MHBD: ఉపాధి హామీ పనులను వ్యవసాయానికి అనుసంధానం చేసి రైతాంగానికి మేలు చేయాలని, మక్కలను మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కోరుతూ అదనపు కలెక్టర్కు రైతు సంఘం నేతలు వినతి పత్రం అందజేశారు. రైతు సంఘం నాయకులు సుధాకర్ రెడ్డి, నాగేశ్వరరావు మాట్లాడుతూ… రైతు సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, రైతులు పండించిన పంటకు మద్దతు ధర చెల్లించాలన్నారు.