• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి

JGL: జగిత్యాల రూరల్ మండలం వంజరుపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామ రైతులు కలిసి ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం రైతులు తమ పంటను దూర ప్రాంతాలకు తరలించాల్సి వస్తోందని, రవాణా ఖర్చులు భారంగా మారుతున్నాయన్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి గ్రామంలోనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు ఏర్పాటు చేస్తామన్నారు.

March 18, 2026 / 12:45 PM IST

‘అగ్ని ప్రమాదాల నివారణ అందరి బాధ్యత’

MDK: రామాయంపేట మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో బుధవారం అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా మోడల్ స్కూల్ విద్యార్థులకు అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదంలో చిక్కుకున్న బాధితులను రక్షించే విధానంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు.

March 18, 2026 / 12:45 PM IST

ఝాన్సీరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

MHBD: పెద్ద వంగర మండలంలోని పోచంపల్లి గ్రామానికి చెందిన పలు పార్టీల నేతలు TPCC వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని, ప్రతి కార్యకర్త సమన్వయంతో కష్టపడి పనిచేస్తూ రాబోయే అన్ని ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ఝాన్సీరెడ్డి పిలుపునిచ్చారు.

March 18, 2026 / 12:44 PM IST

నూతన సీఐని కలిసిన యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్

RR: చేవెళ్ల నియోజకవర్గం శంకర్‌పల్లి సీఐగా బాధ్యతలు చేపట్టిన ముదసర్ ఆలిని శంకర్‌పల్లి మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ రెడ్డి ఇవాళ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని అందరూ సహకరించాలని సీఐ తెలిపారు. నాయకులు రఘునందన్ రెడ్డి, శ్రీకాంత్, మల్లికార్జున్ మార్కెట్ డైరెక్టర్ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.

March 18, 2026 / 12:44 PM IST

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం

హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రఘు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. వేసవిలో విద్యార్థులకు త్రాగునీటి ఇబ్బందులు తొలగించేందుకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ప్లాంట్ జీవితకాల నిర్వహణ ఖర్చులను ఫౌండేషన్ భరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వినెట్ ఫౌండర్ ఎర్రం రఘునందన్ రెడ్డి, కళాశాల బృందం, తదితరులు పాల్గొన్నారు.

March 18, 2026 / 12:43 PM IST

‘ఇందిరమ్మ ఇళ్ల పనులను వేగవంతం చేయాలి’

ADB: ఇందిరమ్మ ఇళ్ల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని తాంసి ఎంపీడీవో మోహన్ రెడ్డి అన్నారు. మండలంలోని పొన్నారి గ్రామంలో బుధవారం ఆయన పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సర్పంచ్ తలారి భూమన్న, సెక్రటరీ గంగన్న, మాజీ ఎంపీటీసీ రఘు, విలాస్, రామన్న, తదితరులున్నారు.

March 18, 2026 / 12:42 PM IST

మూసాపేటలో ముస్లింలకు ‘రంజాన్ తోఫా’ పంపిణీ

MBNR: దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు మూసాపేట మండల కేంద్రంలో బుధవారం ముస్లిం మహిళలకు ‘రంజాన్ తోఫా’ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళలకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శెట్టి చంద్రశేఖర్ సర్పంచ్ గడ్డం మహేందర్, ఉపసర్పంచ్ కలీం మాజీ కో-ఆప్షన్ జమీర్ తదితరులు పాల్గొన్నారు.

March 18, 2026 / 12:42 PM IST

ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన

NRPT: మరికల్ మండలంలోని అభయాంజనేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణానికి బుధవారం స్థాపకులు శ్రావణ్ కుమార్ శర్మ, బాలమురళీకృష్ణలు స్థలాన్ని పరిశీలించారు. వారికి ఆలయ నిర్మాణ కమిటీ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. హైందవ సాంప్రదాయ ప్రకారం, ఇతిహాసాలతో నూతన ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

March 18, 2026 / 12:41 PM IST

పది పరీక్ష కేంద్రంలో అధికారుల తనిఖీ

SRD:సిర్గాపూర్ హైస్కూల్లో జరుగుతున్న టెన్త్ పరీక్ష కేంద్రాన్ని నేడు తహసిల్దార్ హేమంత్ కుమార్ ఎంఈఓ నాగారం శ్రీనివాస్ సందర్శించి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరీక్షలు ప్రశాంతంగా, పకడ్బందీగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మదన్, CS లక్ష్మణ్, DO మహేశ్వరరావు పాల్గొన్నారు.

