MBNR: పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ఎస్పీ జానకి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆశలు, కొత్త ఆకాంక్షలతో మొదలయ్యే ఈ తెలుగు నూతన సంవత్సరం, ప్రజలందరి జీవితాలలో శాంతి, సుఖ సంతోషాలను నింపాలని ఆమె ఆకాంక్షించారు. ఉగాది తెలుగు ప్రజలకు నూతన సంవత్సర ఆరంభమని, పోలీస్ సిబ్బంది, మీడియా, జిల్లా ప్రజలకు మంచి జరగాలని ఆమె పేర్కొన్నారు.
ASF: గర్భిణీ, బాలింతలు, కిశోర బాలికలు, చిన్నపిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలని పెంచికల్పేట్ మండలం దర్గపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ బొట్టుపల్లి కృష్ణవేణి అన్నారు. మంగళవారం వార్డు సభ్యులు అధికారులతో కలిసి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడీలో ఏఎల్ఎంఎస్సీ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
MNCL: జన్నారం మండలంలోని అభయారణ్యంలో పర్యాటక రంగ అభివృద్ధి నామమాత్రంగా జరుగుతోంది. జన్నారం అభయారణ్యానికి ప్రధాన కేంద్రంగా ఉంది. అభయారణ్యంలో అనేక ప్రకృతి రమణీయ ప్రాంతాలు ఉన్నాయి. పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు ప్రభుత్వం, అటవీ శాఖ పరంగా చర్యలు తీసుకుంటున్న పూర్తి ఫలితాలను ఇవ్వడం లేదు. మండలంలో అటవీ ఆంక్షలు ఉండడంతో పరిశ్రమల స్థాపన ప్రశ్నార్ధకంగా మారింది.
KNR: జిల్లా విద్యాశాఖ నిర్వహించిన పీఎం మోడల్ యునైటెడ్ నేషన్స్, స్పెల్ బీ పోటీల్లో శంకరపట్నం మోడల్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. 9వ తరగతి విద్యార్థిని చైత్రిక మోడల్ యునైటెడ్ నేషన్స్ ప్రథమ స్థానం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికవ్వగా, సహస్ర స్పెల్ బీలో విజేతగా నిలిచింది. 16 పాఠశాలలు పాల్గొన్న ఈ పోటీల్లో ప్రతిభచూపిన విద్యార్థులను ప్రిన్సిపల్ అభినందించారు.
జగిత్యాల జిల్లాలోని పలు స్కానింగ్ సెంటర్లపై జిల్లా ఉప వైద్యాధికారి డా. జైపాల్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిషేధమన్నారు. ఫారం-ఎఫ్ వివరాలను ప్రతినెల సమయానికి సమర్పించాలని, ఆన్‌లైన్-ఆఫ్‌లైన్ రికార్డులు ఒకేలా ఉండాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్షతో పాటు వైద్యుల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామన్నారు.
SRCL: జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు పౌరసరఫరాల అధికారి బుచ్చిబాబు బుధవారం తెలిపారు. గ్యాస్ బుకింగ్‌లో సమస్యలుంటే 8008429738 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిబ్బంది టీ. సృజన, వీ. వినాయక్ అందుబాటులో ఉంటారు. వినియోగదారులు ఏవైనా ఫిర్యాదులుంటే ఈ కంట్రోల్ రూమ్ ద్వారా పరిష్కరించుకోవచ్చని అన్నారు.
KNR: రామడుగు మండలం తిరుమలాపూర్లోని దళిత కాలనీలోని గృహాల మీదుగా వెళ్తున్న 33 కేవీ హైటెన్షన్ విద్యుత్ తీగలను వెంటనే తొలగించాలని మాజీ సర్పంచ్ తడగొండ సత్యరాజ్ వర్మ డిమాండ్ చేశారు. గ్రామస్థులతో కలిసి ఆకాశానికి చేతులెత్తి ఆయన నిరసన తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న ఈ వైర్ల వల్ల ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నడిపెల్లి రాజేశ్వరరావు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లాలో ఎల్పీజీ సిలిండర్లు సమృద్ధిగా ఉన్నాయని, వినియోగదారులు ఆందోళనతో ముందస్తు బుకింగ్లు చేయవద్దని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. 15 పంపిణీ కేంద్రాల ద్వారా 3-4 రోజుల్లోనే డెలివరీ జరుగుతుందన్నారు. కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. గ్యాస్ సరఫరాలో ఏవైనా సమస్యలుంటే 08728 224045 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.
JGL: రాయికల్ పట్టణానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. పడాలతిరుపతికి “బెస్ట్ ఇండియన్ గోల్డెన్ పర్సనాలిటీ అవార్డు” లభించింది. కరీంనగర్ ఆర్ట్స్ కళాశాలలో బోటనీ విభాగంలో పనిచేస్తున్న ఆయన, NSS ప్రోగ్రామ్ ఆఫీసర్గా అందించిన సేవలకు గానూ ఈ గుర్తింపు దక్కింది. జాతీయ ఐక్యత, గ్రామీణాభివృద్ధిపై ఆయన చేసిన అవగాహన కార్యక్రమాలను పలువురు అభినందించారు.
JGL: కోరుట్లకు చెందిన అంగన్వాడీ టీచర్ మేకల సాయీశ్వరికు తిరుపతిలో జరిగిన బహుజన సాహిత్య అకాడమీ 18వ జాతీయ సదస్సులో 2026 ఉమెన్ లీడర్‌షిప్ నేషనల్ అవార్డు ప్రదానం చేశారు. నల్లా రాధాకృష్ణ, యూ. సుబ్రమనియన్ చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారం అందుకున్నారు. మహిళా సాధికారత, సామాజిక సేవలో చేసిన కృషికి ఈ గౌరవం లభించింది.
SRCL: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి, ఫోర్ క్లాస్ ఉద్యోగులకు ఆలయ ఈవో ఎల్ రమాదేవి ఆలయం తరఫున రెండు చీరలను పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం ఒకసారి నిర్వహించే ఈ కార్యక్రమం ఆలయంలో కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆలయ ఉద్యోగులు కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
KNR: అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కరీంనగర్ రూరల్ ఎక్సైజ్ సీఐ గుండేటి రామును అరెస్ట్ చేసినట్లు ఏసీబీ ఇన్స్‌పెక్టర్ పున్నం చందర్ తెలిపారు. వేములవాడలో పని చేసిన కాలంలో స్నేహితుడు వేణు యూపీఐ ఖాతా ద్వారా రాము మామూళ్లు వసూలు చేసినట్లు గుర్తించారు. సోదాల్లో రూ. 20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని, నిందితులిద్దరినీ రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
KMM: ఏన్కూరు మండలం ఆరికాయలపాడు గ్రామానికి చెందిన ఏలుగోటి నరేందర్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిన వెంటనే వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు వాసిరెడ్డి నాగేశ్వరరావు అందించిన సమాచారంతో, హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి వైద్యులకు ఎమ్మెల్యే ఇవాళ చరవాణి ద్వారా మాట్లాడి నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు.
SRPT: మునగాల మండలంలో ఈనెల 20న మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు మునగాల మండల వైద్యాధికారి రవీందర్ ఈరోజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అన్ని విభాగాల వైద్య సిబ్బంది పాల్గొన్న ఉన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఉచితంగా వైద్య సేవలు పొందాలని సూచించారు.