• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘ప్రోటోకాల్ ఉల్లంఘించి అవమానించారు’

PDPL: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి తనను ఆహ్వానించకుండా ప్రోటోకాల్ ఉల్లంఘించి అవమానించారని మంథని మున్సిపల్ 6వ వార్డు కౌన్సిలర్ శ్రీలత ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆరో వార్డు పరిధిలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం నిర్వహించినా తనకు సమాచారం ఇవ్వలేదని అన్నారు.

March 19, 2026 / 07:50 AM IST

పండగ రోజు శుభవార్త చెప్పిన MP రఘునందన్ రావు

SRD: పటాన్ చెరువు పారిశ్రామిక ప్రాంతాల మేధావుల కోరిక మేరకు MMTS రైల్వే స్టేషన్ మార్పుకు అడుగులు పడుతున్నాయి. BHEL (LIG) నుంచి NH165 జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు ఇక్రిశాట్ ( ఫెన్సింగ్) ప్రాంతానికి మార్చేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు MP రఘునందన్ రావు పండగ రోజు తెలిపారు. గురువారం HITTV ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. MMTS రైలు స్టేషన్ మార్పు తథ్యం అని అన్నారు.

March 19, 2026 / 07:48 AM IST

పారిశుద్ధ్య పెనులు మెరుగుపరచాలని ఆదేశం

BDK: ప్రార్థనా స్థలాల వద్ద ప్రత్యేక విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు. ఉగాది, రంజాన్ పండుగల దృష్ట్యా నియోజకవర్గంలోని ఆలయాలు, మసీదుల వద్ద పారిశుద్ధ్య పనులను మెరుగుపర్చాలని అధికారులను ఆదేశించారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల నుంచి ఆయన ఫోన్ ద్వారా అధికారులతో సమీక్షించారు.

March 19, 2026 / 07:46 AM IST

ఎమ్మెల్యే ఇంటిపై దాడి.. ఖండించిన విద్యార్థి సంఘాలు

HYD: తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటిపైన బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేసిన దాడులను బహుజన విద్యార్థి సంఘాల నాయకులు ఖండించారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ వద్ద దళిత్ బహుజన స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. బహుజన విద్యార్థి సంఘాలు మందుల సామేలుకు అండగా ఉంటాయన్నారు. దాడికి దిగిన నేతలు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

March 19, 2026 / 07:45 AM IST

పరకాలలో ఘనంగా ఇఫ్తార్ విందు

HNK: పరకాల పట్టణంలోని ఈద్గా మసీదులో నిన్న సాయంత్రం పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని “మడికొండ బ్రదర్స్” ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా ఏర్పాటు చేశారు. TPCC SC సెల్ రాష్ట్ర కమిటీ వైస్ ఛైర్మన్ డా. శ్రీను మాట్లాడుతూ.. రంజాన్ ఉపవాస దీక్ష భక్తిశ్రద్ధలతో పాటించే ముస్లిం సోదరులకు ప్రతి ఏటా ఇఫ్తార్ విందు ఇవ్వడం అల్లా కల్పించిన అవకాశమని అన్నారు.

March 19, 2026 / 07:44 AM IST

నిబంధనల ప్రకారం గ్యాస్ బుక్ చేసుకోవాలి: కలెక్టర్

GDWL: గ్యాస్ వినియోగదారులు నిబంధన ప్రకారం సిలిండర్లు బుక్ చేసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పేర్కొన్నారు. బుధవారం జిల్లాలోని పలు గ్యాస్ ఏజెన్సీలు తనిఖీ చేశారు. జిల్లాలో 11 ఏజెన్సీల పరిధిలో గృహ అవసరాల కనెక్షన్లు 1,76,366, వాణిజ్య కనెక్షన్లు 907 ఉన్నాయన్నారు. జిల్లాలో ప్రతిరోజు 2,815 గృహా సిలిండర్లు బుకింగ్ అవుతున్నాయని తెలిపారు.

