WNP: చిన్నంబావి మండల కేంద్రంలో ఉగాది పండగను పురస్కరించుకుని కొల్లాపూర్ నియోజకవర్గ స్థాయి కబడ్డీ పోటీలను కొల్లాపూర్ మాజీ MLA బీరం హర్షవర్ధన్ రెడ్డి క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి క్రీడలను ప్రోత్సహించడం సంతోషంగా ఉందన్నారు.
KMM: అటవీ, రెవెన్యూ సరిహద్దు భూ వివాదాలు పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్‌లో అటవీ, రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. రెవెన్యూ, అటవీ భూమి సరిహద్దులలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కనకగిరి ఘాట్ అటవీ ప్రాంతం సంబంధించి కొంత భాగం భూమి రికార్డ్, సరిహద్దులు సరిగ్గా నమోదు కాలేదన్నారు.
MNCL: బెల్లంపల్లి పట్టణం KGBV విద్యాలయాన్ని మున్సిపల్ కమిషనర్‌తో కలిసి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం సందర్శించారు. అదనపు తరగతి గదులు-భోజనశాల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం రామ్ నగర్ ప్రాంతంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నిర్మాణ పనులను సందర్శించి పనులు వేగవంతం చేయాలన్నారు.
PDPL: 2025-26 యాసంగి ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. 334 కేంద్రాల ద్వారా సుమారు 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని, 12.59 లక్షల గన్నీ సంచులు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. డిఫాల్ట్ రైస్ మిల్లర్ల నుంచి గతంలో రూ. 2.18 కోట్లు వసూలు చేశామని పేర్కొన్నారు.
KNR: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా బుధవారం గంగాధర మండల పరిధిలోని వెంకటాయిపల్లి గ్రామ పంచాయతీ కార్మికులను సర్పంచ్ గంకిడి సంధ్యారాణి సత్కరించారు. గ్రామాన్ని సుందరంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో కార్మికుల సేవలు వెలకట్టలేనివని ఆమె కొనియాడారు. వారి కష్టానికి గుర్తింపుగా ఈ సత్కారం చేసినట్లు తెలిపారు.
JN: తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా స్టేషన్ ఘనపూర్ MLA కడియం శ్రీహరి రాష్ట్ర ప్రజలకు “శ్రీ పరభావ” నామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఉగాది పండుగకు సంప్రదాయబద్ధంగా ఆనందోత్సాహలతో స్వాగతం పలుకుదామని పేర్కొన్నారు. షడ్రుచుల ఉగాది పచ్చడిలోని తీపి, చేదు మాదిరిగానే కష్టసుఖకాలు జీవితంలో సహజమన్నారు.
BDK: ప్రజా ప్రభుత్వం పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా పండుగ కానుకగా ముస్లిం సోదరులకు ‘ఈద్ కా తోఫా’ లను అందజేస్తోంది. ఈ సందర్భంగా ఈరోజు కరకగూడెం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో 75 ఈద్ కా తోఫా కిట్లను ముస్లిం సోదరులకు, ముస్లిం పెద్దలకు MRO వట్టం కాంతయ్య అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ పాల్గొన్నారు.
NLG: శాలిగౌరారం మండలం అడ్లూరు శివారులో రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో తుర్కపల్లికి చెందిన తల్లికొడుకులు పార్వతమ్మ, నరసింహాకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఈఎంటి రమేశ్, పైలెట్ యాదగిరి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
GDWL: ఎస్సీ యాక్షన్ ప్లాన్ అమలులో బ్యాంకులు చిత్తశుద్ధితో సహకరించి అర్హులకు త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలి అని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా పేర్కొన్నారు. బుధవారం ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26పై నిర్వహించిన సమీక్షలో సమావేశం నిర్వహించారు. ఎంప్లాయ్‌మెంట్ సపోర్ట్ స్కీమ్ (ESS) కింద టూ వీలర్లు, త్రీ వీలర్లు, సోలార్ పంప్ సెట్లపై 90 శాతం వరకు సబ్సిడీ వస్తుందన్నారు.
GDWL: ప్రతి పదేళ్లకోసారి జరిగే జనగణన దేశాభివృద్ధికి దిక్సూచి వంటిది, ఈసారి పూర్తి డిజిటల్ పద్ధతిలో జరిగే ఖచ్చితమైన లెక్కలు తేలుతాయని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష అనారు. బుధవారం గద్వాల ఐడీఓసీలో జిల్లాస్థాయి చార్జ్ అధికారులకు మూడు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. 2026లో ఇళ్ల గణన, 27లో జనాభా గణన ప్రక్రియలు ఉంటాయన్నారు.
MBNR: విద్యా రంగం పట్ల కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని PDSU జిల్లా అధ్యక్షుడు మారుతి విమర్శించారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం నిరాశ మిగిల్చిందని మండిపడ్డారు. 1.39 లక్షల కోట్లు విడుదల చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
గద్వాల నల్లకుంట ఉర్దూ భవన్‌లో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో గద్వాల్ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అందరూ కలిసికట్టుగా ఉగాది రంజాన్ వేడుకలు జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా పేర్కొన్నారు. అనంతరం అందరూ కలిసి సహపంక్తి భోజనం చేసి మతసామరస్యాన్ని చాటారు.
WGL: నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా ఉగాది పండుగను పురస్కరించుకొని వైన్ షాపులు, బెల్ట్ షాపుల యాజమాన్యాలు సిండికేట్‌గా ఏర్పడి మద్యం అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు మద్యం ప్రియులు ఆరోపించారు. ఎమ్మార్పీ ధర కంటే ₹30 నుంచి ₹50 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ఎక్సైజ్ అధికారులు స్పందించి అధిక ధరకు అమ్ముతున్న షాపులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
KMM: మధిర రైతు వేదికలో బుధవారం వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రోటవేటర్లు, పవర్ స్ప్రేయర్లను పంపిణీ చేశారు. ఏడీఏ విజయచంద్ర మాట్లాడుతూ.. చిన్న రైతులకు 50 శాతం, పెద్ద రైతులకు 40 శాతం సబ్సిడీతో ఈ పరికరాలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం రైతుల ఆర్థికాభివృద్ధికి కట్టుబడి ఉందని మార్కెట్ కమిటీ ఛైర్మన్ బండారు నరసింహారావు పేర్కొన్నారు.
SDPT: బెజ్జంకిలో దావత్-ఏ-ఇఫ్తార్ కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌వో శ్రీకాంత్‌తో పాటు పలువురు సర్పంచులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో హాజరై ఇఫ్తార్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సామాజిక ఐక్యత, సోదరభావం ప్రతిఫలించాయి. శాంతి, అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అందరూ కలిసి ఇఫ్తార్ విందును పంచుకున్నారు.