వరంగల్ జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, శ్రేయోభిలాషులకు జిల్లా కలెక్టర్ డాక్టర్. సత్య శారద ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది నూతన ఆశలు, అభివృద్ధికి నాంది పలికే పర్వదినమని పేర్కొంటూ ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం నెలకొనాలని ఆకాంక్షించారు. ప్రజలు ఆనందోత్సాహాలతో పండుగ నిర్వహించుకోవాలని సూచించారు.
SRPT: సాగునీరు అందక చివరి భూముల్లో పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు, నల్లబండగూడెం, ద్వారకుంట, రెడ్లకుంట గ్రామాల రైతులు ఆర్కే మేజర్ కాలువల్లోకి దిగి నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 15 రోజులకు ఒకసారి వంతుల వారీగా నీరు విడుదల చేస్తున్నారని, అయితే ఆ నీరు చివరి ఆయకట్టు వరకు చేరడం లేదని వాపోయారు.
SRCL: వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవతో వేములవాడ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. బుధవారం, బ్రిడ్జి నుంచి ఆలయం వరకు సుమారు రూ. 46 లక్షల వ్యయంతో ఈ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా 11 మీటర్ల ఎత్తయిన విద్యుత్ పోల్స్‌ను ప్రారంభించారు. వేములవాడను మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దుతామని, భక్తులకు, స్థానికులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యమన్నారు.
GDWL: గాలికుంటు వ్యాధి నివారణ టీకాలతో పశుగ్రాసాన్ని, పాల దిగుబడిని కాపాడుకోవచ్చు అని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా అనారు. బుధవారం గద్వాల కలెక్టరేట్ ఆవరణలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచార వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 1.08 లక్షల ఆవులు, గేదెలు, ఎద్దులకు ఉచితంగా టీకాలు వేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
NLG: పంట మార్పిడిలో భాగంగా రైతులు పట్టు పురుగుల పెంపకంపై దృష్టి సారిస్తే అధిక లాభాలు పొందవచ్చని జిల్లా కలెక్టర్ బీ.చంద్రశేఖర్ అన్నారు. జిల్లా పట్టు పురుగుల పెంపకానికి అన్ని రకాల అనుకూలమని కలెక్టర్ అన్నారు. బుధవారం కనగల్ మండలం నరసింహపురంలో రైతు పుండరీకం సాగు చేస్తున్న పట్టు పురుగుల పెంపకం కేంద్రాన్ని అయన సందర్శించారు.
BDK: భద్రాద్రి పుణ్యక్షేత్రంలో నేటి నుంచి శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానీ ఉన్నాయని ఆలయ అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 2 వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 27న సీతారాముల కళ్యాణం, 28న పట్టాభిషేకం నిర్వహించనున్నారు. కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.
NGKL: మన వారసత్వపు పండుగ ఉగాది అని మంత్రి జూపల్లి కృష్ణారావు అభివర్ణించారు. పండుగలు, ఆచారవ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు, కళలు, జాతిని సజీవంగా నిలుపుతాయన్నారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతులు, ప్రజలకు అన్నిరంగాల్లో శుభాలను చేకూర్చాలి అని మంత్రి ఆకాంక్షించారు.
KNR: చొప్పదండి మండలంలోని లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయం జాతర మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈనెల 21 నుంచి 23 వరకు మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. మొదటి రోజు స్వామివారి గుట్టపైకి చేరిక, 22న కళ్యాణోత్సవం, 23న బండ్లు, జాతర మహోత్సవం జరుగుతాయి. భక్తుల కోసం నీరు, వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
MBNR: జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు ఎంఎస్ కే ఫంక్షన్ హాల్‌లో బుధవారం రాత్రి నిర్వహించిన ఇఫ్తార్ బిడ్డలకు మాజీమంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మైనార్టీ సోదరులకు రంజాన్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్నేహపూర్వక వాతావరణంలో రంజాన్ వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు.
NZB:10th పరీక్షల్లో నిబంధనలు ఉల్లంఘించిన 9 మంది సిబ్బందిపై నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి చర్యలు తీసుకున్నారు. బుధవారం జరిగిన 2వ భాష (హిందీ/తెలుగు) ప్రశ్నపత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే ఇందుకు కారణం. ఆలూరు, మెండోరా, బోధన్ పరిధిలోని పరీక్షాకేంద్రాల నుంచి ఈ పేపర్లు బయటకు వచ్చినట్లు విచారణలో తేలింది.
PDPL: NTPC Limited CSR-CD ఆధ్వర్యంలో రామగుండంలో యువతి, యువకులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. DGCA, Tally & GST కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నమోదు చివరి తేదీ 30-03-2026గా అధికారులు తెలిపారు. వివరాలకు 9794180335, 8106044670లను సంప్రదించవచ్చు.
RR: చౌదరిగూడలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజు ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇఫ్తార్ విందులు సోదర భావాన్ని పెంపొందిస్తాయని ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షను చేపట్టి వారి కోరికలను తీర్చే విధంగా అల్లా కరుణించాలని ప్రార్థిస్తారన్నారు.
VKB: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని “మట్టి పాత్రలు వాడండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి-కుల వృత్తులను ప్రోత్సహించండి” అనే నినాదంతో రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమారు అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్‌లో మట్టి పాత్రలను మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మంత్రి పొన్నంను అభినందించారు.