• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పది పరీక్ష కేంద్రంలో అధికారుల తనిఖీ

SRD:సిర్గాపూర్ హైస్కూల్లో జరుగుతున్న టెన్త్ పరీక్ష కేంద్రాన్ని నేడు తహసిల్దార్ హేమంత్ కుమార్ ఎంఈఓ నాగారం శ్రీనివాస్ సందర్శించి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరీక్షలు ప్రశాంతంగా, పకడ్బందీగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మదన్, CS లక్ష్మణ్, DO మహేశ్వరరావు పాల్గొన్నారు.

March 18, 2026 / 12:41 PM IST

చిట్యాలలో వృద్ధురాలు అదృశ్యం

BHPL: చిట్యాలకు చెందిన రాజీరమ్మ ఈ నెల 15న ఇంటి నుంచి బయటికి వెళ్లి అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తృతంగా వెతికినా ఆమె ఆచూకీ దొరకలేదు. అనంతరం వెంటనే కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. రాజీరమ్మ ఆచూకీ తెలిసిన వ్యక్తులు సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలన్నారు.

March 18, 2026 / 12:37 PM IST

కన్నుల పండగ రామయ్య నిత్య కళ్యాణం

BDK: భద్రాద్రి సీతారామచంద్రస్వామి వారి నిత్య కళ్యాణ వేడుక కనులపండువగా ఇవాళ నిర్వహించారు. ముందుగా తెల్లవారుజామున గర్భాలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధనలు నిర్వహించిన ఉత్సవ మూర్తులను బేడా మండపానికి తీసుకొచ్చారు. అనంతరం అర్చకులు శాస్త్రోక్తంగా విశ్వక్సేన పూజ, కంకణధారణ గావించి సీతారాముల కళ్యాణాన్ని జరిపించారు.

March 18, 2026 / 12:37 PM IST

‘అర్హులైన పేదలకు ఇళ్లను మంజూరు చేయాలి’

BHPL: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ లబ్ధిదారుల విషయంలో ఎలాంటి అవకతవకలు లేకుండా అర్హులైన పేదలకు ఇళ్లను మంజూరు చేయాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. కౌన్సిల్లో నేడు ఆయన మాట్లాడుతూ… తాము పేదలమని, తమకు ఇండ్లు కేటాయించడం లేదని పలుచోట్ల నిరసనలు చేపట్టారని, పారదర్శకంగా ఇళ్ల నిర్మాణ లబ్ధిదారుల ఎంపిక ఉండాలన్నారు.

March 18, 2026 / 12:32 PM IST

తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు పట్టివేత

HNK: పరకాల పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తూ పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు వెంకటేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా CI క్రాంతి మాట్లాడుతూ.. భద్రాద్రి జిల్లా పాల్వంచకు చెందిన వెంకటేష్ గతంలో కూడా ముగ్గురు సభ్యులతో కలిసి అక్రమంగా గంజాయి వ్యాపారం చేసినట్లు తెలిపారు. అతని పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

March 18, 2026 / 12:32 PM IST

రాత్రికి రాత్రే నేలకొరిగిన మొక్కజొన్న పంట

VKB: దామస్తాపూర్ గ్రామానికి చెందిన రైతు పడమటి మల్లేశ్ సాగుచేసిన పంట అకాల వర్షాల కారణంగా పూర్తిగా నష్టపోయింది. సుమారు 2 ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేయగా, మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురు గాలులకు పంట మొత్తం నేలమట్టమైంది. మంచి దిగుబడి ఆశతో సాగు చేసిన పంట ఒక్కరాత్రిలోనే నాశనం కావడంతో రైతు మల్లేశ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

March 18, 2026 / 12:32 PM IST

పిల్లల భద్రతపై ప్రత్యేక నిఘా పెట్టాలి: SI

MHBD: ఒంటి పూట బడులు ప్రారంభమైన నేపథ్యంలో పిల్లల జాగ్రత్తలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఇనుగుర్తి SI కరుణాకర్ సూచించారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాల ముగిసిన తర్వాత చిన్నారులు చెరువులు, కుంటల వద్దకు ఈతకు వెళ్లే ప్రమాదం ఎక్కువగా ఉందని హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆయన సూచించారు.