March 19, 2026 / 07:43 AM IST

హోటళ్లలో విస్తృత తనిఖీలు చేసిన అధికారులు

MHBD: తొర్రూరు డివిజన్ కేంద్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్‌లో నిన్నతహసీల్దార్ శ్రీనివాస్ అదనపు ఎస్సై అంజమ్మ, సివిల్ సప్లై అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రకాళి రెస్టారెంటులో రెండు గృహ అవసరాల సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్‌కు వాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

March 19, 2026 / 07:42 AM IST

రిజిస్టర్లను పక్కాగా నిర్వహించాలి: డీఎంహెచ్

BDK: స్కానింగ్ సెంటర్లలో ‘ఫారమ్-ఎఫ్’ను సక్రమంగా పూరించాలని, రిజిస్టర్లను పక్కాగా నిర్వహించాలని డీఎంహెచ్ డాక్టర్ తుకారాం రాథోడ్ సూచించారు. జిల్లాలోని స్కానింగ్ సెంటర్లను ప్రతి మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం డీఎంహెచ్ కార్యా లయంలో పీసీపీఎన్ స్టిటి జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు.

March 19, 2026 / 07:38 AM IST

ఉమ్మడి జిల్లా ప్రజలకు ఎమ్మెల్యే కడియం శుభాకాంక్షలు

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు మాజీ డిప్యూటీ సీఎం స్టేషన్ ఖానాపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పరాభావ నామ సంవత్సరంలో ప్రజలు పాడిపంటలు కలిగి చేసే పనిలో విజయవంతమై సుఖశాంతులతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యేలను కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు

March 19, 2026 / 07:37 AM IST

జిల్లాలో ఉద్యోగం లేని వారికి మంచి ఛాన్స్

Kmm: యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత స్వయం ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్లు DYSO సునీల్ రెడ్డి తెలిపారు. కంప్యూటర్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో 3 నెలల శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తి గలవారు ఆధార్, విద్యార్హత పత్రాలతో నేరుగా కార్యాలయంలో సంప్రదించాలని, వివరాలకు 99482 07271 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు.

March 19, 2026 / 07:36 AM IST

శ్రీరంగనాథ స్వామి ఆలయంలో నేడు పంచాంగ శ్రవణం

WNP: శ్రీరంగాపురం మండల కేంద్రంలోని శ్రీదేవి, భూదేవి సమేతంగా వెలిసిన శ్రీరంగనాథ స్వామి ఆలయంలో గురువారం పంచాంగ శ్రవణం కార్యక్రమం ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు. నేడు ఉగాది పండుగను పురస్కరించుకుని ఉదయం 8 గంటలకు ఆలయ సన్నిధిలో పంచాంగ శ్రవణం అనంతరం సాయంత్రం స్వామి అమ్మవార్లకు తిరువీధి సేవ కార్యక్రమాలు ఉంటాయని ఆలయ అర్చకులు చెప్పారు.

March 19, 2026 / 07:35 AM IST

విద్యుత్ సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

NGKL: జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను బుధవారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణంలో విద్యుత్ సరఫరా సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

March 19, 2026 / 07:34 AM IST

‘విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి’

MHBD: ఇనుగుర్తి మండలంలోని ఇనుగుర్తి, చిన్న ముప్పారం జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు గంజాయి, మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్సైరాజేశ్వరి మాట్లాడుతూ.. మత్తు పదార్థాలు వాడితే కలిగే నష్టాలపై వివరించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు.

March 19, 2026 / 07:31 AM IST

విద్యార్థి పట్ల అసభ్య ప్రవర్తన.. ఇరువురికి జైలు శిక్ష

MDK: తూప్రాన్ గురుకులంలో 11 ఏళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పిట్ల స్వామి (22), బేగరీ శ్రీకాంత్ (27) లకు మూడేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి లక్ష జరిమానా విధిస్తూ న్యాయమూర్తి శుభావల్లి తీర్పునిచ్చినట్లు ఎస్సై గంగరాజు తెలిపారు. 2018లో సంఘటన జరగా నేరం రుజువు కావడంతో శిక్షలు విధిస్తూ తీర్పునిచ్చినట్లు ఎస్సై పేర్కొన్నారు

March 19, 2026 / 07:31 AM IST

ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఆకతాయిల హంగామా

KNR: మానకొండూరు మండలం ఊటూర్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో రాత్రి వేళల్లో ఆకతాయిలు మద్యం, గంజాయి సేవిస్తూ హంగామా సృష్టిస్తున్నారు. పాఠశాల భవనాలకు నష్టం కలిగిస్తూ స్థానికులను భయాందోళనలకు గురిచేస్తున్నారు. చెట్లు దట్టంగా పెరగడం వల్ల ఈ ప్రాంతం వారికి అడ్డాగా మారింది. పోలీస్ గస్తీ పెంచి, అధికారులు పరిసరాలను శుభ్రపరిచి, ఖాళీ భవనాలను వినియోగంలోకి తేవాలన్నారు.

March 19, 2026 / 07:31 AM IST