March 18, 2026 / 12:41 PM IST

చిట్యాలలో వృద్ధురాలు అదృశ్యం

BHPL: చిట్యాలకు చెందిన రాజీరమ్మ ఈ నెల 15న ఇంటి నుంచి బయటికి వెళ్లి అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తృతంగా వెతికినా ఆమె ఆచూకీ దొరకలేదు. అనంతరం వెంటనే కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. రాజీరమ్మ ఆచూకీ తెలిసిన వ్యక్తులు సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలన్నారు.

March 18, 2026 / 12:37 PM IST

కన్నుల పండగ రామయ్య నిత్య కళ్యాణం

BDK: భద్రాద్రి సీతారామచంద్రస్వామి వారి నిత్య కళ్యాణ వేడుక కనులపండువగా ఇవాళ నిర్వహించారు. ముందుగా తెల్లవారుజామున గర్భాలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధనలు నిర్వహించిన ఉత్సవ మూర్తులను బేడా మండపానికి తీసుకొచ్చారు. అనంతరం అర్చకులు శాస్త్రోక్తంగా విశ్వక్సేన పూజ, కంకణధారణ గావించి సీతారాముల కళ్యాణాన్ని జరిపించారు.

March 18, 2026 / 12:37 PM IST

‘అర్హులైన పేదలకు ఇళ్లను మంజూరు చేయాలి’

BHPL: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ లబ్ధిదారుల విషయంలో ఎలాంటి అవకతవకలు లేకుండా అర్హులైన పేదలకు ఇళ్లను మంజూరు చేయాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. కౌన్సిల్లో నేడు ఆయన మాట్లాడుతూ… తాము పేదలమని, తమకు ఇండ్లు కేటాయించడం లేదని పలుచోట్ల నిరసనలు చేపట్టారని, పారదర్శకంగా ఇళ్ల నిర్మాణ లబ్ధిదారుల ఎంపిక ఉండాలన్నారు.

March 18, 2026 / 12:32 PM IST

తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు పట్టివేత

HNK: పరకాల పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తూ పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు వెంకటేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా CI క్రాంతి మాట్లాడుతూ.. భద్రాద్రి జిల్లా పాల్వంచకు చెందిన వెంకటేష్ గతంలో కూడా ముగ్గురు సభ్యులతో కలిసి అక్రమంగా గంజాయి వ్యాపారం చేసినట్లు తెలిపారు. అతని పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

March 18, 2026 / 12:32 PM IST

రాత్రికి రాత్రే నేలకొరిగిన మొక్కజొన్న పంట

VKB: దామస్తాపూర్ గ్రామానికి చెందిన రైతు పడమటి మల్లేశ్ సాగుచేసిన పంట అకాల వర్షాల కారణంగా పూర్తిగా నష్టపోయింది. సుమారు 2 ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేయగా, మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురు గాలులకు పంట మొత్తం నేలమట్టమైంది. మంచి దిగుబడి ఆశతో సాగు చేసిన పంట ఒక్కరాత్రిలోనే నాశనం కావడంతో రైతు మల్లేశ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

March 18, 2026 / 12:32 PM IST

పిల్లల భద్రతపై ప్రత్యేక నిఘా పెట్టాలి: SI

MHBD: ఒంటి పూట బడులు ప్రారంభమైన నేపథ్యంలో పిల్లల జాగ్రత్తలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఇనుగుర్తి SI కరుణాకర్ సూచించారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాల ముగిసిన తర్వాత చిన్నారులు చెరువులు, కుంటల వద్దకు ఈతకు వెళ్లే ప్రమాదం ఎక్కువగా ఉందని హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆయన సూచించారు.

March 18, 2026 / 12:31 PM IST