March 18, 2026 / 12:31 PM IST

ఇసుక డి-సెల్టింగ్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి: ప్రతాప్

MLG: జిల్లా కేంద్రంలో ఇవాళ గోండ్వానా సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ మీడియాతో మాట్లాడారు. జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఇసుక డి-సెల్టింగ్ విధానాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఈ విధానం వల్ల వెంకటాపురం మండలంలోని ఆదివాసి గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.

March 18, 2026 / 12:30 PM IST

హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలం

MDK: మనోహరాబాద్ మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బీజేపీ రాష్ట్ర నాయకులు నత్తి మల్లేష్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. బుధవారం కాంగ్రెస్ హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ ఆంజనేయులుకు మండల శాఖ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు.

March 18, 2026 / 12:29 PM IST

ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మంత్రి జూపల్లి

NRML: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ‘శ్రీ పరాభవ’ నామ ఉగాది సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగాది మన సంస్కృతి, సంప్రదాయాలను నిలబెట్టే ముఖ్యమైన పండుగ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  వ్యవసాయ సంవత్సరారంభమైన ఈ ఉగాది రైతులకు మంచి పంటలు, ప్రజలకు సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.

March 18, 2026 / 12:26 PM IST

అభివృద్ధి పనులు వేగంగా ప్రారంభించాలి: ఎమ్మెల్యే

SRD: అమీన్‌పూర్ సర్కిల్‌లో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి కాలనీలో సిబ్బంది కేటాయించి రోజూ పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఐదు మున్సిపాలిటీలకు కేటాయించిన రూ.75 కోట్ల అభివృద్ధి పనులు వేగంగా ప్రారంభించాలని చెప్పారు. వేసవిలో నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

March 18, 2026 / 12:18 PM IST

ప్రభుత్వ సొత్తు రికవరీ చేయాలని ఫిర్యాదు

MNCL: కోటపల్లి మండలంలోని ఆలుగామ గ్రామంలో ప్రభుత్వ సొత్తు చోరీ కావడంపై చర్యలు తీసుకోవాలని పంచాయితీ కార్యదర్శికి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. నర్సరీ కోసం ప్రభుత్వం మంజూరు చేసిన సింటెక్స్ వాటర్ ట్యాంక్, శ్మశాన వాటిక దగ్గర సోలార్ లైట్ కనిపించడం లేదని తెలిపారు. ఈ మేరకు వెంటనే వీటిని రికవరీ చేయాలని అధికారులను కోరారు.

March 18, 2026 / 12:14 PM IST

ఈ నెల 20న ఉస్మానియాలో జాబ్ మేళా!

HYD: ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయిమెంట్ బ్యూరో ఆధ్వర్యంలో అపోలో పార్మసీ ఈ నెల 20న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నది. అపోలో ఫార్మసీలోని ఫార్మసిస్టు, అసిస్టెంట్ ఫార్మసిస్టులకు చెందిన 100 పోస్టులను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. డి.ఫార్మసీ, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ లేదా ఏదైనా డిగ్రీ ఉన్న18-35 ఏళ్ల వారు అర్హులు. రూ.16,383 నుంచి రూ.19,769 వరకు వేతనం ఉంటుంది.

March 18, 2026 / 12:04 PM IST

తాడువాయిలో పశువులకు ఉచిత టీకాలు..

SRPT: పశువులకు వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలని గ్రామ సర్పంచ్ కొలిశెట్టి రాంబాయమ్మ అన్నారు. బుధవారం మునగాల మండలం తాడువాయి గ్రామంలో నిర్వహించిన ఉచిత టీకా కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ముందస్తు టీకాలతో పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 18, 2026 / 12:02 PM IST

మెగా వైద్య శిబిరాన్ని సందర్శించిన డీఎంహెచ్‌వో

KMR: రాజంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని డీఎంహెచ్‌వో డాక్టర రవీందర్ గౌడ్ సందర్శించి వైద్య సేవలపై ఆరా తీశారు. జనరల్ ఆసుపత్రి నుంచి వచ్చిన నిపుణులైన వైద్యులు రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

March 18, 2026 / 12:01 PM IST