SRCL: కోనరావుపేట మండలంలోని ముస్లింలకు ప్రభుత్వం సరఫరా చేసిన రంజాన్ గిఫ్ట్‌లను అధికారులు, కాంగ్రెస్ నాయకులు బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తుందని అన్ని మతాలకు ప్రోత్సాహాన్ని అందిస్తుందని తహసీల్దార్ వరలక్ష్మి అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఎల్లయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఫిరోజ్ పాషా పాల్గొన్నారు.
PDPL: మంథని JNTU ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం జాతీయ గ్రీన్ కార్ప్స్ కార్యక్రమాలను రాష్ట్ర ప్రాజెక్టు అధికారి విద్యా సాగర్ పరిశీలించారు. ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర కీలకమని చెప్పారు. ఈ మేరకు విద్యార్థులు మట్టి విగ్రహాలు, సీడ్ బాల్స్, బట్ట సంచుల తయారీలో పాల్గొన్నారు.
KMR: తెనుగోళ్ల (ముదిరాజుల) తొలి పండగగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లాలో ముదిరాజులు ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. జెండా గద్దె రంగుతో అలకరించారు. అనంతరం సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ముదిరాజుల కులదైవం పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి జెండాను ఎగరవేస్తారు. ఈ వేడుకలు సంప్రదాయబద్ధంగా, భక్తి శ్రద్ధల మధ్య కొనసాగుతాయి.
SDPT: నంగునూరు మండలం నర్మెట వద్ద ₹300 కోట్లతో నిర్మించిన ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని ఈ నెల 22న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దీనికోసం అధికారులు హెలిప్యాడ్, బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా మార్చి 20 నుంచి 22 వరకు మూడు రోజుల పాటు రైతు మహోత్సవం (రైతు మేళా) నిర్వహించనున్నారు. కలెక్టర్ కే. హైమావతి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.
NLG: త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, ఓ లంబాడా నేతకు బెర్తు దక్కే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. జిల్లా నుంచి ఆ సామాజికవర్గం నుంచి బాలునాయక్ ఉన్నారు. ఇక మరో నేత రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం కళ్లలో వత్తులేసుకుని చూస్తున్నారు. త్వరలోనే మంత్రిని అవుతానంటూ ఆయన చౌటుప్పల్‌తో పాటు పలు చోట్ల కామెంట్స్ చేశారు.
KMM: ఖమ్మం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నేతృత్వంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. అటవీ, రెవెన్యూ భూముల సరిహద్దు వివాదాల పరిష్కారానికి జాయింట్ సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాల్లో సమాంతరంగా సర్వే బృందాల ద్వారా క్షేత్రస్థాయిలో సరిహద్దులను ఖరారు చేయాలని సూచించారు.
NRPT: పవిత్ర రంజన్ నెల ఎంతో విశిష్టమైనదని ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు. నారాయణపేట పట్టణంలోని జామ మస్జిద్, హాజిఖాన్ పేట మస్జిద్‌లలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులకు పండ్లు తినిపించి ఉపవాస దీక్ష విరమింపజేశారు. ముందస్తుగా రంజన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి పండుగను సంతోషంగా జరుపుకోవాలన్నారు.
SRD: అమెరికా, ఇజ్రాయిల్ కలిసి యుద్ధం పేరుతో ఇరాన్‌లో మారన హోమం సృష్టిస్తున్నారని CPM రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చుక్కా రాములు అన్నారు. పటాన్ చెరు శ్రామిక భవన్‌లో CPM కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. అమెరికా, ఇజ్రాయిల్‌లు వ్యాపార లాభాక్షతో ఇరాన్ పై విరుచుకుపడుతున్నాయని అన్నారు. మోడీ సర్కారు మధ్యవర్తిత్వం నెరిపి యుద్ధం ఆపే ప్రయత్నం చేయాలన్నారు.
MHBD: జిల్లా ఈదులపూసపెళ్లి సమీపంలోని మూలమలుపు వద్ద బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఓ టాటా ఏసీ వాహనం అదుపుతప్పి బలంగా చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ వెంకన్నకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన వాహనదారులు గాయపడిన వెంకన్నను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
SDPT: తెలుగు నూతన సంవత్సరం ‘పరాభవ’ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది అందరి కష్టాలు తొలగి, విజయాలకు నాంది కావాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో కొత్త వెలుగులు నిండాలని, సమాజంలో ఆధ్యాత్మికత పెరగాలని కోరుకుంటూ, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆనందోత్సవాల మధ్య ఈ పర్వదినాన్ని జరుపుకోవాలని ఆయన సందేశమిచ్చారు.
HYD: ఉగాది పర్వదినానికి ప్రతీకగా నిలిచే షడ్రుచుల సమ్మేళనమైన పచ్చడిలో కీలకమైన చేదు రుచి ఈసారి దుర్లభమైంది. ఫంగస్ తెగుళ్లు విస్తృతంగా ప్రబలడంతో వేప పువ్వు కొరత నెలకొంది. HYD నగరంతో పాటు పరిసర శివారు ప్రాంతాల్లోనూ వేప పువ్వు అందుబాటులో లేదు. కొందరు ఇతర జిల్లాల నుంచి తెచ్చిన వేప పువ్వును అధిక ధరలకు విక్రయిస్తున్నారు. చిన్న రెమ్మకే రూ. 25 వసూలు చేస్తున్నారు.
గద్వాల జిల్లా సమీపంలో వెలసిన జమ్మిచెడు జమ్ములమ్మ అమ్మవారికి గురువారం పరాభవ నామ సంవత్సరాది ఉగాది సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారికి కృష్ణా నది జరాలతో అభిషేకం, ఆకు పూజ, హోమం, తదితర కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగు కొత్త సంవత్సరం వచ్చిన సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ భక్తులు హాజరైనట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
సూర్యాపేట జిల్లా ప్రజలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. పరాభవ నామ సంవత్సరంలో అంతా మంచే జరగాలని, ప్రజలందరి జీవితాల్లో ఆశలు చిగురించాలని కోరారు. ప్రకృతి కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, రైతులతో పాటు అన్ని రంగాల్లో ప్రజలు అభివృద్ధిలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ASF: పెంచికల్ పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన గర్భిణీ సమ్మక్క హత్య కేసులో నిందితుడు కేర్కర్ జలపతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో మోసం చేసి, ఆమె గర్భం దాల్చడంతో అడవిలోకి తీసుకెళ్లి నిందితుడు దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాగజ్ నగర్ DSP వహీదుద్దీన్ ఆధ్వర్యంలో నిందితుడిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచి, రిమాండ్ తరలించారు.
JGL: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన మారుపాక వినోద్ స్మారకార్థం అతని స్నేహితులు కోరుట్ల పట్టణంలోని పాత మున్సిపల్ ముందు చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని వినోద్ తండ్రి చేతుల మీదుగా ప్రారంభించారు. వినోద్‌పైన ఉన్న అభిమానంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు అతడి మిత్రులు తెలిపారు.