NRML: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ‘శ్రీ పరాభవ’ నామ ఉగాది సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగాది మన సంస్కృతి, సంప్రదాయాలను నిలబెట్టే ముఖ్యమైన పండుగ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవసాయ సంవత్సరారంభమైన ఈ ఉగాది రైతులకు మంచి పంటలు, ప్రజలకు సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.