• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత

MHBD: ఉపాధి హామీ పనులను వ్యవసాయానికి అనుసంధానం చేసి రైతాంగానికి మేలు చేయాలని, మక్కలను మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కోరుతూ అదనపు కలెక్టర్‌కు రైతు సంఘం నేతలు వినతి పత్రం అందజేశారు. రైతు సంఘం నాయకులు సుధాకర్ రెడ్డి, నాగేశ్వరరావు మాట్లాడుతూ… రైతు సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, రైతులు పండించిన పంటకు మద్దతు ధర చెల్లించాలన్నారు.

March 18, 2026 / 02:07 PM IST

పదవ తరగతి పరీక్షల్లో 100% హాజరు: MEO

MDK: రామాయంపేట మండల వ్యాప్తంగా బుధవారం నిర్వహించిన పదవ తరగతి పరీక్షల్లో 100% మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు ఎంఈవో శ్రీనివాస్ తెలిపారు. బుధవారం హిందీ పరీక్ష నేపథ్యంలో ఐదు పరీక్ష కేంద్రాల్లో మొత్తం 816 మంది విద్యార్థులకు గాను 100% మంది పరీక్షకు హాజరయ్యారని ఆయన ప్రకటించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

March 18, 2026 / 02:06 PM IST

త్వరలో కొత్త డిజిటల్ మీడియా పాలసీ: మంత్రి పొంగులేటి

KMM: రాబోయే రెండు, మూడు నెలల్లో రాష్ట్రంలో డిజిటల్ మీడియా పాలసీని తీసుకురానున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. శాసన మండలిలో జర్నలిస్టుల సమస్యలపై స్పందించిన ఆయన, అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాల కేటాయింపు, అక్రిడేషన్ కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని మంత్రి స్పష్టం చేశారు.

March 18, 2026 / 02:05 PM IST

పిచ్చికుక్కల దాడి.. 4 గొర్రెలు మృతి

JN: దేవరుప్పుల మండల కేంద్రంలో పిచ్చికుక్కల దాడిలో 4 గొర్రెలు మృతి చెందగా, సుమారు 25 గొర్రెలు గాయపడ్డాయి. బుధవారం గొర్రెల షెడ్డులో ఉన్న గొర్రెల మందపై కుక్కలు దాడి చేయడంతో ఈ ఘటన జరిగింది. సుమారు రూ.4 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. కుక్కల బెడద నుంచి రక్షణ కల్పించాలని వారు అధికారులను కోరుతున్నారు.

March 18, 2026 / 02:05 PM IST

సీఎం పర్యటనను అడ్డుకుంటాం: MRPS

SDPT: సీఎం రేవంత్ రెడ్డి నర్మెట పర్యటనను అడ్డుకుంటామని MRPS నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ దేవులపల్లి రాజేందర్ హెచ్చరించారు. నంగునూరులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దళిత కుటుంబాలకు రూ.12 లక్షలు ఇస్తామన్న హామీని ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు,రాజీవ్ యువ వికాసం అమలు చేయని సీఎం తీరుకు నిరసనగా దళిత సామాజిక వర్గాలను ఏకం చేస్తామని ప్రకటించారు.

March 18, 2026 / 02:03 PM IST

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం

SDPT: జగదేవ్‌పూర్ మండల వ్యాప్తంగా ఇవాళ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మండలంలోని పలు గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది .ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు ఈదురుగాలులు వీస్తున్నాయి. అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షం వల్ల ఎండ వేడి నుంచి ప్రజలకు ఉపశమనం లభించినప్పటికీ, కోతకు సిద్ధంగా ఉన్న పంటలు దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

March 18, 2026 / 02:02 PM IST

పారుపల్లిలో తోఫా పంపిణీ

BHNG: ఆత్మకూరు ఎం మండలంలోని పారుపల్లి గ్రామ ముస్లిం సోదరి, సోదరులకు రంజాన్ తోఫాను సర్పంచ్ దయల మాధవి -శ్రీనివాస్ అధ్వర్యంలో పంపిణి చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి పృథ్వి, ఉప సర్పంచ్ తవిటి మల్లారెడ్డి, వార్డ్ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు నర్సిరెడ్డి, మాజీ ఎంపీటీసీ పాల్గొన్నారు.

