌కే పరిమితం కాకుండా అన్ని జిల్లాల్లో సమానంగా జరగాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ నిర్మల్ జిల్లా కోచ్ రామరాజు అన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో కొన్ని అవకతవకలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో కీలక అసోసియేషన్ సమావేశంలో పలు ప్రశ్నలు లేవనెత్తినట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
JGL: జగిత్యాల రూరల్ మండలం వంజరుపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామ రైతులు కలిసి ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం రైతులు తమ పంటను దూర ప్రాంతాలకు తరలించాల్సి వస్తోందని, రవాణా ఖర్చులు భారంగా మారుతున్నాయన్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి గ్రామంలోనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు ఏర్పాటు చేస్తామన్నారు.
MDK: రామాయంపేట మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో బుధవారం అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా మోడల్ స్కూల్ విద్యార్థులకు అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదంలో చిక్కుకున్న బాధితులను రక్షించే విధానంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు.
MHBD: పెద్ద వంగర మండలంలోని పోచంపల్లి గ్రామానికి చెందిన పలు పార్టీల నేతలు TPCC వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని, ప్రతి కార్యకర్త సమన్వయంతో కష్టపడి పనిచేస్తూ రాబోయే అన్ని ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ఝాన్సీరెడ్డి పిలుపునిచ్చారు.
RR: చేవెళ్ల నియోజకవర్గం శంకర్‌పల్లి సీఐగా బాధ్యతలు చేపట్టిన ముదసర్ ఆలిని శంకర్‌పల్లి మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ రెడ్డి ఇవాళ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని అందరూ సహకరించాలని సీఐ తెలిపారు. నాయకులు రఘునందన్ రెడ్డి, శ్రీకాంత్, మల్లికార్జున్ మార్కెట్ డైరెక్టర్ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.
హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రఘు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. వేసవిలో విద్యార్థులకు త్రాగునీటి ఇబ్బందులు తొలగించేందుకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ప్లాంట్ జీవితకాల నిర్వహణ ఖర్చులను ఫౌండేషన్ భరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వినెట్ ఫౌండర్ ఎర్రం రఘునందన్ రెడ్డి, కళాశాల బృందం, తదితరులు పాల్గొన్నారు.
ADB: ఇందిరమ్మ ఇళ్ల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని తాంసి ఎంపీడీవో మోహన్ రెడ్డి అన్నారు. మండలంలోని పొన్నారి గ్రామంలో బుధవారం ఆయన పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సర్పంచ్ తలారి భూమన్న, సెక్రటరీ గంగన్న, మాజీ ఎంపీటీసీ రఘు, విలాస్, రామన్న, తదితరులున్నారు.
MBNR: దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు మూసాపేట మండల కేంద్రంలో బుధవారం ముస్లిం మహిళలకు ‘రంజాన్ తోఫా’ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళలకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శెట్టి చంద్రశేఖర్ సర్పంచ్ గడ్డం మహేందర్, ఉపసర్పంచ్ కలీం మాజీ కో-ఆప్షన్ జమీర్ తదితరులు పాల్గొన్నారు.
NRPT: మరికల్ మండలంలోని అభయాంజనేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణానికి బుధవారం స్థాపకులు శ్రావణ్ కుమార్ శర్మ, బాలమురళీకృష్ణలు స్థలాన్ని పరిశీలించారు. వారికి ఆలయ నిర్మాణ కమిటీ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. హైందవ సాంప్రదాయ ప్రకారం, ఇతిహాసాలతో నూతన ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.