March 18, 2026 / 01:50 PM IST

ఉమ్మడి జిల్లాలో చల్లబడిన వాతావరణం

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇవాళ ఉదయం నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గత కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండ వేడికి సతమతమవుతున్న ప్రజలు ఈ చల్లదనంతో ఊపిరి పీల్చుకున్నారు. వాతావరణ శాఖ గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన విషయం తెలిసిందే. దీంతో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

March 18, 2026 / 01:46 PM IST

ఏఐసీసీ పరిశీలకుడిగా జుక్కల్ ఎమ్మెల్యే

KMR: జుక్కల్ MLA లక్ష్మీకాంతారావుకు AICC కీలక బాధ్యతలు అప్పగించింది. మహారాష్ట్రలో DCC అధ్యక్షుల ఎంపిక కోసం ఆయనను పరిశీలకుడిగా నియమించింది. ‘సంఘటన్ సృజన్ అభియాన్’లో భాగంగా ఈ నియామకం జరిగింది. MLA మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, AICC అధ్యక్షుడు ఖర్గే, PCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌లకు ధన్యవాదాలు తెలిపారు.

March 18, 2026 / 01:44 PM IST

మంత్రికి వినతి పత్రం అందజేసిన పాలకుర్తి ఎమ్మెల్యే

JN: రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. కొడకండ్ల ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని, పాలకుర్తి నియోజకవర్గంలో వైద్యరంగ బలోపేతానికి సహకరించాలని మంత్రిని ఎమ్మెల్యే కోరారు. వైద్యరంగ బలోపేతానికి ప్రజాప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే చెప్పారు.

March 18, 2026 / 01:42 PM IST

‘ల్యాబ్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలి’

WGL: నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ సేవలు సరిగా అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. రక్తం, మూత్ర పరీక్షలు తదితర సేవలు అందుబాటులో లేకపోవడంతో రోగులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని బంధువులు తెలిపారు. దీంతో వైద్య అధికారులు స్పందించి ల్యాబ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చి రోగులకు న్యాయం చేయాలని కోరారు.

March 18, 2026 / 01:42 PM IST

రానున్న భారీ వర్షం.. వాహనాదారులకు CP హెచ్చరిక..!

WGL: రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో వాహనాదారులు అప్రమత్తంగా ఉండాలని WGL CP సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఇవాళ WGL కమిషనర్ కార్యాలయంలో CP మాట్లాడుతూ.. వర్షాల సమయంలో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, వాహనదారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన సూచించారు.

March 18, 2026 / 01:37 PM IST

గ్రామపంచాయతీ పనులపై ఎంపీఓ తనిఖీ

NRML: దిలావర్‌పూర్ మండలంలోని సిర్గాపూర్ గ్రామంలో ఎంపీఓ గోవర్ధన్ గ్రామపంచాయతీ పనులను తనిఖీ చేశారు. పారిశుధ్యం, తాగునీరు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు. సిబ్బంది పనితీరుపై సూచనలు చేస్తూ, సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామంలో ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు.

March 18, 2026 / 01:36 PM IST

కోమటిరెడ్డిని మంత్రివర్గం నుంచి తొలగించాలి: మహేందర్

BHPL: BCలను అవమానిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మంత్రి పదవి నుంచి తక్షణమే తొలగించాలని BHPL BC సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మహేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఇవాళ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను తొలగించి జగ్గారెడ్డికి పదవి ఇవ్వాలని కోమటిరెడ్డి మాట్లాడటం బీసీల పట్ల వ్యతిరేకతను చూపుతుందన్నారు.

March 18, 2026 / 01:36 PM IST

‘ఖమ్మం ప్రెస్ క్లబ్‌ను రాష్ట్రంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతా’

KMM: భారతదేశపు తొలి సంపాదకులు, విలేకరుల చిత్రపటాల ఆవిష్కరణ కార్యక్రమం ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో ఘనంగా బుధవారం నిర్వహించారు. టిడబ్ల్యూజెఎఫ్ (హెచ్ 2843) ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంతోటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి ముఖ్య అతిథిగా హాజరై చిత్రపటాలను ఆవిష్కరించారు.

March 18, 2026 / 01:33 PM IST